సుజుకి గురించి మీకు తెలియని ఆసక్తికర వాస్తవాలు

జపనీస్ కార్ కంపెనీ సుజుకి మోటార్ కార్పోరేషన్ మనదేశానికి చెందిన మారుతి కార్ల కంపెనీలో క్రమంగా తమ వాటాను పెంచుకుంటూ, ఇప్పుడు ఆదిపత్య వాటాను దక్కించుకుంది. అందుకే మారుతి కార్లపై సుజుకి లోగో ప్రధానంగా కనిపిస్తుంది.

ఏదేమైనప్పటికీ సుజుకి చేరికతో మారుతి, భారతదేశంలో కెల్లా అగ్రగామి కార్ల తయారీ కంపెనీగా అవతరించింది. మరి ఈ సుజుకి ఎక్కడ పుట్టింది, తొలుత ఏ వ్యాపారం చేసేది, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, తొలి కారును ఎప్పుడు తయారు చేశారు వంటి పలు ఆసక్తికర వాస్తవాలను (ఫ్యాక్ట్స్‌ను) మనం ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరి ఆలస్యమెందుకు ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్‌ను తెలుకునేందుకు క్రింది ఫొటో ఫీచర్‌ను తిరగేయండి..!

సుజుకి గురించి మీకు తెలియని ఆసక్తికర వాస్తవాలు

తర్వాతి స్లైడ్‌లలో సుజుకి గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలను పరిశీలించండి.

మగ్గాలు తయారు చేసే కంపెనీ

మగ్గాలు తయారు చేసే కంపెనీ

జపాన్ తీరప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో 1920వ సంవత్సరంలో మిషియో సుజుకి అనే వ్యక్తి ఈ కంపెనీని ప్రారంభించాడు. తొలుత వీరు మగ్గాలను తయారు చేసేవారు. మిషియో తన పేరులోని సుజుకితోనే ఈ కంపెనీకు 'సుజుకి' అనే పేరును పెట్టాడు.

తొలి కారు, తొలి బైక్

తొలి కారు, తొలి బైక్

సుజుకి తొలి చిన్న కారును తయారు చేయాలని 1937లో నిర్ణయించుకుంది. ఆ తర్వాత తొలి మోటార్‌బైక్‌ను 1952లోను అలాగే తొలి సిరీస్ కారును 1955లోను తయారు చేశారు.

తొలి ప్యాసింజర్ కారు

తొలి ప్యాసింజర్ కారు

సుజుకి తమ మొట్టమొదటి ప్యాసింజర్ కారును 1955లో తయారు చేసింది. ఆ కారును 360సీసీ సుజులైట్ అని పిలిచే వారు.

లగ్జరీ కార్ల కన్నా ఎక్కువ ఉత్పత్తి

లగ్జరీ కార్ల కన్నా ఎక్కువ ఉత్పత్తి

ప్రస్తుతం సుజుకి అత్యంత వేగంగా వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ వంటి కార్ల కంపెనీలతో పోల్చుకుంటే, సుజుకినే ఎక్కువ కార్లను ఉత్పత్తి చేస్తుంది.

మ్యాన్‌పవర్

మ్యాన్‌పవర్

మగ్గాల వ్యాపారం నుంచి కార్ల వ్యాపారానికి వచ్చిన సుజుకి, ఇప్పుడు 170కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 15,000 మందికి పైగా ఉపాది అవకాశాలను అందిస్తూ అత్యంత విశ్వసనీయమైన కార్ బ్రాండ్‌గా ఎదిగింది.

ఒసాము సుజుకి నాయకత్వం

ఒసాము సుజుకి నాయకత్వం

ప్రస్తుత సుజుకి బాస్ అయిన ఒసాము సుజుకి నాయకత్వంలో కంపెనీ ఎనలేని ఖ్యాతిని దక్కించుకుంది. గడచిన 30 ఏళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన మిషియో సుజుకి, ఒసాము సుజుకి భార్యకు తాత.

సుజుకి యహబుసా

సుజుకి యహబుసా

సుజుకి మోటార్‌సైకిల్స్ అందిస్తున్న హయబుసా సూపర్‌బైక్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే బైక్‌లోలో ఒకటి. దీని గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లకు పైమాటే.

జనరల్ మోటార్స్‌తో భాగస్వామ్యం

జనరల్ మోటార్స్‌తో భాగస్వామ్యం

అప్పట్లో 1981లో జనరల్ మోటార్స్‌తో ప్రారంభమైన భాగస్వామ్యంలో 3 శాతం వాటాతో జిఎమ్ అదిపెద్ద వాటాదారుగా నిలిచింది.

భారత్ ఎంట్రీ

భారత్ ఎంట్రీ

సుజుకి 1980వ దశకంలో భారత మార్కెట్లోకి ప్రవేశించి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌తో చేతులు కలిపి వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు సుజుకికి ఇండియన్ మార్కెట్, జపాన్ వెలుపల ఉన్న అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది.

టాప్ 10లో ఒకటి

టాప్ 10లో ఒకటి

ప్రపంచంలో కెల్లా 10 అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీలలో సుజుకి కూడా ఒకటి కావటం మరో విశేషం.

Most Read Articles

English summary
Iconic Japanese car manufacturer Suzuki has an interesting history. Here are some Suzuki facts that you probably did not know.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X