భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్, ఇటీవలే తమ కండలు తిరిగన కారు (మజిక్యులర్) కార్ 'ఫోర్డ్ మస్టాంగ్' (Ford Mustang)లో ఓ అప్‌డేటెడ్ వెర్షన్‌ను గ్లోబల్ మార్కెట్లకు పరిచయం చేసిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఫోర్డ్ తమ మస్టాంగ్ సూపర్‌కారును ఇండియాలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఫోర్డ్ తమ మస్టాంగ్ కారును ఈ ఏడాది దీపావళి నాటికి మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటికే మస్టాంగ్ కారులో రైట్-హ్యాండ్ డ్రైవ్ (కుడి చేతి వైపు స్టీరింగ్) కలిగిన వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేకించి భారత్ వంటి (ఆర్‌హెచ్‌డి) మార్కెట్ల కోసం ఈ కారును డిజైన్ చేశారు.

ఫోర్డ్ మస్టాంగ్ కారుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

తొలిసారిగా ఫోర్డ్ మస్టాంగ్‌ను కాన్సెప్ట్ రూపంలో అక్టోబర్ 7, 1962లో న్యూయార్క్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో రెండవ ప్రోటోటైప్‌ను అక్టోబర్ 6, 1963లో వాట్కిన్స్‌లో పరిచయం చేశారు.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

ప్రొడక్షన్ వెర్షన్ ఫోర్డ్ మస్టాంగ్ కారును తొలిసారిగా ఏప్రిల్ 17, 1964లో న్యూయార్క్‌లో నిర్వహించిన వరల్డ్ ఫెయిర్‌లో ప్రదర్శించారు.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

ఫోర్డ్ మస్టాంగ్ విడుదలైన మొదటి రోజునే (1964లో) 22,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. కేవలం రెండేళ్లలో 10 లక్షలకు పైగా మస్టాంగ్ కార్లు అమ్ముడుపోయాయి.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

ఫోర్డ్ మస్టాంగ్ కార్లలో ఉపయోగించిన ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్‌ను 1960వ కాలంలో పెర్ఫార్మెన్స్ వెర్షన్లుగా పరిగణించే వారు.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

ఫోర్డ్ మస్టాంగ్ కారు మొదటి విఐఎన్ నెంబర్ - 5F08F100001. ఫోర్డ్ మస్టాంగ్ కారుపై ఉండే గుర్రపు లోగోని డిజైన్ చేసినది ఫిల్ క్లార్క్.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

ఫోర్డ్ మస్టాంగ్ ఫాస్ట్‌బ్యాక్ కారును అక్టోబర్ 1, 1964లో ప్రవేశపెట్టారు. తొలి మస్టాంగ్ కోబ్రా కారును డిసెంబర్ 17, 1992లో విడుదల చేశారు.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

ఫోర్డ్ మస్టాంగ్ 2-డోర్ కూపే (2 మరియు 2+2 సీటింగ్), హ్యాచ్‌బ్యాక్, ఫాస్ట్‌బ్యాక్ మరియు కన్వర్టిబల్ బాడీ స్టయిల్స్‌లో లభిస్తుంది. స్టాండర్డ్ ఫోర్డ సెడాన్ వేరియంట్ మస్టాంగ్ అస్సలు తయారే కాలేదు.

భారత్‌కు రానున్న ఫోర్డ్ మస్టాంగ్ కారు.. ఇంట్రెస్టింగ్ డిటేల్స్

మస్టాంగ్ కూపే మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో (3.7 లీటర్ వి6, 5.0 లీటర్ మస్టాంగ్ జిటి, 5.8 లీటర్ సూపర్‌ఛార్జ్‌డ్ వి8) లభిస్తుంది.

Most Read Articles

English summary
Ford has recently introduced its all-new iconic muscle car the Mustang. They have been contemplating to launch this vehicle in India as their flagship model.
Story first published: Wednesday, April 1, 2015, 9:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X