ఐపిఎల్ టీమ్ ఓనర్లు, మరియు వారి కళ్లు చెదిరే విలాసవంతమైన కార్లు

ఐపిఎల్ ప్రారంభమయ్యి పదేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పదవ ఐపిల్ (#IPLturns10) మ్యాచుల్లో ఆడుతున్న జట్ల ఓనర్లు మరియు వారి కార్ల గురించి ఓ ప్రత్యేక కథనం...

By Anil

ఐపిల్ మరియు కార్లు ఈ రెండింటిని కలిపి ఉంచితే, ఐపిల్ ప్లేయర్ల కార్లు, ఐపిఎల్ ఆటగాళ్ల ఫ్యాన్సీ కార్ల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఐపిల్ టీమ్ ఓనర్లు ఎవరు మరియు వారి వద్ద ఎలాంటి కార్లు ఉన్నాయి అనే విషయం గురించి ఆరా తీస్తే వారి వద్ద కూడా అద్బుతమైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ యజమానుల వద్ద కార్ల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

డిల్లీ డేర్‌డెవిల్స్

డిల్లీ డేర్‌డెవిల్స్

డిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు 2008లో ప్రాణం పోసుకుంది. ఈ జట్టును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, జిఎమ్‌ఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు 84మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అంతర్జాతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్‌గా పేరుగడించిన జిఎమ్ రావు గారు తన హోదాను ప్రక్కనబెట్టి టయోటా క్యామ్రీ కారును మాత్రమే వినియోగిస్తున్నాడు.

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

టయోటా క్యామ్రీ కారు ప్రపంచ వ్యాప్తంగా టయోటాకు స్థిరమైన విక్రయాలు సాధిస్తోంది. టయోటా ఆధునికంగా పరిచయం చేసిన క్యామ్రీ వేరియంట్లలో హైబ్రిడ్ పరిజ్ఞానం అందించింది. ఇందులోని శక్తివంతమైన 2.5-లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రల్ ఇంజన్ గరిష్టంగా 202బిహెచ్‌పి పవర్ మరియు 213ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

కింగ్స్ లెవన్ పంజాబ్

కింగ్స్ లెవన్ పంజాబ్

ఈ జట్టుకు ప్రీతి జింటా భాగస్వామి యాజమానిగా ఉన్నారు. కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టును సుమారుగా 76మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన ప్రీతి జింటా ఎక్కువగా లెక్సస్ ఎల్ఎక్స్470 కారును డ్రైవ్ చేస్తూ మీడియా కంటికి అనేక మార్లు చిక్కింది.

ప్రీతి జింటా - లెక్సస్ ఎల్ఎక్స్470

ప్రీతి జింటా - లెక్సస్ ఎల్ఎక్స్470

లెక్సస్ ఎల్ఎక్స్470 కారు ఒక పెద్ద పరిమాణంలో ఉన్న ఎస్‌యూవీ. ఇందులో ఎల్ఎక్స్ అనగా లగ్జరీ క్రాసోవర్ అని అర్థం. 1995 కాలం నాటి నుండి లెక్సస్ సంస్థ ఈ ఎల్ఎక్స్470 ని ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తూ వస్తోంది. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో టయోటా ల్యాండ్ క్రూయిజర్ పేరుతో కూడా విక్రయించబడింది.

కోల్‌కత్తా నైట్ రైడర్స్

కోల్‌కత్తా నైట్ రైడర్స్

కోలకత్తా నైట్ రైడర్స్ జట్టు సహ యాజమాని ప్రముఖ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 75.09మిలిమ్ అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. 2008లో ఈ జట్టును ఏర్పాటు చేయడం జరిగింది. జట్టు ఏర్పడిన తొలినాళ్లలో చాలా సవాళ్లనే ఎదుర్కుంది. అయితే మూడేళ్ల తరువాత 2012 టోర్నమెంట్‌లో టైటిల్ సొంతం చేసుకుంది.

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

బాలీవుడ్ బాద్‌షాగా పేరు గాంచి షారుఖ్ ఖాన్ వద్ద ఏ ఒకటో, రెండో కార్లు ఉన్నాయనుకుంటే పొరబడనట్లే. షారుఖ్ వద్ద లగ్జరీ కార్ల కోసం ఓ ప్రత్యేక గ్యారేజీ ఉంది. అయితే అన్నింటిలోకెల్లా షారుఖ్ ఎక్కువగా మెచ్చేది బుగట్టి వేరాన్. బుగట్టి వేరాన్ కారులో 8.0-లీటర్ సామర్థ్యం గల డబ్ల్యూ16 ఇంజన్ కలదు. ఇది ఏకంగా 1000బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్....

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ జట్టు రెండు ప్రధాన కారణాలతో ఫేమస్‌గా నిలిచింది. అందులో ఒకటి సచిన్ టెండూల్కర్ జట్టులో భాగస్వామిగా ఉండటం మరియు అంబానీ ఫ్యామిలీ కోసం. వీరిద్దరూ ఈ జట్టుకు యజమానులు. దీనిని 111.9మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఐపిల్ జట్టుల్లో అత్యంత ఖరీదైన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది.

సుమారుగా 168 కార్లను కలిగి ఉన్న ముఖేష్ అంబానీ: విమానాలు,లగ్జరీ నౌకలు కూడా

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

ఇండియాలో అత్యధిక కార్లను కలిగి ఉన్న వారిలో ముఖేష్ అంబానీ ఒకరు. ఇతని వద్ద ఉన్న వాటిలో ప్రధానంగా అందరి దృష్టి ఆకర్షించేది మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్600 గార్డ్. భద్రత పరంగా అనేక ఫీచర్లతో బ్లాస్ట్‌ను సైతం ఎదుర్కోగల ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును అంబానీ ఎక్కువగా వినియోగిస్తాడు. ఇందులోని శక్తివంతమైన 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 ఇంజన్ గరిష్టంగా 530బిహెచ్‌పి పవర్ మరియు 830ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

సచిన్ టెండూల్కర్ అద్బుతమైన కార్ కలెక్షన్....

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ప్రస్తుతం ఉన్ ఐపిఎల్ జట్లలో రెండవ అత్యంత ఖరీదైన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీనిని 111.6మిలియన్ ఆమెరికన్ డాలర్లకు కొనుగోలు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లేదా ఆర్‌సిబి గురించి వినగానే ముందుగా గుర్చొచ్చే వ్యక్తి విజయ్ మాల్యా. ఆ మహానుబావుడే ఈ జట్టుకు యజమాని.

బీరు, బారు, కారు ఇదీ మాల్యా తీరు: విజయ్ మాల్యా కారు కలెక్షన్

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

కార్ల కలెక్షన్‌లో విజయ్ మాల్యాని మించిన మేధావి లేడనే చెప్పాలి. అతి పురాతనమైన క్లాసిక్ కార్ల నుండి అత్యాధునిక రేస్ మరియు సూపర్ కార్లు ఇతని గ్యారేజీలో ఉన్నాయి. అందులో అత్యాధునిక మోడల్ కారు, ఫెరారి 275జిటిబి. ఫెరారి లైనప్‌లో అత్యంత గొప్ప కారు మరియు ట్రాన్సాక్సిల్ గల ఏకైక ఫెరారి కారు ఇది. ఇందులోని 3.3-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 ఇంజన్ గరిష్టంగా 280బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

విజయ్ మాల్యా కార్ల వేలం: కోట్లు విలువ చేసే కార్లకు చిల్లర పడేశారు !

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్

ప్రస్తుతం జరుగుతున్న పదవ ఐపిల్‌లో బాగా రాణిస్తున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. తమిళనాడుకు చెందిన కళానిధి మారన్ దీనికి యాజమాని. సన్ గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మారన్ దేశీయ మీడియా రంగంలో పెద్ద పేరుగాంచిన వ్యక్తి. టెలివిజన్ ఛానెల్స్, న్యూస్ పేపర్లు, వీక్లీ, రేడియో స్టేషన్లు, డిటిహెచ్ సర్వీసులు మరియు చిత్ర నిర్మాణంలో కూడా ఈయన వ్యాపారాలు ఉన్నాయి.

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

కళానిధి మారన్ కూడా క్లాసిక్ కార్ల ప్రేమికుడు. వాటిలో ప్రధానాకర్షణగా ఉన్న కారు ల్యాంబోర్గినీ మర్సియోలాజ్. ఇది పూర్తిగా యెల్లో కలర్‌ ఫినిషింగ్‌లో ఉంటుంది. 2001 నుండి 2010 మధ్య ల్యాంబోర్గిని ఉత్పత్తి చేసిన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ మర్సియోలాజ్ లో వి12 ఇంజన్ కలదు.

రైసింగ్ పూనే సూపర్‌గెయింట్

రైసింగ్ పూనే సూపర్‌గెయింట్

ఈ ఐపిల్ సీజన్‌లో రైసింగ్ పూనే సూపర్‌గెయింట్ కొత్త జట్టు. సంజీయ్ గోయెంకా గ్రూప్స్ అధినేత సంజీయ్ గోయెంకా ఈ జట్టుకు యజమాని. పూనే ఆధారిత రైసింగ్ పూనే సూపర్‌గెయింట్ జట్టు 2016 నుండి ఐపిల్‌ మ్యాచుల్లో పాల్గొంది.

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

సంజీవ్ గోయెంకా కార్ల కంటే స్పోర్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. అట్లెటిక్ డి కోల్‌కత్తా ఫ్రాంచీసీకు కూడా ఇతను యజమాని మరియు కోలకత్తాలో అనే లగ్జరీ మాల్స్ ఇతని పేరు మీద ఉన్నాయి.

గుజరాత్ లయన్స్

గుజరాత్ లయన్స్

గుజరాత్ లయన్స్ మరో కొత్త ఐపిఎల్ జట్టు. ఇది కూడా 2016 ఐపిల్ సీజన్ ద్వారా తొలిసారిగా ఆరంగ్రేటం చేసింది. దాదాపు మొత్తం యంగ్ ప్లేయర్స్ కలగి ఉన్న ఈ జట్టుకు కేశవ్ బన్సాల్ అనే యువ వ్యవస్థాపకుడు యజమాని. ఐపిల్ టోర్నమెంట్ చరిత్రలో ఐపిల్ జట్టుకు యజమానికి ఓ పిన్నవయస్కుడు ఉండటం ఇదే తొలిసారి.

ఐపిఎల్ టీమ్ ఓనర్లు వారి విలాసవంతమైన కార్లు

కేశవ్ బన్సాల్ వద్ద అత్యంత ఖరీదైన వాటిలో హై ఎండ్ కార్లు ఉన్నాయి. ఫెరారి, పోర్షే మరియు బుగట్టి కార్లను కూడా కలిగి ఉన్నట్లు సోర్సెస్ చెబుతున్నాయి. 26 ఏళ్ల వయస్సున్న కేశవ్ బన్సాల్ దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్‌‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Most Read Articles

English summary
Read In Telugu to know about #IPLturns10 — IPL Team Owners And Their Cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X