తరచూ ఎయిర్ ట్రావెల్ చేసినా గమనించలేని నిజాలు

విమానయాన సంస్థలు ఎంతటి వారికైనా సునాయాసంగా చెవిలో పూలు పెట్టేస్తుంటాయి. ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న డస్ అండ్ డోంట్ లలో ఏవి నిజం ? ఏవి అబద్దం..? గురించి నేటి కథనంలో తెలుసుకుందాం...

By N Kumar

గత మూడు నాలుగు దశాబ్దాల నుండి విమాన ప్రయాణం చేసే వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే విమాన ప్రయాణంలో ఎన్నో రూల్స్ చెబుతుంటారు, మనకు తెలియని ఎన్నో వేశాలేస్తుంటారు. విమానయాన సంస్థలు ఎంతటి వారికైనా సునాయాసంగా చెవిలో పూలు పెట్టేస్తుంటాయి. ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న డస్ అండ్ డోంట్ లలో ఏవి నిజం ? ఏవి అబద్దం..? ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు ఉండే నియమాల గురించి ఆసక్తికర విషయాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం...

మొబైల్ ఫోన్‌లను స్విచ్ఛాప్ చేయమనడం

మొబైల్ ఫోన్‌లను స్విచ్ఛాప్ చేయమనడం

విమాన ప్రయాణం ప్రారంభమయ్యే ముందు మీ సెల్ ఫోన్ సిఛ్చాఫ్ చేయండని అనౌన్స్ చేస్తుంటారు. చేతిలో ఇమిడిపోయే చిన్న ఫోన్ ద్వారా అంత పెద్ద విమానానికి ముప్పు ఏమీ ఉండదు. అయితే ఎక్కువ ఫోన్‌లు ఆన్ లో ఉండటం వలన విమానానికి ముప్పు వాటిళ్లుతుంది. అందుకే అందరి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయండని కోరుతుంటారు. ఇలాంటప్పుడు వారితో ఏకీభవించడం ఉత్తమం.

విమానంలో 13 వ వరుస ఉండదు ఎందుకు ?

విమానంలో 13 వ వరుస ఉండదు ఎందుకు ?

ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు పిల్లి ఎదురైతే ఎలా ఫీలవడంలో తప్పులేదు అనుకుంటే, విమానంలో 13 వరుస లేదనప్పుడు కూడా పెద్దగా పట్టించుకోకూడదు. 13 వ సంఖ్య ప్రమాదానికి సంకేతం అనే మూడన నమ్మకం పాశ్చాతుల్లో ఎక్కువగా ఉంది అందుకే విమానాల్లో 13 వవరుస ఉండదు.

విమానాల్లో స్మోకింగ్ నిషేధం ఉన్నా కూడా టాయిలెట్లలో యాష్ ట్రే ఉంటుందా..?

విమానాల్లో స్మోకింగ్ నిషేధం ఉన్నా కూడా టాయిలెట్లలో యాష్ ట్రే ఉంటుందా..?

అవును మీరు చదివింది నిజమే, అమెరికా ప్రభుత్వం ఏజెన్సీ ఎఫ్ఏఏ ప్రకారం, విమానాల్లో ప్రొగత్రాగడాన్ని నిషేదించినప్పటికీ టాయిలెట్లలో తప్పనిసరిగా యాష్ ట్రేలు అందుబాటులో ఉంచాలని రూల్ తెచ్చింది.

ఈ నియమం వెనుక ఒక ధృడమైన కారణం ఉంది. 1973 లో ఒక విమానం సిగరెట్ స్మోకింగ్ వలన ప్రమాదానికి గురైంది. అయితే నిషేధం ఉన్నా స్మోకింగ్ ఎలా సాధ్యం అంటారా...? సిగరెట్ తాగాలనకునే వారికి కొన్ని సెకన్లు చాలు. అందుకే మళ్లీ అలాంటివు పునరావృతం కాకుండా యాష్ ట్రేలను అందించారు.

విమానాలు బెర్ముడా ట్రయాంగిల్ నుండి తప్పించుకుంటున్నాయా..

విమానాలు బెర్ముడా ట్రయాంగిల్ నుండి తప్పించుకుంటున్నాయా..

betwixt Bermuda, Puerto Rico మరియు Florida ప్రాంతాలను బెర్ముడా ట్రాయాంగిల్ అంటారు. ఈ త్రికోణం మీదుగా ప్రయాణించిన కొన్ని వేల విమానాలు మరియు నౌకలు అంతుచిక్కకుండా పోయాయి. ఎన్నో ఏళ్ల నుండి ఇదే తంతు. అయితే ఈ మార్గం నుండి తప్పనిసరిగా విమానాలు వెళ్లాల్సిందే. చాలా విమానాలు ఇప్పటికీ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. బెర్మాడాకు భయపడే వాళ్లు మాత్రం సుమారుగా 1,800 మైళ్లు దూరం ఉన్న వేరే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.

విమాన సిబ్బందికి సరైన హైట్ అండ్ వెయిట్ అవసరమా...?

విమాన సిబ్బందికి సరైన హైట్ అండ్ వెయిట్ అవసరమా...?

విమానంలో మన సీట్లో కూర్చున్నప్పటి నుండి దిగేంత వరకు మనకు సకలు సేవలు చేసే ఎయిర్ హోస్టేస్ నిర్దిష్టమైన బరువు మరియు ఎత్తులో ఉంటేనే ఆ ఉద్యోగానికి అర్హత అంట. సాధారణంగా విమాన సిబ్బంది 5.2 అడుగులు ఎత్తు ఉండాలి, విమానంలో మ్యాన్యువల్‌గా ఆపరేట్ చేసే అన్ని విభాగాలను పర్యవేక్షించడానికి ఈ ఎత్తు తప్పనిసరి. ఇక క్యాబిన్‌లో సదుపాయాలు చేసే వారికి ఈ పరిమితులు మినహాయింపు.

మెరుపులు విమానాన్ని పేల్చేస్తాయా....?

మెరుపులు విమానాన్ని పేల్చేస్తాయా....?

ఆకాశంలో ప్రతికూల వాతావరణం వలన వచ్చే ఉరుములు, మెరుపుల కారణంగా విమానాలు కూలిపోతాయా అనే సందేహం చాలా మందికే ఉంటుంది. నిజమే ప్రతి ఏడాది ఒక విమానం ఈ కారణంగా ప్రమాదానికి గురయ్యేది. భయపడకండి, చివరి ప్రమాదం 1967 లో జరిగింది. ఆ తరువాత అందుబాటులోకి వచ్చిన విమానాలు ఉరుములు, మెరుపులను సైతం చీల్చుకుంటూ గగనంలో ప్రయాణిస్తున్నాయి. కాబట్టి నిశ్చింతగా ప్రయాణించవచ్చు.

విమానంలో తుపాకి పేల్చితే ప్రమాదం సంభవిస్తుందా..?

విమానంలో తుపాకి పేల్చితే ప్రమాదం సంభవిస్తుందా..?

అమెరికా అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ విమానంలో తుపాకితో తూటాలు దాడి చేస్తే విమానానికి ఏ విధమైన ముప్పు ఉండదు. అయితే సాధారణ విమానాల్లో అయితే కాస్త ఆలోచించాలి. తుపాకి కాల్పులు చేసే ప్రదేశాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది. క్యాబిన్‌లోపల అధిక పీడనం ఉడటం వలన క్యాబిన్‌కు జరిగే తూటా దాడిని అధికమిస్తుంది. కిటికీ అద్దాలు అయితే కాస్త కష్టమే. అయితే విమానం గరిష్ట ఎత్తులో ఉన్నపుడు లైఫ్ జాకెట్లు ధరించి విండోలను పేల్చి క్రిందకు దూకి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

విమానంలోని ఆక్సిజన్ మాస్క్ ద్వారా ప్రాణాలు పోతాయా ?

విమానంలోని ఆక్సిజన్ మాస్క్ ద్వారా ప్రాణాలు పోతాయా ?

ఆక్సిజన్ మాస్క్ ధరిస్తే ప్రాణాలు పోతాయి అనేది కాస్త విడ్డూరంగా ఉంది కదూ. నిజమేనండి, 100 శాతం ప్యూర్ ఆక్సిజన్ ను మాస్క్ ద్వారా తీసుకోవడం వలన ప్రాణాపాయ స్థితి కలిగే అవకాశం ఉంది. అయితే క్యాబిన్‌లో సాధారణ గాలి చాలా తక్కువగా ఉన్నపుడు మాస్క్ ని కంటిన్యూగా ఉంచడం కన్నా అప్పుడప్పుడు ధరించడం ఉత్తమం.

పైలట్ టాయిలెట్‌కు వెళితే అందరూ తప్పనిసరి సీటులో కూర్చోవాల్సిందే...?

పైలట్ టాయిలెట్‌కు వెళితే అందరూ తప్పనిసరి సీటులో కూర్చోవాల్సిందే...?

పైలట్ క్యాబిన్‌లోని సీట్ బెల్ట్ లైట్ వెలిగింది అంటే ప్యాసింజర్ క్యాబిన్‌లోని అందరూ సీట్ బెల్ట్ ధరించి కూర్చునట్లు అర్థం. సరిగ్గా ఈ సందర్భంలోనే పైలట్ టాయిలెట్‌కు వెళ్లగలడు. కారణం: ప్రయాణికులు నించున్నపుడు ఒక పైలెట్ టాయిలెట్‌కు వెళితే ఆ ప్రయాణికుడు పైలెట్ క్యాబిన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నంచే అవకాశం ఉంది. అయితే మరో పైలెట్ విమానాన్ని నడుపుతూ అతన్ని నియంత్రించలేడు.

విమానంలో మందు కొడితే కిక్ వేగంగా ఎక్కుతుందా...?

విమానంలో మందు కొడితే కిక్ వేగంగా ఎక్కుతుందా...?

నేల మీద కన్నా విమానంలో ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మద్యం సేవిస్తే నేల మీద కన్నా రెట్టింపు వేగంతో కిక్కు ఎక్కుతుందంట. దీనికి కారణం విమానంలో ప్రయాణించేటపుడు ఆక్సిజన్ తక్కువగా ఉడటం. అయితే పరిశోధకులు ప్రకారం నేల మీద త్రాగినా, విమానంలో తాగినా, 12,000 అడుగుల ఎత్తులో త్రాగినా ఒకే విధమైన కిక్కు ఎక్కుతుందంట. అయితే ఆయా ప్రదేశాల్లో ఉండే ఆక్సిజన్ లభ్యతలో అసమానత వలన మాత్రమే ఆ అనుభవం వస్తుందని తేల్చారు.

అన్ని సీట్లు అత్యవసర ద్వారానికి దగ్గరలో ఉంటాయా...?

అన్ని సీట్లు అత్యవసర ద్వారానికి దగ్గరలో ఉంటాయా...?

సీట్లు కూర్చుని సౌకర్యాలను చూసుకుని రిలాక్స్ అవుతాం. ప్రమాదం జరిగితే కొందరు బ్రతకడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌కు దగ్గర్లో ఉన్న వారు బ్రతకడం అనేవేవీ ఉండవు. క్షణాల్లో జరిగే ప్రమాదాల నుండి బయటపడటానికి ఇలాంటివి ఉపయోగపడినట్లు ఎలాంటి దాఖలాలు లేవు. అయితే కూర్చున్న తరువాత ఎమర్జెన్సీ డోర్ ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది అని చూసుకుంటే చాలు.

చల్లటి గాలి

చల్లటి గాలి

విమానంలోని క్యాబిన్‌లోకి వచ్చే ఏ/సి గాలిని రీసైకిల్ చేసి మళ్లీ క్యాబిన్‌లో ప్రసరింపజేస్తారు. దీని వలన జబ్బులు రావా..? అంటే రావు అని సరైన సమాధానం ఉంది. ఎందుకంటే విమానాలలో హై ఎఫిషియన్సీ పర్టికల్ ఎయిర్ ఫిల్టర్లు (HEPA) ఉంటాయి. దీని బయటి వాతారణంలో నుండి గాలిని సేకరించి క్యాబిలో నుండి వచ్చే గాలికి జత చేసి అత్యుత్తమంగా ఫిల్టర్ చేసి క్యాబిన్‌లో మళ్లీ విడుదల చేస్తుంది. కాబట్టి ఏ విధమైన జబ్బులు వ్యాపించే అవకాశం ఉండదు.

విమాన ప్రయాణం మద్యలో తలుపులు తెరుచుకుంటాయా...?

విమాన ప్రయాణం మద్యలో తలుపులు తెరుచుకుంటాయా...?

విమానం ఆకాశంలో ఉన్నపుడు డోర్లను తెరవవచ్చు, నేను తెరిచాను కూడా అని చాలా మంది విమాన ప్రయాణం చేసిన వాళ్లు ఎయిర్ ట్రావెల్ గురించి అవగాహన లేని వాళ్లతో పంచుకుంటారు. ఇది ముమ్మాటికీ తప్పు. విమానాలకు ఉన్న తలుపుల ద్వారా గాలి లీక్ అవ్వకుండా ధృడంగా ఎయిర్ లాక్ చేస్తారు. సాంకేతికంగా కాకుండా మనషులు చేత తెరిపించాలి అంటే ఒక్క సారిగా 100 మందికి పైగా ప్రయత్నించాల్సి ఉంటుంది.

విమానంలోని టాయిలెట్లలో ఇరుక్కుపోతారా....?

విమానంలోని టాయిలెట్లలో ఇరుక్కుపోతారా....?

విమానం ప్రయాణం చేసే వారు చెప్పే మరో అర్థం లేని వాదన ఇది. విమానంలోని టాయిలెట్లోకి వెళితే దాని డిజైన్ కారణంగా బేసిన్ ఇరుక్కుపోతామని పుకార్లు చెబుతుంటారు. ఇది ముమ్మాటికీ అబద్దం. ఇలా ఎలా సాధ్యం అని ఇంట్లో ఉన్న టాయిలెట్లో ప్రయత్నించకండి.

విమానంలో సీటు మార్పిడి సాధ్యమేనా....?

విమానంలో సీటు మార్పిడి సాధ్యమేనా....?

చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం, అసౌకర్యంగా ఉన్న సీటును మార్చమని కోరితే నో..నో.. అంటుంటారు. రియల్ లైఫ్ లో కూడా అదే జరుగుంది. మీరు విమాన సిబ్బందిని సీటు మార్చని కోరితే వారి కాసేపు ఆగి వచ్చిన సారీ అంటారు. ఉత్తమం ఏమిటంటే అక్కడ కూర్చోకముందే మార్చమని అడగడం.

పైలట్ల జీత భత్యాలు

పైలట్ల జీత భత్యాలు

మనోడు పైలెట్ అంటే అబ్బో వాడి జీతం అంత, ఇంత అనుకుంటాం. అతగాడి జీతం గురించి అతనే చెప్పాలి. మనం అనుకున్నంత భారీ జీతం రావాలంటే వారు కూడా చాలానే అనుభవం గడించాలి. ఒక పైలట్ తెలిపిన వివరాల మేరకు, గరిష్టంగా 20,500 యూరోల వరకు అందుతుంది, అయితే పైలట్ లైసెన్స్ బట్టి 35 నుండి 50,000 యూరోలకు జీతం ఉంటుందని తెలిపాడు.

విమానంలో నుండి డైట్ కోక్ పారబోయడం కష్టమా...?

విమానంలో నుండి డైట్ కోక్ పారబోయడం కష్టమా...?

ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఎక్కువగా ఇబ్బంది పడుతోంది ఈ సమస్యతోనే. అసలు సమస్య ఏమిటంటే ... డైట్ కోక్ ఆర్డర్ చేసి త్రాగకుండా వేస్ట్ చేస్తే దానిని తిరిగి తీసుకెళ్లి వేస్ట్ బిన్‌లో పోయాలి. ఆ బిన్ నిండిపోతే దానిని విమానం నుండి పారబోయాలి. అయితే అత్యంత ఎత్తు నుండి పారబోయడం ప్రమాదకరం అంట.

పక్షులు ఢీ కొంటే విమానాలు కూలిపోతాయా...?

పక్షులు ఢీ కొంటే విమానాలు కూలిపోతాయా...?

మృదువైన పక్షులు ఢీ కొంటే భారీ విమానాలు సైతం కూలిపోతాయా...? అనే సందేహం చాలా మందిని తొలిచేస్తుంటుంది. దీని గురించిన పూర్తి వివరాల కోసం....

విమానం టేకాఫ్ సమయంలో కిటికీ అద్దాలు తెరచి ఉంచుతారెందుకు...?

విమానం టేకాఫ్ సమయంలో కిటికీ అద్దాలు తెరచి ఉంచుతారెందుకు...?

రన్ వే మీద విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో కిటికీ అద్దాలను తెరిచి ఉంచుతారు. అదే సమయంలో ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది టేకాఫ్ వద్దే ఉంటారు. ఒక వేళ విమానంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కిటికీ నుండి రక్షక సిబ్బంది గమనించగలరు.

విమానం టేకాఫ్ సమయంలో లైటింగ్ డిమ్ అండ్ డిప్ చేస్తారా...?

విమానం టేకాఫ్ సమయంలో లైటింగ్ డిమ్ అండ్ డిప్ చేస్తారా...?

మీరు చదివింది నిజమే. ఎందుకంటే విమానం టేకాఫ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే త్వరితగతిన పారిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అదే సమయంలో చాలా మంది నిద్రపోతుంటారు. వారిని నిద్రలేపడానికి విమానంలో ఉన్న లైట్లను డిమ్ అండ్ డిప్ చేస్తారు.

రూల్ 240 ఎందుకు ?

రూల్ 240 ఎందుకు ?

ఈ రూల్ అమెరికా దేశాల ఆధీనంలో నడిచే ఎయిర్ లైన్స్‌లో ప్రముఖంగా ఉంది. వారి విమానాలలో ప్రయాణించే సమయంలో ఎయిర్ హోస్టెస్ మీకు సేవ చేయకపోయినా, మీ ప్రశ్నకు బదులివ్వకపోయినా వారి మీద రూల్ 240 పేరుతో విమానాశ్రయాలలో ఫిర్యాదు చేయవచ్చు.

ఎయిర్ ట్రావెల్ గురించి నిజాలు

  • విమాన సిబ్బంది చేసే 20 ఆశ్చర్యకరమైన పనులు
  • పైలట్లు ప్రయాణికులతో షేరు చేయకుండా దాచే విషయాలు
  • రైట్ సోదరులకన్నా ముందే విమానాన్ని కనుగొన్నది మన భారతీయుడే !

Most Read Articles

English summary
Interesting Truths Myths About Flying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X