చిన్న పట్టణాలకు విమానయాన సేవల విస్తరణ కోసం డార్నియర్ విమానాలను సేకరిస్తున్న ఎయిర్ ఇండియా

సుమారుగా దశాబ్దం తరువాత ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ లాభాల బాట పట్టింది. ఇప్పుడు చిన్న సంస్థలతో జట్టు కట్టి చిన్న చిన్న పట్టణ మరియు నగరాలకు విమాన సేవలను విస్తరించడానికి సన్నద్దం అవుతోంది.

By Anil

విమాన ప్రయాణాన్ని మధ్య తరగతి ప్రజలకు చేరువ చేస్తూ విమానయాన రంగాన్ని మరింత సరళతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం UDAN పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఎయిర్ ఇండియా ప్రాంతీయ సర్వీసులను నడపడానికి ప్రణాళిక రచిస్తోంది.

డార్నియర్ విమానాలు

అందుకోసం ఎయిర్ ఇండియా సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి సుమారుగా 10 డార్నియర్ విమానాలను లీజుకు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

డార్నియర్ విమానాలు

భారతీయ సాయుధ బలగాలకు మరియు యురోపియన్ మార్కెట్ల కోసం విమానాలను అభివృద్ది చేస్తున్న స్విస్ సాంకేతిక సంస్థ ఆర్‌యుజి లైసెన్స్ క్రింద దేశీయ గగన ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్ఏఎల్ డార్నియర్ 228 అనే విమానాలను తయారు చేస్తోంది.

డార్నియర్ విమానాలు

చిన్న పరిమాణంలో నూతన విమాన సర్వీసులను ప్రారంభించడానికి సిద్దమైన ఎయిర్ ఇండియా ఈ ప్రాజెక్ట్‌లో సాధ్యాసాద్యాలను పరిశీలించడానికి మూడు కమిటీలను వేసింది.

డార్నియర్ విమానాలు

పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తరువాత చివరగా సేకరించే రిపోర్ట్స్ ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని ఎయిర్ లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వని లోహని తెలిపారు.

డార్నియర్ విమానాలు

ప్రస్తుతం ఉన్న మూడు కమిటీలు కూడా ఫైనాన్స్, ఆపరేషన్స్ మరియు ఇంజనీరింగ్ కు సంభందించిన వివరాలను సేకరించనున్నాయి. వీటి రిపోర్ట్స్ ఆధారంగా డార్నియర్ విమానాలను లీజుకు తీసుకోవాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుందని లోహని తెలిపారు.

డార్నియర్ విమానాలు

ప్రస్తుతం భారత ప్రభుత్వాధీనంలో ఉన్న విమానయాన సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్, బాంబర్‌డైయర్ మరియు ఏటిఆర్ వంటి విమాన తయారీ సంస్థలు ఉత్పత్తి చేసిన విమానాలను వినియోగిస్తున్నాయి. అయితే మొదటి సారిగా భారత ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ హెచ్ఏఎల్‌కు చెందిన విమానాలను ఎయిర్ ఇండియా వినియోగించనుంది.

డార్నియర్ విమానాలు

భారత సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గత మాసంలో UDAN స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా 20 కన్నా తక్కువ సీట్లు, 21 నుండి 80 సీటింగ్ సామర్థ్యం మరియు 80 కన్నా ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న విమానాలను నడిపే అవకాశాన్ని విమానయాన సంస్థలకు కల్పించింది.

డార్నియర్ విమానాలు

డార్నియర్ విమానాలను లీజుకు తీసుకుని అందుబాటులోకి తీసుకువస్తే ప్రస్తుతం సర్వీసులో లేని మరియు సర్వీసులో ఉన్న చిన్న విమానాశ్రయాల ద్వారా సామాన్య ప్రజలకు విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

డార్నియర్ విమానాలు

UDAN స్కీమ్ ప్రకారం ఒక గంట ప్రయాణం ఉన్న దూరాలకు నడిచే విమానాల్లో ఒక్కొక్కరికి ప్రయాణ ధర ను రూ. 2,500 లుగా నిర్ణయించారు. ప్రయాణ దూరం 476 నుండి 500 కిలోమీటర్ల మద్య ఉండాలి.

డార్నియర్ 228 విమానం గురించి

డార్నియర్ విమానాలను మొదటి సారిగా 1981 లో పరిచయం చేశారు. మరియు మొదటి డార్నియర్ విమాన సేవలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సేవలకు వినియోగించారు.

డార్నియర్ 228 విమానం గురించి

సాధారణ అవసరాలకు ఉపయోగించే ఈ విమానంలో రెండు గారెట్టీ టిపిఇ331 టుర్బో ఇంజన్‌లను అందించారు. దీనిని ముఖ్యంగా తక్కువ దూరంలో టేకాఫ్ మరియు ల్యాండ్ అయ్యే విమానం అని కూడా అంటారు.

డార్నియర్ 228 విమానం గురించి

అన్ని రకాల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించే దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ మరియు దీని ప్రయాణం ఎంతో నాణ్యమైనది.

డార్నియర్ 228 విమానం గురించి

ఇందులో మొత్తం 19 ప్రయాణించవచ్చు మరియు కొంత మేర కార్గో రవాణాకు కూడా దీనిని వినియోగించుకోవచ్చు.

డార్నియర్ 228 విమానం గురించి

ఒక్క డార్నియర్ 228 విమానం యొక్క ధర సుమారుగా 7,000,000 అమెరికన్ డాలర్లుగా ఉంది.

డార్నియర్ 228 విమానం గురించి

  • పాక్‌‌ను చిధ్రం చేసే భారతదేశపు 10 శక్తివంతమైన యుద్ద విమానాలు
  • మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
  • దేశీయంగా ఎగరనున్న మహీంద్రా విమానాలు

Most Read Articles

English summary
Read In Telugu: Interesting Facts About Dornier 228 Plane
Story first published: Saturday, November 5, 2016, 11:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X