4,273 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్ గురించి ఆశక్తికరమైన విషయాలు

Written By:

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న రవాణా మార్గాలలో ఎంతో మంది ఇష్టపడుతున్నది రైలు మార్గం ఇందులో ఎలాంటి అనుమానము లేదు. ఎందుకంటే భారతీయ రైల్వే ప్రారంభం అయినప్పటి నుండి నేటి వరకు ప్రతి రోజు దేశం నలుమూలల నుండి ప్రయాణికులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేస్తోంది. ప్రయాణికుల మరియు సరుకు రవాణాలో ఇండియన్ రైల్వే దేశానికి ట్రాన్స్‌పోర్ట్ పరంగా వెన్నముక అని చెప్పవచ్చు.

ఇంతటి ప్రఖ్యాతి గల ఇండియన్ రైల్వేలోని డిబ్రూఘర్ మరియు కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ గురించి ముందుగా తెలుసుకోవాలి. సుదూర దూరం పరుగులు పెట్టే వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు గురించి ఆసక్తికరమైన విషయాలు క్రింద గల స్లైడర్లలో కలవు.

డిబ్రూగర్ మరియు కన్యాకుమారి మధ్య పరుగులు పెట్టే ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు భారత్‌లోని ఈశాన్యంలో గల అస్సామ్ నుండి దక్షిణాన గల తమిళనాడు వరకు ప్రయాణిస్తుంది.

వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు బండి మొత్తంగా 80 గంటల 15 నిమిషాల సమయంలో సగటున 4,273 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

డిబ్రూఘర్ మరియు కన్యాకుమారి తన మొత్తం ప్రయాణంలో ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు 57 స్టేషన్లలో ఆగుతుంది.

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో వివేక్ ఎక్స్‌ప్రెస్ రికార్డులను నమోదు చేసుకునే విధంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అత్యధిక దూరం మరియు అత్యధిక సమయం పాటు పరుగులు పెట్టే రైలుగా ముద్రవేసుకుంది.

నాలుగు సాధారాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ సమానం. స్వామి వివేకానంద 150 వ జన్మదిన సందర్భంగా ఈ రైలు సేవలను ప్రారంభించారు. 2011-2012 బడ్జెట్‌లో దీనికి చోటు కల్పించారు.

డిబ్రూఘర్-కన్యాకుమారి ఏడు భారతీ రాష్ట్రాల మీదుగా పరుగులు పెడుతోంది. అందులో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం

ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి ప్రయాణ మార్గంలో డీజల్ ఇంజన్ మరియు రెండవ ప్రయాణ మార్గంలో విద్యుత్ ఇంజన్‌ను వినియోగించుకుంటుంది.
Picture credit: SAGAR PRADHAN/flickr

డిబ్రూఘర్-కన్యాకుమారి రైలు వేగం గంటకు 50.4 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

వివేక్ ఎక్స్‌ప్రస్ రైలులో సౌకర్యాల పరంగా ఎ/సి కోచ్‌లు, స్లీపర్ కోచ్‌లు మరియు సాధారణ కోచ్‌లు కలవు.

డిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ ద్వారా వారాంతపు సర్వీసుగా నడుస్తోంది. ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు కన్యాకుమారిలో మధ్యాహ్నం 2:45 నిమిషాలకు బయలుదేరి ఆ తరువాత ఐదవ రోజు ఉదయం 3:30 నిమిషాలకు డిబ్రూఘర్ చేరుకుంటుంది.

టాటా టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ ఫోటోలను వీక్షించండి....

మారుతి సుజుకి 2017 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫోటోలను వీక్షించండి....

టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటోలను వీక్షించండి.....

మారుతి సుజుకి ఇగ్నిస్ క్రాసోవర్ ఫోటోలను వీక్షించండి....

Read more on: #రైలు #rail
Story first published: Monday, March 14, 2016, 11:06 [IST]
English summary
Interesting Facts About Dibrugarh Kanyakumari Vivek Express
Please Wait while comments are loading...

Latest Photos