భారత రైల్వే గురించి ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన నిజాలు

ఇండియన్స్‌కు ఆటోమొబైల్స్ కంటే ముందుగా పరిచయమయ్యింది రైలు బండి. దాదాపుగా 170 సంవత్సరాల క్రితం తెల్ల దొరలు ప్రారంభించిన రైలు వ్యవస్థ విద్యుత్ తీగలు దేశం మొత్తం పాకినట్లు రైలు పట్టాలు దేశం మొత్తం పరచుకున

By N Kumar

ఇండియన్స్‌కు ఆటోమొబైల్స్ కంటే ముందుగా పరిచయమయ్యింది రైలు బండి. దాదాపుగా 170 సంవత్సరాల క్రితం తెల్ల దొరలు ప్రారంభించిన రైలు వ్యవస్థ విద్యుత్ తీగలు దేశం మొత్తం పాకినట్లు రైలు పట్టాలు దేశం మొత్తం పరచుకున్నాయి. వారి పరిజ్ఞానంతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల రైల్వే వ్యవస్థలలో ఇండియన్ రైల్వే ఒకటిగా నిలిచింది.

సుధీర్ఘ చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వే గురించి ఎన్నో ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. ఇండియన్ రైల్వే గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి కథనంలో....

అత్యంత వేగవంతమైన రైలు

అత్యంత వేగవంతమైన రైలు

ప్రస్తుతం న్యూ ఢిల్లీ-భోపాల్ మధ్య పరుగులు పెడుతున్న శతాబ్ధి ఎక్స్ ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలు.దీని అత్యధిక వేగం గంటకు 150 కిలోమీటర్లు

Picture credit: Bahnfrend/Wiki Commons

నెమ్మదిగా నడిచే రైలు

నెమ్మదిగా నడిచే రైలు

ఇది ఊటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 10 కిలోమీటర్లు. అంటే అత్యంత వేగంగా పరుగులు పెట్టే శతాబ్ధి రైలు వేగంలో 15 వ వంతు అన్నమాట. తక్కువ వేగంతో ప్రయాణించే మెటుపాళ్యం ఊటి నిలగిరి ప్యాసింజర్ రైలు ఇంత తక్కువ వేగంగా ఎందుకు ప్రయాణిస్తుందో తెలుసా ఎపుడు కొండప్రాంతాల్లో నడవాల్సి ఉండటం వలన దీనికి ఈ స్పీడ్ లిమిట్‌ను పెట్టారు.

Picture credit: Gcheruvath/Wiki Commons

ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు

ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు

దేశ వ్యాప్తంగా గల రైలు బండ్లలో ఎక్కువ దూరం పరుగులు పెట్టే రైలు ఉంది తెలుసా ? ఇది డిబ్రూఘర్ మరియు నాగ్‌పూర్ మద్య గల 4273 కిలోమీటర్ల దూరాన్ని చేధించే వివేక్ ఎక్స్ ప్రెస్ దీనికి బాగా పేరు గాంచింది. దూరం మరియు సమయం పరంగా చూసిన కూడా ఇదే ముందు స్థానంలో ఉంది.

Picture credit: kochigallan

అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు

అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు

ఎక్కువ దూరం ప్రయాణించే అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు బండి కూడా ఇండియన్ రైల్వేలో కలదు. కేవలం మూడు కిలోమీటర్లు దూరం మాత్రమే గల నాగ్‌పూర్-అజ్‌ని స్టేషన్ల మధ్య ఈ రైలు తిరిగుతుంది. ఇంత తక్కువ దూరం సేవలు అందించడానికి గల కారణం నాగ్‌పూర్ నుండి అజ్‌ని పారిశ్రామిక వాడకు కార్మికులను చేరవేయడానికట.

Picture credit: YouTube

నాన్‌-స్టాప్‌గా పరుగులు పెట్టే పొడవైన రైలు మార్గం

నాన్‌-స్టాప్‌గా పరుగులు పెట్టే పొడవైన రైలు మార్గం

అత్యంత పొడవైన రైలు మార్గం ఉన్నప్పటికీ నాన్ స్టాప్‌గా ఎక్కువ దూరం నడిచే రైలు కూడా ఉంది. త్రివేండ్ర-హజరత్ నిజామొద్దీన్ మధ్య పరుగులు పెట్టే రాజధాని ఎక్స్ ప్రెస్ దాదాపుగా 528 కిలోమీటర్ల పాటు వడోదర నుండి కోట వరకు నాన్‌-స్టాప్‌గా పరుగులు పెడుతుంది.

Picture credit: V Malik/Wiki Commons

అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు

అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు

ఇండియన్ రైల్వేలో అత్యంత పొడవైన రైల్వే స్టేషన్ పేరు గల స్టేషన్ ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో గల రేణిగుంట సమీపంలో ఉంది. దీని పేరు వెంకట నరసింహరాజు వారి పేట రైల్వే స్టేషన్. ఇది రేణిగుంట-అరక్కోణం మద్య కలదు.

Picture credit: topworldfact

అతి చిన్న పేరు గల రైల్వేస్టేషన్

అతి చిన్న పేరు గల రైల్వేస్టేషన్

పొడవైన పేరు గల రైల్వే స్టేషన్ లాగే పొట్టి పేర్లున్న రైల్వే స్టేషన్‌లు కుడా ఇండియన్ రైల్వే‌లో ఉన్నాయి. అందులో ఒడిస్సా లోని ఐబి మరియు గుజరాత్‌లోని ఓడి స్టేషన్లు కలవు.

Picture credit: storyglitz

ఎక్కువ స్టాపులు గల రైళ్లు

ఎక్కువ స్టాపులు గల రైళ్లు

భారతీయ రైల్వేలో ఎక్కుల స్టాపులు గల రైలు ఎక్స్‌ప్రెస్/మెయిల్ ట్రైన్ ఇది హౌరా-అమృత్‌సర్‌ల మధ్య పరుగు పెడుతుంది. దీనికి దాదాపుగా 115 స్టాపులు కలవు.

Picture credit: Smeet Chowdhury/Wiki Commons

ప్రతి సారి ఆలస్యంగా వచ్చే రైలు

ప్రతి సారి ఆలస్యంగా వచ్చే రైలు

రైళ్లు లేటుగా రావడం సర్వసాధారణం కాని 10 నుండి 12 గంటల పాటు లేటుగా రావడం అనేది సాధారణ విషయం కాదు. గౌహతి-త్రివేడ్రం మధ్య పరుగులు తీసే రైలు ఒక ట్రిప్ సమయం 65 గంటల 5 నిమిషాలు అయితే ఇది ప్రతి సారి 10 నుండి 12 గంటల పాటు లేటుగా వస్తుంది. భారతీయ రైల్వేలో ఇంత సమయం పాటు లేటుగా వచ్చే రైలు ఇదేనట.

Picture credit: indiarailinfo

ఒకే ఊరిలో రెండు రైల్వే స్టేషన్లు

ఒకే ఊరిలో రెండు రైల్వే స్టేషన్లు

ఒక్క రైల్వే స్టేషన్‌ కూడా లేని ఊర్లు కోకొల్లలుగా ఉంటే ఈ ఊరికి మాత్రం రెండు రైల్వే స్టేషన్లు కావాలంట. ఇలాంటి రైల్వే స్టేషన్ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో గల శ్రీరామ్ పూర్ మరియు బెలాపూర్ రైల్వే స్టేషన్లు. ఒకే ట్రాక్‌‌కు ఒక వైపు శ్రీరామ్ పూర్ రైల్వే స్టేషన్ ట్రాక్‌కు మరో వైపు బెల్లా పూర్ స్టేషన్‌కలదు.

Picture credit: railyatri

అత్యంత శక్తివంతమైన రైలు

అత్యంత శక్తివంతమైన రైలు

ఇండియన్ రైల్వే‌లో గల అత్యంత శక్తివంతమైన రైళ్లలో WAG-9 అనే ఎలక్ట్రిక్ రైలు అత్యంత శక్తివంతమైనది. ఇది దాదాపుగా 6,350 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్లో ఎక్కువ మంది చదివినవి:

ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి జీతం ఎంతో తెలుసా....?

కేవలం 2 గంటల్లో ఐదు లక్షలు వసూలు చేసిన ట్రాఫిక్ పోలీసులు

డిజిలాకర్‌లో DL, RC చూపిస్తే, మోడీకి చూపించమన్న పోలీస్: ఎందుకో తెలుసా....?

డిసెంబర్ 1, 2017 నుండి అన్ని ఫోర్ వీలర్ల ఫాస్ట్‌ ట్యాగ్ తప్పనిసరి చేసిన కేంద్రం

Picture credit: Adityamadhav83/Wiki Commons

నాలుగు దిక్కులలో చిట్ట చివరగా ఉన్న రైల్వే స్టేషన్లు

నాలుగు దిక్కులలో చిట్ట చివరగా ఉన్న రైల్వే స్టేషన్లు

దేశానికి గల నాలుగు దిక్కులలో ఉన్న చివరి రైల్వే స్టేషన్లు

ఉత్తరం: బరముల్లా స్టేషన్ జమ్ము అండ్ కాశ్మీర్‌లో కలదు

దక్షిణం: కన్యాకుమారి తమిళనాడులో కలదు

పడమర: గుజరాత్‌లోని నాలియా రైల్వే స్టేషన్

తూర్పు: అస్సాం లోని టిన్సుకియా మార్గంలో గల లెడో స్టేషన్

Picture credit: indiarailinfo

ఎక్కువ మార్గాలను నడుపుతున్న జంక్షన్

ఎక్కువ మార్గాలను నడుపుతున్న జంక్షన్

మతురా జంక్షన్, ఇది ఏడు మార్గాలను పర్యవేక్షిస్తు ఉంది. ఆగ్రా కంట్ బ్రాడ్ గేజ, బ్రాడ్ గేజ్ మార్గం గల భరత్ ‌పూర్, బ్రాడ్ గేజ్ లైన్ గల అల్వార్, బ్రాడ్ గేజ్ మార్గం గల ఢిల్లీ, మీటర్ గేజ్ గల అచ్‌నెరా, మీటర్ గేజ్ మార్గం గల విృందావన్ మరియు మీటర్ గేజ్ మార్గం గల హత్రాస్, కాస్‌గంజ్ మార్గాలు.

Picture credit: Superfast1111/Wiki Commons

ఎక్కువ సమాంతర పట్టాలు గల రూట్

ఎక్కువ సమాంతర పట్టాలు గల రూట్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు పట్టాలు సమాతరంగా అది కూడా పది కిలోమీటర్లు పాటు కలవు. ఇది బాంద్రా-ఆంధేరిల మధ్య కలదు.

Picture credit: Superfast1111/Wiki Commons

రద్దీ రైల్వే స్టేషన్

రద్దీ రైల్వే స్టేషన్

దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ లక్నో, రోజుకు 64 రైళ్లు వస్తుపోతుంటాయి.

Picture credit: Mohit/Wiki Commons

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైవ రైల్వే ప్లాట్‌ఫామ్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైవ రైల్వే ప్లాట్‌ఫామ్

ప్రపంచవ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైల్వే ఫ్లాట్ ఫామ్ఉత్తరల ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో కలదు. దీని పొడవు 1,366.33 మీటర్లు పొడవు కలదు.

Picture credit: Benison P Baby/Wiki Commons

పురాతణమైన రైలు బండి

పురాతణమైన రైలు బండి

ప్రస్తుతం భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్లలో అత్యంత పురాతణమైన రైలు ఫెయిరి క్వీన్. దీనిని 1855 లో తయారు చేశారు. అంతే కాకుండా అత్యంత పురాతణమైన ఆవిరి ఇంజన్ ఇంతవరకు సేవలు అందిస్తున్నందుకు దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పించారు.

Picture credit: Arup1981/Wiki Commons

మొదటి రైలు రోడ్డు

మొదటి రైలు రోడ్డు

దేశీయంగా మొదటి రైలు రోడ్డును నిర్మించింది ఎవరో తెలుసా, బ్రటీషు వారు ఏమాత్రం కాదు. ఇద్దరు భారతీయులు కలసి మొదటి రైలు రోడ్డును నిర్మించారు. వారు జంషెట్జీ జీజీభోయ్ మరియు జగన్నాథ్ షంకర్‌సేత్ లు

Picture credit: rediff/Wiki Commons

కార్మిక బలం

కార్మిక బలం

ఇండియన్ రైల్వే అత్యంత శక్తివంతమై అతి పెద్ద కార్మిక వ్యవస్థను కలగి ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో ఉన్నఅతి పెద్ద కార్మిక వ్యవస్థ. ప్రస్తుతం దాదాపుగా 1.4 మిలియన్ వరకు కార్మికులు ఇండియన్ రైల్వేలో సేవలు అందిస్తున్నారు.

భారతీయ రైల్వే విస్తీర్ణం

భారతీయ రైల్వే విస్తీర్ణం

ఇండియన్ రైల్వే 64,000 కిలోమీటర్లు పొడవైన రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో నాలుగవ స్థానంలో ఉంది. వరుసగా యుఎస్, రష్యా, చైనాలు ఉన్నాయి.

Picture credit: mapsofindia

చివరి ఆవిరి రైలింజన్లు

చివరి ఆవిరి రైలింజన్లు

ఇండియన్ రైల్వే ఆవిరితో రైలింజన్లను తయారు చేయడం 1972 నుండి నిలిపివేసింది.

Picture credit: Wiki Commons

భారతీయ రైళ్లు రోజు పరుగులు పెడుతున్న దూరం

భారతీయ రైళ్లు రోజు పరుగులు పెడుతున్న దూరం

ఇండియన్ రైల్వేలో గల దాదాపు 14,300 రైళ్లు దేశ వ్యాప్తంగా భూమికి చంద్రునికి మద్య గల దూరానికి మూడున్నర రెట్లు దూరం పరుగులు పెడుతున్నాయి.

 మరుగుదొడ్లు

మరుగుదొడ్లు

మొదటిసారిగా 1891 లో మొదటి శ్రేణి రైళ్లలో తరువాత 1907 నుండి తక్కువ శ్రేణి రైళ్లలో మరుగుదొడ్లను ప్రారంభించడం జరిగింది.

ఎయిర్ కండీషనింగ్

ఎయిర్ కండీషనింగ్

మొదటి సారిగా 1874లో మొదటి శ్రేణి రైళ్లలో ఎ/సి ను ప్రారంభించారు. అప్పట్లో భారత్‌లో గల రైల్వేను గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే అనేవారు.

Picture credit: RegentsPark/Wiki Commons

పొడవైన సొరంగ మార్గం

పొడవైన సొరంగ మార్గం

ఇండియన్ రైల్వేలో గల అత్యంత పొడవైన సొరంగ మార్గం పిర్ పంజల్ సొరంగ మార్గం. దీని పొడవు 11.245 కిలోమీటర్లుగా ఉంది. దీని నిర్మాణం జమ్మూ కాశ్మీర్‌లో 2012 డిసెంబర్‌లో పూర్తి అయ్యింది.

Picture credit: Owais khursheed/Wiki Commons

భూ గర్భ రైల్వే

భూ గర్భ రైల్వే

మొదటి భూగర్భ రైల్వేను కలకత్తా మెట్రోలో ప్రారంభించారు.

Picture credit: WillaMissionary/Wiki Commons

కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్

కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్

కంప్యూటర్ రిజర్వేషన్‌ను చేయడం మొదటి సారిగా ఇండిన్ రైల్వే 1986 లో ఢిల్లీలో ప్రారంభించారు.

Picture credit: indianrailinfoblog.blogspot

విధ్యుత్ రైళ్లు

విధ్యుత్ రైళ్లు

ఇండియన్ రైల్వేలోకి మొదటి సారిగా 1925 ఫిబ్రవరి మూడున ఎలక్ట్రిక్ రైళ్లు ప్రవేశించాయి. మొదటి రైలు బొంబాయి విటి మరియు కుర్లా స్టేషన్ల మధ్య సేవలు ప్రారంభించింది.

Picture credit: Shan.H.Fernandes/Wiki Commons

చక్రాల మీద ఇంద్ర భవనం

చక్రాల మీద ఇంద్ర భవనం

ఇండియన్ రైల్వే 1982 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సంధర్బంగా ప్యాలెస్‌ను తలపించే ఇంధ్ర భవనంలాంటి లగ్జరీ రైలును ప్రారంభించింది.

అతి ఘోరమైన రైలు ప్రమాదం

అతి ఘోరమైన రైలు ప్రమాదం

1981 జూన్ 6 న జరిగిన రైలు ప్రమాదం ఇండియన్ రైల్వేలో అత్యంత ఘోరమైనది. దాదాపుగా 80 మంది ప్రయాణికులతో మన్సి మరియు సహారా రూట్ మద్య ప్రయాణిస్తున్నప్పుడు బాగమతి నది వంతెన మీద ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో దాదాపుగా 500 మంది వరకు మృతి చెందినట్లు గణాకాంలు వెల్లడించాయి.

 ప్రయాణికుల సంఖ్య

ప్రయాణికుల సంఖ్య

రోజుకు 25 మిలియన్ ప్రయాణికులను ఇండియన్ రైల్వే వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.

మొత్తం రైళ్ల సంఖ్య

మొత్తం రైళ్ల సంఖ్య

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ప్రతి రోజు దాదాపుగా 19,000 వరకు తిరుగుతున్నాయి. ఇందులో 12,000 వరకు ప్రయాణికుల కోసం మరియు 7,000 వరకు సరుకు రవాణా కోసం

రైల్వే స్టేషన్ల సంఖ్య

రైల్వే స్టేషన్ల సంఖ్య

మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థలో 7,083 రైల్వే స్టేషన్లు కలవు.

ఛార్జీల వివరాలు

ఛార్జీల వివరాలు

ప్రస్తుతం ఇండియన్ రైల్వే ఛార్జీల మోత మోగిస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ మరియు కలకత్తాల మద్య గల 1500 కిలోమీటర్లు ప్రయాణానికి సాదారణ ఛార్జీ 250 రుపాయలుగా ఉండేది. ఇదే దూరం ఇతర దేశాలలో ప్రయాణించాలంటే దీని ధరకు 10 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ట్రాన్సిట్ ట్రైన్స్

ట్రాన్సిట్ ట్రైన్స్

సిటీ రవాణా కోసం ముంబాయ్ లోకల్ ట్రైయిన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం 15 కోచ్‌లను అందించారు.

ఛత్రపతి శివాజీ టెర్మినస్

ఛత్రపతి శివాజీ టెర్మినస్

ముంబాయ్‌లో గల ఛత్రపతి శివాజీ టెర్మినస్ ద్వారా సంవత్సరానికి దాదాపుగా 33 మిలియన్ మంది ప్రయాణికులు వస్తుపోతుంటారు. మరియు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారిచే గుర్తంపు పొందిన ఏకైక భారతీయ రైల్వే స్టేషన్ ఇది.

పురాతన పద్దతిలో ట్రాక్ మరమ్మత్తులు

పురాతన పద్దతిలో ట్రాక్ మరమ్మత్తులు

ఇండియన్ రైల్వేలో ఇప్పటికీ కొన్ని ప్రదేశాలలో ట్రాక్ మరమ్మత్తుల కోసం 1853 కాలం నాటి పద్దతులను వినియోగిస్తున్నారు.

భారీ వసూళ్లు

భారీ వసూళ్లు

2011-21 సంవత్సరం కాలంలో ఇండియన్ రైల్వే ఫైన్లు మరియు ఇతర టికెట్ రహిత ప్రయాణికుల నుండి దాదాపుగా 581 కోట్ల రుపాయలు పైబడి వసూలు చేశారు. మరి ఇపుడు ఈ మొత్తం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కరలేదు.

రైల్వే మ్యూజియం

రైల్వే మ్యూజియం

భారతీయ రైల్వే 1977లో జాతీయ రైలు మ్యూజియంను ఢిల్లీలో ఏర్పాటు చేసింది. ఇది ఆసియాలోనే అతి పెద్ద మ్యూజియం. ఇది దాదాపుగా మొత్తం 11 కిలోమీటర్లు విస్తరించి ఉంది.

Picture credit: Bruno Corpet/Wiki Commons

పొడవైన రైల్వే వంతెన

పొడవైన రైల్వే వంతెన

ప్రస్తుతం దేశీయంగా అతి గల అతి పొడవైన రైల్వే వంతెమ కేరళలో కలదు. ఎడప్పల్లీ మరియు వల్లార్పడం ప్రాంతాల మద్య 4.62 కిలోమీటర్లు పొడవు గల దీనిని వెంబనాద్ రైల్ బ్రిడ్జ్ అని పిలుస్తారు.

Picture credit: Rash9745/Wiki Commons

సముద్రపు వంతెన

సముద్రపు వంతెన

భారత దేశపు మొదటి సముద్రపు వంతెన పాంబన వంతెన. తమిళనాడులోని రామేశ్వరం నుండి సమద్రంలో గల పాంబన్ దీవికి రైలు వంతెన నిర్మించారు.

Picture credit: Shubham Gupta/Wiki Commons

రైలు, రోడ్డు వంతెన

రైలు, రోడ్డు వంతెన

క్రింది వైపున రైలు మరియు పై వైపున వాహనాలు వెళ్లే రైలు మరయు రోడ్డు వంతెనను గోదవరి నది మీద నిర్మించారు. ఇది ఆసియాలోనే రెండవ అతి పెద్ద రైలు రోడ్డు వంతెన.

Picture credit: worldtravelserver/Wiki Commons

మొదటి రైల్వే వంతెన

మొదటి రైల్వే వంతెన

ముంబాయ్-థానే మార్గంలో 1854 లో మొదటి రైల్వే వంతెనను నిర్మించారు. దీని పేరు దపూరీ వయాడక్ట్

Picture credit: Wiki Commons

స్వాతంత్ర్యం ముందు నుండి

స్వాతంత్ర్యం ముందు నుండి

భారతీయులకు స్వాతంత్ర్యం రాకమునుపునుండి దాదాపుగా 42 సంస్థలు ఇండియన్ రైల్వేలో భాగస్వామ్యంగా ఉండేవి.

అత్యంత ఎత్తైన వంతెన

అత్యంత ఎత్తైన వంతెన

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎత్తైన రైలు వంతెను చీనాబ్ నది మీద నిర్మిస్తున్నారు. దీనిని ఎత్తు దాదాపుగా 359 మీటర్లు(1,180 అడుగులు) గా ఉండనుంది.

Picture credit: spatialprecision

ఇండియన్ రైల్వేలో మొదటి రైలు సొరంగం

ఇండియన్ రైల్వేలో మొదటి రైలు సొరంగం

1865 లో థానేకు సమీపంలో పార్సిక్ సొరంగాన్ని నిర్మించారు. ఇది భారత దేశపు మొదటి రైలు సొరంగం.

Picture credit: indiarailinfo

ప్రపంచ రికార్డు

ప్రపంచ రికార్డు

ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కువ మార్గాలకు రైళ్లను నడపబడుతున్న స్టేషన్‌గా ఢిల్లీ రైల్వే స్టేషన్ గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది.

సంపద

సంపద

ఇండియన్ రైల్వేకు దాదాపుగా 10.65 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇందులో 90 శాతం వరకు రైల్వే మరియు ఇతరులకు అద్దె కోసం వినియోగిస్తోంది. ప్రస్తుతం 1.13 లక్షల ఎకరాలు ఖాళీగా ఉంది.

భోజనశాల గల రైలు

భోజనశాల గల రైలు

ముంబాయ్-పూనేల మధ్య నడుస్తున్న పురాతణమైన డెక్కన్ క్వీన్ రైలు ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో కలదు.

Picture credit: YouTube

మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు....
  • రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!
  • టైటానిక్-2 షిప్ వస్తోంది, టైటానిక్-1 గురించి మరచిపోండి
  • బీరు, బారు, కారు ఇది విజయమాల్యా తీరు...మాల్యా కారు కలెక్షన్

Most Read Articles

English summary
Interesting Facts About Indian Railways
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X