ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

By N Kumar

మనం మన నిత్యావసర ప్రయాణాలకు ఎన్నో రకాల వాహనాలను ఉపయోగిస్తుంటాం. మానవ జీవతంలో వాహనం ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్స్ రంగం విపరీతంగా అభివృద్ది చెందింది. ఎంతగా అంటే ప్రారంభ కాలంలో వాహనాలు గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేవి మరి ఇప్పుడు దాదాపుగా గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే వాహనాలు వచ్చాయి.
Also Read: స్టీవ్ జాబ్స్- కళ కన్నాడు అనుభవించలేకపోయాడు.

మన నిత్యఅవసరాలకు, వ్యవసాయానికి, అత్యవసరాలకు, భవన నిర్మాణాలకు, అత్యవసర సేవలకు ఇలా ఎన్నో అవసరాలకు ఆటోమొబైల్ సేవలు విస్తరించాయి. ఇంతటి విశేషమున్న ఆటోమొబైల్స్‌ రంగానికి ఊపిరిపోసిన మహనీయుడు కార్ల్ బెంజ. అతని ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ దేశాలన్ని కూడా ఉపయోగించుకుంటున్నాయి.

ఇవాళ కార్ల్ బెంజ్ జన్మదిన సందర్భంగా అతని జీవితంలో అతని ఆలోచనలు నుండి ఉట్టిపడిన టెక్నాలజీ మరియు అతని ఆవిష్కరణలు గురించి మరింత సమాచారం డ్రైవ్‌స్పార్క్ మన తెలుగు పాఠకుల కోసం అందిస్తోంది.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ నవంబర్ 25, 1844 లో జర్మనీలో అప్పట్లో ముల్‌‌బర్గ్‌గా పిలవబడే నగరంలో జన్మించాడు. కార్ల్ బెంజ్ జూలై 9, 1864 నాటికి తను మెకానికల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేశాడు.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ తన విద్యాభ్యాసం అనంతరం కొత్తగా మొదలైన ఒక ఐరన్ ఫ్యాక్టరీ మరియు మెకానికల్ వర్క్‌షాపులో పని చేశాడు. ఆ తరువాత అతను పని చేసిన ఐరన్ కంపెనీ మెషీన్‌లకు షీట్ మెటల్‌ను అందించే సంస్థగా మార్పు చేశారు. దీని కారణం కార్ల్ బెంజ్.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ 1872 జూలై 20 న బెర్తా రింగర్‌ను వివాహం చేసుకున్నాడు. ఇతని ఐదు మంది సంతానం వారు. యుగెన్, రిచర్డ్, క్లారా, థల్డె, ఎల్లెన్.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ ఒక 2-స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌ను తయారు చేయాలిని నిర్ణయించుకున్నాడు. అందులో బాగంగానే బెంజ్ డిసెంబర్ 31, 1878 లో తన సృష్టిని ఆవిష్కరించాడు. ఆ తరువాత కొత్త సంవత్సరం 1879 లో ఇతని ఆవిష్కరణకు పేటింట్ లభించింది.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ ప్రదర్శించిన ఈ 2-స్ట్రోక్ ఇంజన్‌ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఈ 2-స్ట్రోక్ ఇంజన్‌ను అభివృద్ది చేస్తునే స్పీడ్ రెగ్యలేషన్ సిస్టమ్, బ్యాటరీ ద్వారా పనిచేసే స్పార్క్ ప్లగ్‌ను, కార్బోరేటర్, క్లచ్, గేర్ షిఫ్ట్ మరియు రేడియేటర్ వంటి ఎన్నో వాహన విడిభాగాలను రూపొందించాడు. మరియు అన్నింటికి కూడా పేటెంట్ లభించింది.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

1883 లో కార్ల్ బెంజ్ 25 మంది ఉద్యోగులతో గ్యాస్ ఇంజన్‌లను తయారు చేసే ఒక కంపెనీ స్థాపించాడు. అప్పట్లో దానిని బెంజ్ మరియు సిఐఇ గా పిలిచే వారు.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని 1885 లో పూర్తిగా తయారు చేశాడు. ఇది కూడా పేటెంట్ పొందినది. అప్పుడు దీనిని బెంజ్ మోటార్‌వ్యాగన్ గా పిలవడం జరిగింది.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

కార్ల్ బెంజ్ మొదటి సారిగా 1886 తను మొదటిసారిగా ఆవిష్కరించిన బెంజ్ మోటార్ వ్యాగన్‌తో ప్రదాన రహదారుల మీద విజయవంతంగా నడిపి చూపించాడు.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

ఇది మూడు చక్రాలను కలిగి ఉంటుంది. ఇందులో కార్ల్ బెంజ్ సింగల్ సిలిండర్‌ను అందించాడు. ఈ ఇంజన్ పెట్రోల్ లేదా గ్యాస్‌ను ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. మరియు ఇది నీటితో చల్లబడే ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

పేటెంట్ పొందినపుడు దీనిని ఇది 958సీసీ కలిగి ఉండి మరియు 0.8 హార్స్‌‌పవర్, 600 వ్యాట్, మరియు దీని వేగం గంటకు 16 కిలోమీటర్లు.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

1887 తిరిగి తన ప్రయోగాలను ప్రారంభించాడు. ఆ తరువాత మోటార్ వ్యాగన్ మోడల్-2 మరియు మోటార్ వ్యాగన్ మోడల్-3 లను ప్రవేశ పెట్టాడు. ఈ మోటార్ వ్యాగన్ మోడల్-3 వాహనానికి చక్కతో తయారు చేసిన చక్రాలను అందించి 1887 లో జరిగిన ప్యారిస్ ఎక్స్‌‌ పోలో దీనిని ప్రదర్శించాడు.

 ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

బెంజ్ అండ్ సిఐఇ సంస్థ డైమ్లర్ ఎజి మరియు మెర్సిడెస్ బెంజ్ విడిపోయింది. ఆ తరువాత లగ్జరీ కార్లకు ఏకైక చిరునామాగా మెర్సిడెస్ బెంజ్ మిగిలిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ రకరకాల లగ్జరీ వాహనాలను విడుదల చేస్తూ వస్తోంది.

ఆటోమొబైల్స్‌కి ప్రాణం పోసిన కార్ల్ బెంజ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు
  1. భారత్‌బెంజ్‌ బస్సు అమ్మకాలను షురూ చేసిన డైమ్లర్‌ ఇండియా

Most Read Articles

English summary
Interesting Facts About Karl Benz
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X