ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమాన ప్రయాణం, మరియు ఆసక్తికరమైన నిజాలు

By Anil

నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి అయ్యాక ఎయిర్ ఇండియా వారి ఇండియన్ వన్ విమానంలో తరచూ ప్రయాణించడం మొదలు పెట్టారు. ఎయిర్ ఇండియా వారి ఇండియా వన్ విమానంలో ప్రయాణం ఎంతో ఖరీదైనదని అనేది అందరి నమ్మకం. అయితే ఏ చిన్నా చితకా అవసరం వచ్చినా మోడీ గారు ఈ విమానంలోనే ప్రయాణిస్తున్నారని దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లు వెత్తాయి.

మోడీ గారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇందులో కొన్ని అత్బుతమైన ఉన్నాయి. ప్రయాణం చేస్తూనే అధికారిక కార్యకలాపాలను సాగించే విధంగా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అందులో కొన్నింటిని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం.

01. ఎయిర్ ఇండియా వన్

01. ఎయిర్ ఇండియా వన్

భారత ప్రధాన మంత్రి, రాష్ట్రపతి మరియు ఇతర ముఖ్య ప్రభుత్వ అధికారులతో విదేశీ పర్యటనలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అంత్యంత ఖరీదైన, భద్రత పరంగా ఉత్తమమైన ఎయిర్ ఇండియా వారి ఇండియా వన్ ఎయిర్ క్రాఫ్ట్‌ను వినియోగించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇలాంటి విమానాన్ని వినియోగించేవాడు.

02. ఎయిర్ ఇండియా విమానం

02. ఎయిర్ ఇండియా విమానం

ఇండియా వన్ విమానం ఎయిర్ ఇండియా వారి ఆధ్వర్యంలో సేవలు అందిస్తోంది మరియు దీనిని నడపడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని పైలట్లను ఉపయోగిస్తున్నారు. భద్రత మరియు నిర్వహణ వంటి అంశాలను ఎయిర్ ఇండియా పర్యవేక్షిస్తుంది.

03. ప్రధాన మంత్రి కార్యాలయం

03. ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ విమానంలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రయాణం మధ్యలో అధికారులతో సమీక్షలు నిర్వహించికునే ఫీచర్లు ఇందులో అందించారు. అంతే కాకుండా ఇందులో మోడీ మరియు తమ అధికార పరివారానికి సంభంది ఎన్నో సౌకర్యాలు కల్పించారు. వాటన్నింటిని గురించి తరువాత స్లైడర్ల ద్వారా చూద్దాం, ముందుకు క్లిక్ చేయండి.

04. మద్య నిషేధం

04. మద్య నిషేధం

చాలా వరకు పాశ్చాత్య దేశాలలో అధికారులు మొత్తం మధ్యన్ని సేవిస్తారు. అయితే మన ప్రభుత్వ అధికారులు మాత్రం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. కాబట్టి మోడీ గారు ఈ వన్ ఇండియా విమానంలో మధ్యాన్ని పూర్తిగా నిషేధించారు.

05. విశ్రాంతికి ఎలాంటి అవకాశం లేదు...

05. విశ్రాంతికి ఎలాంటి అవకాశం లేదు...

మోడీ గారితో అధికారుల ప్రయాణిస్తున్నపుడు సంభందిత ఆఫీసర్లంతా ప్రయాణానికి ముందుగానే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. విమానంలో పర్యటనలకు మోడీ గారితో కలిసి వెళ్లినపుడు ఇందులో ఎవరు కూడా విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదు.

06. నిద్ర

06. నిద్ర

ఇందులో ప్రదాన మంత్రికి మాత్రమే ప్రత్యేకంగా పడక గదిని ఏర్పాటు చేశార. సుదూర దేశాలకు ప్రయాణించే సమయంలో ప్రధాన మంత్రికి కోసం దీనిని కేటాయించారు. సాదారణంగా దీనిని మోడీ గారు విశ్రాంతి కోసం వినియోగిస్తున్నారు.

07. సాధారణ ప్రధాన మంత్రి

07. సాధారణ ప్రధాన మంత్రి

ఈ విమానంలో మోడీ గారు చాలా అరుదుగా మాత్రమే నిద్రపోయినట్లు తెలిసింది. అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లినపుడు మోడీతో కలిసి వెళ్లే తోటి అధికారులు మోడీ గారు చాలా వరకు మేలుకునే ఉంటారు అని తెలిపారు.

08. శాకాహారం మాత్రమే

08. శాకాహారం మాత్రమే

మోడీ గారు ఇందులో ప్రయాణించే సమయంలో పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తన మెనూలో ఎంచుకుంటాడు. అందుకోసం ఈ విమానంలో పూర్తిగా శాకాహారాన్ని అందుబాటులో ఉంచుతారు. కొన్ని రోజులు ఉపవాసం, మరియు ఎక్కువగా పండ్లను తీసుకునేవాడు.

09. ఖాదీ దుస్తులు

09. ఖాదీ దుస్తులు

మోడీ గారికి ఉపయుక్తంగా ఉండటం కోసం ఇందులో పురుషుల కోసం ఖాద వస్త్రాలను అందుబాటులో ఉంచారు. అదే విధంగా ఇందులో మహిళల కోసం పట్టు మరియు పురుషుల కోసం జోధ్ పురి కోటు, ఫ్యాంటులను అందుబాటులో ఉంచారు.

10. విమానం మోడల్

10. విమానం మోడల్

ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి మరియు ఇతర ముఖ్య కేంద్ర అధికారుల ప్రయాణించడానికి వినియోగించే ఎయిర్ ఇండియా వారి ఇండియా వన్ విమానం బోయింగ్ చెందినది. బోయింగ్ 747 అనే ఎయిర్ క్రాఫ్ట్‌ను ఇండియా వన్ విమానంగా ఉపయోగిస్తున్నారు.

11. మూడు విభాగాలు

11. మూడు విభాగాలు

ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను ముఖ్యంగా మూడు విభాగాలు కోసం డిజైన్ చేశారు. మంత్రులు మరియు అధికారుల కోసం మొదటి శ్రేణి బెడ్‌లు మరియు భద్రతా సిబ్బందికి దగ్గర్లో ప్రధాన మంత్రికి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడక గదిని డిజైన్ చేశారు. భద్రత సిబ్బంది క్యాబిని విభాగం దగ్గర్లో సుమారుగా 34 బిజినెస్ క్లాస్ సీట్లను ముఖ్యంగా పాత్రికేయుల కోసం రూపొందించారు.

12. పైలట్ గ్రూపు

12. పైలట్ గ్రూపు

ఈ ఎయిర్ ఇండియా వన్ విమానంలో బాగా ప్రావీణ్యులైన సుమారు ఎనిమిది మంది పైలట్లు ఇందులో ఉంటారు. వీరి కోసం ప్రత్యేకంగా పైలట్ క్యాబిన్ కలదు.

13. భద్రత

13. భద్రత

ఎయిర్ లైన్ భద్రతను జాతీయ నిఘా భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. ఇందులో అత్యవసర అవసరాల కోసం నీరు మరియు ఇంధనాన్ని అధిక స్థాయిలో నింపుతారు.

14. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

14. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్

దీనిని ముఖ్యంగా యుద్ద విమానం అని కూడా చెప్పవచ్చు. ఒక వేళ దీని మీద దాడులు జరిగే పరిస్థితి ఎదురైతే శత్రువులను ఎదుర్కోవడానికి మిస్సైల్స్‌ను మరియు ఇతర యుద్ద సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఇసుకను చిలకరించడం వేడి గాలులను వజలడం ఇలాంటి చేయడానికి ఇందులో ప్రత్యేక పరికాలు కలవు. ప్రధాని మంత్రి బెడ్ రూమ్ బయట అత్యవసర శాటిలైట్ ఫోన్ కలదు.

15. ప్రయాణ దూరం

15. ప్రయాణ దూరం

ఈ విమానంలో ఇంధనాన్ని నిండుగా నింపితే సుమారుగా 13,450 కిలోమీటర్లు పాటు నిరంతరాయంగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 988 కిలోమీటర్లుగా ఉంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమాన ప్రయాణం, మరియు ఆసక్తికరమైన నిజాలు

నాగసాకి, హిరోషిమా నగరాల నాశనానికి కారణం అయిన విమానం దొరికింది

విశ్వపు అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 గురించి ఆసక్తికర విషయాలు

Most Read Articles

English summary
Interesting Things About Air India One Aircraft
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X