భారత రహదారుల్లో దాగున్న 12 అద్భుతాలు: వేటికవే ప్రత్యేకం

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబడిన అత్బుతమైన భారతీయ రహదారులు మరియు వంతెనలు

By N Kumar

భారయతీయ రోడ్ల గురించి అనగానే చాలా మంది ఆ ఆరోడ్లు చాలా దరిధ్రంగా ఉంటాయి అనే ధృక్పథంతో ఉంటారు. కాని ఈ ఇందుకు భిన్నంగా భారతీయ రోడ్ల నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.

సాదాసీదా రహదారులతో పాటు రహదారి నిర్మాణంలో ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు కూడా జరిగాయి. సువిశాల ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌లో 11 అద్భుతాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇవాళ్టి కథనంలో అందిస్తోంది.

1. భారత రహదాారుల విస్తరణ మరియు పొడవు

1. భారత రహదాారుల విస్తరణ మరియు పొడవు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొండవైన రోడ్డు రవాణాను కలిగిన దేశంగా భారత్ రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ రహదారుల పొడవు దాదాపుగా 43,20 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. అందులో 79,243 కిలోమీటర్ల జాతీయ రహదారులు మరియు 1,31,899 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు ఉన్నాయి.

2. బెస్ట్ నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే

2. బెస్ట్ నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే

అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశంలోని బెస్ట్ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటి, దీనిని ఒకటవ ఎక్స్‌ప్రెస్‌‍వే అని కూడా అంటారు. మొత్తం 95 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే అహ్మదాబాద్-వడోదరాలను కలుపుతుంది, దీనిని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ క్రింద 2004లో నిర్మించారు.

3. అత్యంత పొడవైన ఫ్రీవే

3. అత్యంత పొడవైన ఫ్రీవే

చెన్నై పోర్ట్ మధురవాయల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో కెల్లా అతి పొడవైన ఫ్రీవే. ఇది 19 కి.మీ పొడవు ఉంది. హైదరాబాద్, బెంగళూరు మరియు హోసూర్ నుండి కొనసాగింపుగా వచ్చిన జాతీయ రహదారి ఇది.

4.అతి పొడవైన జాతీయ రహదారి

4.అతి పొడవైన జాతీయ రహదారి

మన దేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్7. ఇది 4,572 కిమీ పొడవు కలిగి ఉంది. NH-7 రహదారి వారణాసి మరియు కన్యాకుమారిలను కలుపుతుంది.

5. క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్

5. క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్

చెన్నైలోని కత్తిపారా జంక్షన్ వద్ద ఉన్న క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్ దేశంలో కెల్లా అతిపెద్దది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్లవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్. ఇది గ్రాండ్ సథరన్ ట్రంక్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, పూనమల్లే రోడ్, అన్నా మలై జంక్షన్లను కలుపుతుంది.

6. హెబ్బాల అర్బన్ ఫ్లై ఓవర్

6. హెబ్బాల అర్బన్ ఫ్లై ఓవర్

బెంగుళూరులోని హెబ్బాల ఫ్లైఓవర్ దేశంలో కెల్లా అతిపెద్ద అర్బన్ ఫ్లైఓవర్. దీని పొడవు 5.23 కిలోమీటర్లు. ఇది అవుటర్ రింగ్ రోడ్డును, బళ్లారి రోడ్డును కలుపుతుంది. భారతదేశపు సివిల్ ఇంజనీరింగ్ అద్భుతాల్లో హెబ్బాల ఫ్లైఓవర్ కూడా ఒకటి.

7. అతి పొడవైన రివర్ బ్రిడ్జ్

7. అతి పొడవైన రివర్ బ్రిడ్జ్

బిహార్‌లోని గంగా నదిపై నిర్మించిన మహాత్మా గాంధీ సేతు దేశంలో కెల్లా అత్యంత పొడవైన రివర్ బ్రిడ్జ్. పాట్నా, హాజీపూర్‌లను కలిపే ఈ 4-లేన్ బ్రిడ్జ్ పొడవు 5.5 కిలోమీటర్లుగా ఉంది.

8. అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్

8. అతిపొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్

మనదేశంలో కెల్లా అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ రాజమండ్రిలోని గోదావరి నదిపై నిర్మించారు. ఒకే వంతెనపై క్రింది భాగంలో రైలు, పైభాగంలో వాహనాలు వెళ్తుంటాయి. ఇది దేశంలోనే కాదు ఆసియాలోనే రెండవ అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. దీని మొత్తం పొడవు 2.7 కిలోమీటర్లుగా ఉంది.

9. అతి పొడవైన సీ బ్రిడ్జ్

9. అతి పొడవైన సీ బ్రిడ్జ్

దేశంలో కెల్లా అతి పొడవైన సీ బ్రిడ్జ్ బంద్రా-వోర్లీ సీ లింక్. బాంద్రా, వోర్లీ ప్రాంతాలను కలుపుతూపోయే ఇది ప్రతిపాదిత వెస్టర్న్ ఫ్రీవేలో భాగం. కేబుల్ ఆధారిత ఈ బ్రిడ్జ్ పొడవు మొత్తం 22 కిలోమీటర్లు.

10. అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే వంతెన

10. అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే వంతెన

ఒక నదిని దాటడానికి రెండు కొండల మధ్య నిర్మించిన ఈ రైల్వే వంతెన కాశ్మీరులో ఉంది. ఈ రైలు వంతెన ఏకంగా 1,178 అడుగుల ఎత్తులో ఉంది.

11. అతి పొడవైన సొరంగమార్గపు రహదారి

11. అతి పొడవైన సొరంగమార్గపు రహదారి

మన దేశంలో కెల్లా అత్యంత పొడవైన రోడ్టన్నల్ చెనాని-నాష్రి టన్నల్. జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న చెనాని వద్ద ఈ టన్నల్ రోడ్డును నిర్మించారు. ఈ టన్నల్ మొత్తం పొడవు 9.2 కిలోమీటర్లుగా ఉంది.

12. అతి పెద్ద టోల్ ప్లాజా

12. అతి పెద్ద టోల్ ప్లాజా

దేశంలో కెల్లా అతిపెద్ద టోల్ ప్లాజా ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్లో ఢిల్లీ-గుర్గావ్ బార్డర్ వద్ద ఉంది. ఇక్కడ 32 టోల్ బూత్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే కాదు ఆసియా మొత్తంలో కెల్లా అతిపెద్ద టోల్ ప్లాజా.

ఎక్కువ మంది చదివిన కథనాలు....
  1. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు
  2. విమానం ఎక్కాలనుకుంటున్నారా ? అయితే వీటిని మాత్రమే ఎంచుకోండి
  3. భారతీయ మార్కెట్లో మొదటి స్థానంలో ఉన్న ఆక్టివా 125 ను ప్రక్కకి నెట్టిన గస్టో 125 స్కూటర్...!

Most Read Articles

English summary
Read In Telugu: Interesting Facts About Indian Roads That Will Blow Your Mind
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X