భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

By N Kumar

భారతీయ సైన్యం అతి తక్కువ బరువున్న యుద్ద హెలికాప్టర్‌ను కలిగి ఉంది. లైట్ కాంబాట్ హెలికాప్టర్ (ఎల్‌సిహెచ్) గా పిలువబడే ఈ హెలికాప్టర్ ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైనదిగా పరిగణించారు. ఇంతటి పేరు గాంచిన ఈ ఎల్‌సిహెచ్ హెలికాప్టర్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేశారు.

ఈ సాయుధ యుద్ద హెలికాప్టర్ శత్రువుల మీదకు మిస్సైల్స్‌ను ప్రయోగించడంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకుంది. దీనికి జరిపిన పరీక్షలలో ఇది 70 ఎమ్ఎమ్ గల మిస్సైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇంతటి శక్తివంతమైన హెలకాప్టర్ మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. ఈ ఎల్‌సిహెచ్‌ హెలికాప్టర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు క్రింది స్లైడర్లలో కలదు.

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ యుద్ద హెలికాప్టర్‌గా పేరుగాంచిన ఈ ఎల్‌సిహెచ్ హెలికాప్టర్‌ను కర్ణాటకలోని బెంగుళూరులో గల కేంద్ర ప్రభుత్వ ఆధారిత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగానికి చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసింది.

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

భారీ ఎత్తు వరకు ఎగర గల హెలికాఫ్టర్ భారత సైన్యానికి కార్గిల్ యుద్ద సమయంలో కావాల్సి వచ్చింది. అందుకోసం ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ కోసం దీనిని తయారు చేశారు.

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

ఈ ఎల్‌సిహెచ్‌ యుద్ద హెలికాప్టర్ 2010 మార్చిన లో గగన తలంలో దీనికి పరీక్షలు జరిపారు. కేవలం 20 నిమిషాల సమయంలో తక్కువ ఎత్తు నుండి గరిష్ట ఎత్తుకు చేరుకుందని తెలిపారు. బెంగుళూరు కేంద్రంగా జరిగిన ఈ పరీక్షలలో ఇది సంతృప్తికరమైన ఫలితాలను ఇచ్చిందని రిపోర్ట్ ద్వారా తెలిపారు.

Picture credit: Defence19/Wiki Commons

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

హెచ్‌ఏఎల్ ఈ లైట్ కాంపాబ్ హెలికాప్టర్‌ను తయారు చేయడానికి ప్రేరణ హెఏఎల్‌ దృువ అని తెలిపారు. హెచ్‌ఏఎల్ ఈ హెలికాప్టర్‌ను 184 లో రూపొందించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది సేవలను అందిస్తోంది.

Picture credit: Defence19/Wiki Commons

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

హెచ్‌ఏఎల్ ఈ ఎల్‌సిహెచ్ యుద్ద హెలికాప్టర్‌ తయారీ ప్రాజెక్ట్‌కు ఖర్చు చేసిన మొత్తం విలువ సుమారుగా రూ. 376 కోట్లు అని అంచనా.

Picture credit: Defence19/Wiki Commons

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

ప్రస్తుతం భారత వైమానిక దళం 65 ఎల్‌సిహెచ్ మరియు భారత సైన్యం 114 ఎల్‌సిహెచ్ యుద్ద హెలికాప్టర్లను సమకూర్చుకోవాల్సి ఉంది.

Picture credit: hemant rawat/Wiki Commons

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

హెచ్‌ఏఎల్ ఈ ఎల్‌సిహెచ్ యుద్ద హెలికాప్టర్‌ను మానవ రహిత మరియు సాయుధ రహిత పాత్రలలో కూడా పనిచేసే విధంగా తయారు చేశారు. అంతే కాకుండా ఇది దీని గరిష్ట ఎత్తు వరకు 5.5 టన్నుల బరువును మోయగలదు.

Picture credit: Anand t83/Wiki Commons

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

ఈ ఎల్‌సిహెచ్‌లో కాక్‌పిట్‌లా పని చేసే అద్దం, వివిధ రకాల అవసరాలకు డిస్ల్పేలా పనిచేసే అద్దం ఇందులో కలదు. లేజర్ ద్వారా శత్రువులను గుర్తించే పరిజ్ఞానం మరియు శిరస్త్రాణం ద్వారా కేంద్రాన్ని గురి చూసి ఆయుధాలను ప్రయోగించే టెక్నాలజీలను ఇందులో పరిచయం చేశారు.

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు

ప్రత్యేకమైన సాయుధ డిజైన్‌ను పోలి ఉన్న బాడీ, మరియు ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ల్యాండ్ చేసే ల్యాండింగ్ గేర్, సాయుధ భద్రత, అణు శక్తి గల ఆయుధాలతో దాడులు చేయడం మరియు స్వయంగా ఇంధన ట్యాంకులను సీల్ చేసుకునేటువంటి ఎన్నో ప్రత్యేకతల ద్వారా ఇది ప్రాణాంతకమైన మరియు చురుకైన ఎల్‌సిహెచ్ హెలికాప్టర్‍‌గా పేరును గడించింది

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

అత్యధిక వేగం: గంటకు 280 కిలోమీటర్లు లేదా 145 నాట్స్

రేంజ్: 700 కిలోమీటర్లు

గరిష్ట ఎత్తు: 6,500 మీటర్లు

పైలెట్లు: ఇద్దరు

గరిష్ట బరువును మోసుకెళ్లే సామర్థ్యం: 5,800 కిలోలు

భారతదేశపు ఉత్తమ యుద్ద హెలికాఫ్టర్ గురించి కొన్ని విషయాలు
  • జలాంతర్గామిని కోల్పోయిన నార్త్ కొరియా: అమెరికా పైనే అనుమానం..!
  • ఇండియన్ IRNSS పరిజ్ఞానానికి అమెరికా కుదేలు కావాల్సిందే...!!
  • వీటితో మరింత బలమైన రష్యా రక్షణ రంగం

Most Read Articles

English summary
Interesting Facts About Indias Lch Combat Helicopter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X