వేలానికి జేమ్స్ బాండ్ లోటస్ ఈస్పిరిట్ సబ్‌మెరైన్ కారు

By Ravi

జేమ్స్ బాండ్ చిత్రాల్లో కార్లకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. నమ్మసక్యం కాని చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటాయి ఈ కార్లు. పాత జేమ్స్ బాండ్ చిత్రాలను తాజాగా వచ్చిన స్కైఫాల్ చిత్రం వరకు అన్ని సినిమాల్లో వివిధ రకాల కార్లను మనం చూశాం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఓ కారు మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా..! జేమ్స్ బాండ్ వాడిన కారును ఇప్పుడు మీరు కూడా సొంతం చేసుకోవచ్చు.

ఒకానొక జేమ్స్ బాండ్ చిత్రంలో ఉపయోగించిన మ్యాజిక్ కారు ఒకటి ఇప్పుడు వేలానికి వచ్చింది. 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ చిత్రం 'ది స్పై హూ లవ్డ్ మి' జేమ్స్ బాండ్ పాత్ర పోషించిన రోగర్ మూరే ఉపయోగించిన లోటస్ ఈస్పిరిట్ కారును ఇప్పుడు వేలం వేస్తున్నారు. లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1 కారును ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా కస్టమైజే చేశారు. రోడ్డుపైనే కాకుండా, సబ్‌మెరైన్‌లా నీటిలోపల కూడా దూసుకుపోవటం ఈ కారు ప్రత్యేకత.

ప్రముఖ వేలం సంస్థ ఆర్ఎమ్ ఆక్షన్ లండన్‌లో ఈ కారును వేలం వేయనుంది. గోల్డ్‌ఫింగర్ (1964), థండర్‌బాల్ (1965) మరియు రీసెంట్‌గా వచ్చిన స్కైఫాల్ చిత్రాల్లో కనిపించిన ఆస్టన్ మార్టిన్ డిబి5 కారును వేలం వేయగా అది 2.9 మిలియన్ డాలర్ల వెల పలికిన సంగతి తెలిసినదే. మరి తాజాగా వేయనున్న వేలంలో ఈ లోటస్ ఈస్పిరిట్ కారు ఎంత ధర పలుకుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈ తమాషా కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

వేలానికి జేమ్స్ బాండ్ కారు

జేమ్స్ బాండ్ చిత్రం కోసం లోసట్ ఈస్పిర్ సిరీస్ 1 కారును ప్రత్యేకంగా తయారు చేశారు. దీని తయారీకి అప్పట్లో లక్ష డాలర్లు పైగా ఖర్చయింది. ఇప్పటి రేటు ప్రకారం చూసుకుంటే అది 5 లక్షల డాలర్లతో సమానం.

వేలానికి జేమ్స్ బాండ్ కారు

ఈ కారు ఇప్పటికూ పూర్తిగా పనిచేస్తుంది. ఫ్లోరిడాకు చెందిన పెర్రీ ఓషియనోగ్రాఫిక్ తయారు చేయగా, రిటైర్డ్ అమెరికా నేవీ సీల్ పైలట్ డాన్ గ్రిఫ్ఫిన్ నడిపారు.

వేలానికి జేమ్స్ బాండ్ కారు

ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ లోటస్ కారును న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు.

వేలానికి జేమ్స్ బాండ్ కారు

దాదాపు 10 ఏళ్ల వరకూ ఈ కారును అదే కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారు. కాగా, 1989లో ఈ స్టోరేజ్ స్పేస్ అద్దె ముగిసిపోయింది.

వేలానికి జేమ్స్ బాండ్ కారు

ఈ కారును క్లెయిమ్ చేస్తూ, ఎవ్వరు రాకపోవటంతో ఓ జంట ఈ కారును గుడ్డిగా వేలం వేసేసింది.

వేలానికి జేమ్స్ బాండ్ కారు

ప్రస్తుతం ఈ కారు లండన్‌లోని ఆర్ఎమ్ ఆక్షన్ సంస్థ వద్దకు చేరింది. సెప్టెంబర్ 8,9 తేదీలలో ఈ కారుకు వేలం నిర్వహించనున్నారు.

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1

లోటస్ ఈస్పిరిట్ సిరీస్ 1

లోటస్ ఈస్పిరిట్ (వీడియో)

Most Read Articles

English summary
Of the dozen or so cars used by James Bond in 007 flicks one of the most well known and iconic car is the Lotus Esprit Series 1. Featured in the 1977 movie The Spy Who Loved Me, starring Roger Moore, the Lotus Esprit was an amphibious car, which was capable of underwater travel like a submarine.
Story first published: Monday, July 1, 2013, 13:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X