రైలింజన్లు ఎప్పుడు మొదలయ్యాయి: రైలింజన్ల చరిత్ర లోని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్

Written By:

మానవ జీవితానికి రైళ్లతో ఒక అవినాభావ సంభందం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరి బాల్యం చుక్ చుక్ రైళ్ల ఆటలతో ప్రారంభం అవుతుంది. అదే రైలు వారి భవిష్యత్తుకు ఎన్నో అనుభవాలను మిగుల్చుతుంది. బస్సు, కారు, విమానం ఇలా ఎన్ని ఉన్నా రైలు ప్రయాణంలో ఉన్న సరదా మరెందులోనూ ఉండదని చెప్పవచ్చు.

నేటి రైలు శీర్షిక ద్వారా రైలింజన్‌ ఎవరు కనిపెట్టారు, దాని చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలతో పాటు వాటి అభివృద్ది, రైలు ప్రపంచంలో వచ్చిన మార్పులు, సాంకేతికత, కొత్త రైళ్లు వంటి అనే విషయాలను తెలుసుకుందాం రండి...

మొదటి డీజల్ ఇంజన్‌ను 1892 లో రుడాల్ఫ్ డీజల్ కనుగొన్నాడు. ఆ తరువాత కాలంలో డీజల్ రైలింజన్‌ ప్రయోగం మీద దృష్టిపెట్టాడు. డీజల్ రైలింజన్ యొక్క మొదటి విజయం హంబర్గర్ రైలు. దీనిని 1930 లో బెర్లిన్ నుండి హంబర్గ్ మధ్య ప్రయోగాత్మకంగా నడిపారు.

మొదటి డీజల్ రైలింజన్ గంటకు 125 కిలోమీటర్ల వేగంతో నడిచింది. తరువాత కాలనుక్రమంలో ఆవిరి రైలింజన్ల మీద 1950-1960 మధ్య కాలంలో డీజల్ రైలింజన్లు ఆధిపత్యం ప్రారంభమైంది.

ఆవిరి, డీజల్ కన్నా విద్యుత్ రైళ్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. అయితే మొదటి ఎలక్ట్రిక్ రైలును 1879 లో వార్నర్ వోన్ సైమెన్స్ కనుగొన్నాడు.

సైమెన్స్ ప్రయోగాత్మకంగా ప్రయోగించి పరీక్షించిన రైలులో 2.2కిలోవాట్ సామర్థ్యం ఉన్న సిరీస్ తరహాలో చుట్టబడిన ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం చేశాడు. ఇంజన్ తో పాటు ఉన్న మూడు భోగీలు గల రైలు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో నడిచింది.

ఇప్పటి వరకు బొగ్గు, ఆవిరి, డీజల్ మరియు విద్యుత్ శక్తితో నడిచే మొత్తం నాలుగు రకాలు రైళ్లు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. అందులో బొగ్గు మరియు ఆవిరితో నడిచే రైళ్ల వినియోగాన్ని నిలిపివేసారు.

డీజల్ రైలింజన్‌లు చెప్పాలంటే ఎలక్ట్రిక్ రైలింజన్‌లు, ఎందుకంటే డీజల్ ఇంజన్‌లు ఉత్పత్తి చేసే పవర్ ఎలక్ట్రిక్ మోటార్లు తిరగడానికి ఉపయోగపడుతుంది. చక్రాలు ఎలక్ట్రిక్ మోటార్లకు అనుసంధానమైన ఉంటాయి. తద్వారా డీజల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ విద్యుచ్ఛక్తిగా రూపాంతరం చెందుతుంది రైలు కదలడానికి ఉపయోగపడుతుంది.

డీజల్ ఇంజన్‌లు ఉత్పత్తి చేసే శక్తి పరిమితంగా ఉంటుంది. అందుకోసం హై స్పీడ్ రైళ్లలో ఎలక్ట్రిక్ ఇంజన్‌లను ఉపయోగిస్తారు. అయితే డీజల్ రైళ్లు నడిచే పట్టాల ప్రక్కన ప్రత్యేకంగా విద్యుత్ లైన్ అవసరం లేదు.

డీజల్ రైలింజన్‌లో ఇప్పుడు చూసిన డీజల్-ఎలక్ట్రిక్ విధంగా కాకుండా మరో రెండు రకాల డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. అవి డీజల్-హైడ్రాలిక్ మరియు డీజల్-మెకానికల్.

డీజల్-హైడ్రాలిక్ తరహా ఇంజన్‌లో డీజల్ ఇంజన్‌ ఉత్పత్తి చేసే పవర్ హైడ్రాలిక్ పవర్‌గా కన్వర్ట్ అయ్యి, టార్క్ కన్వర్టర్ టర్బైన్ ద్వారా చక్రాలకు అందుతుంది.

అదే విధంగా డీజల్-మెకానికల్ ఇంజన్‌లోని డీజల్ ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ మోకానికల్ పద్దతి అయినా గేర్లు, షాఫ్ట్‌ల ద్వారా చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే ఈ తరహా డీజల్ రైళ్లు ఉన్నాయి.

ఆవిరి రైలింజన్‌లు మొదటిగా పరిచయం అయి విసృతమైన సేవలు చేసినప్పటికి అంత శక్తివంతమైనవి కాదు. బిగ్ బాయ్ 4014 అనే ఆవిరి రైలింజన్ అప్పట్లోని అన్ని ఆవిరి ఇంజన్‌ల కన్నా పెద్దది. దీని బరువు సుమారుగా 345 టన్నులుగా ఉంది. ఇది గరిష్టంగా 600బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైలింజన్‌లలో రష్యాకు చెందిన 4ఇ5కె అత్యంత శక్తివంతమైనది. ఇది గరిష్టంగా 18,000 హార్స్‌పవర్ ఉత్పత్తి చేయును. ఇది ఎలక్ట్రిక్ రైలింజన్.

ఎలక్ట్రిక్ రైళ్లు వాటికి పై తలంలో వ్రేళాడదీసిన 25 కిలోవాట్ పవర్ లైన్స్ ద్వారా విద్యుత్‌ను సేకరిస్తాయి.

ప్రారంభం నుండి రైలింజన్‌లను కావాలనే అత్యధిక బరువు ఉండే విధంగా నిర్మిస్తూ వచ్చారు. దీని వెనుక ఉన్న కారణం, ఎలాంటి వేగం వద్దనైనా రైలు చక్రాలు పట్టాలు తప్పకుండా రెండు పట్టాలు మద్యనే ప్రయాణించడానికి రైలు బరువు ఎంతగానో సహకరిస్తుంది.

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ఉన్న డీజల్ మరియు ఎలక్ట్రిక్ రైలింజన్‌ల బరువు సుమారుగా 20 నుండి 120 టన్నుల వరకు ఉంటుంది.

రైళ్లు గరిష్ట వేగంలో ఉన్నపుడు కంటే తక్కువ వేగం వద్ద ఉన్నపుడు సులభంగా ఆపరేట్ చేయవచ్చు. పట్టాల మీద చక్రాలు చాలా సులభంగా ఘర్షణ లేకుండా ఫ్రీగా దొర్లుతాయి. అందుకోసం రైళ్లు గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

కొన్ని రైళ్లకు రెండు ఇంజన్‌లు ఉంటాయి. ఒకటి ముందు వైపున లాగుతుంటే మరొక ఇంజన్ వెనుక నుండి నెట్టడానికి సహాయపడుతుంది.

ఇప్పుడు కొన్ని మెట్రో నగరాల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల సిటీ రైళ్లను నడుపుతున్నారు. అయితే వాటి కోసం ప్రత్యేకమైన రైలు మార్గాలు కాకుండా నగరం మీద వెళ్లే అవే సెంట్రల్ రైల్వే పట్టాల మీద లోకల్ రైళ్లను నడుపుతున్నారు. (ఉదా: హైదరాబాద్ లోని ఎమ్ఎమ్‌టిఎస్)

టెక్నాలజీ రోజుకొక్క రూపాన్ని సంతరించుకుంటున్న నేపథ్యంలో రైళ్ల సాంకేతికతలో కూడా అభివృద్ది చోటు చేసుకుంది. అందులో ఒకటి మ్యాగ్నెటిక్ ట్రైన్స్. ఇవి ట్రాక్‌ను పట్టి ఉంచడానికి అయస్కాంతక్షేత్రం ఉంటుంది.

ఇప్పుడు నగరాల్లో స్థలం లేమి కారణంగా ఆకాశంలో రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. ఫ్లై ఓవర్ ఆధారంగా నడిచే మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటికి అడ్వాన్స్‌గా మోనో రైళ్లు అభివృద్ది చెందుతున్నాయి.

English summary
Interesting Facts About Locomotives
Please Wait while comments are loading...

Latest Photos