స్టెల్త్ యుద్ద విమానాన్ని రూపొందించుకున్న జపాన్: మరి భారత్ పరిస్థితి ఏంటి ?

By Anil

జపాన్, శత్రువులకు దొరకకుండా యుద్ద క్షేత్రంలో గగనంలోకి పరుగులు తీసే అత్యంత శక్తివంతమైన తొలి స్టెల్త్ యుద్ద విమానాన్ని గత వారంలో పరీక్షించి. అత్యంత శక్తివంతమైన మరియు అత్భుత పనితీరును కనబరిచే యుద్ద విమానాలను కలిగిన అతి తక్కువ దేశాల సరసన జపాన్ కూడా చేరిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

జపాన్ స్టెల్త్ యుద్ద విమానం

జపాన్ స్టెల్త్ యుద్ద విమానం

తాజాగా చైనా తూర్పు ఆసియా సముద్ర భాగంలో ఎక్కువ దూకుడుగా ప్రవర్తిస్తున్న నేఫథ్యంలో జపాన్ ఈ స్టెల్త్ యుద్ద విమానాన్ని తయారు చేసుకున్నట్లు తెలిసింది.

జపాన్ స్టెల్త్ యుద్ద విమానం

జపాన్ స్టెల్త్ యుద్ద విమానం

దీనిని జపాన్‌కు చెంగిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సంస్థ తయారు చేసింది. శత్రువుల రాడార్లకు దొరకకుండా పరుగులు పెట్టే ఈ విమానికి ఎక్స్-2 అని పేరు పెట్టారు. మిత్సుబిషి ఎక్స్-2 స్టెల్త్ యుద్ద విమానం 14.174 మీటర్లు పొడవు మరియు దీని రెక్కలు 9.09 మీటర్లు పొడవులో కలవు.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ స్టెల్త్ యుద్ద విమానంలో మిత్సుబిషి రెండు టర్బో ఫ్యాన్లు గల జెట్‌ ఇంజన్‌లను అందించారు. తద్వారా ఇది మ్యాక్-2.25 వేగంతో ప్రయాణించగలదు. అంటే గంటకు 2,778 కిలోమీటర్ల వేగంతో. దీని నిర్మాణం కోసం సుమారుగా 332 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. దీని రేంజ్ 2,900 కిలోమీటర్లుగా ఉంది.

చైనీస్ షెంగ్‌యాంగ్ జె-31

చైనీస్ షెంగ్‌యాంగ్ జె-31

చైనా ద్వారా జపాన్ ఇబ్బందుల్లో పడ్డానికి కారణం మరొకటి ఉంది. చైనా అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్‌డ్ జె-31 స్టెల్త్ విమానాన్ని తయారు చేసుకుంది. దీనిని కొలతల పరంగా చూస్తే పొడవు 16.9 మీటర్లు పొడవు మరియు రెక్కలు 11.5 మీటర్లు పొడవుతో ఉన్నాయి.

ఇంజన్

ఇంజన్

ఇందులో టర్బో ఫ్యాన్ జెట్ గల రెండు ఇంజన్‌లు కలవు. ఇది సుమారుగా మ్యాక్1.8 వేగంతో (గంటకు 2222 కిలోమీటర్లు) దూసుకెళ్లగలదు మరియు ఇది కాంబాట్ రేంజ్ 4,000 కిలోమీటర్లుగా ఉంది. ఈ విమానం చైనా ఎయిర్ ఫోర్స్‌లోకి 2018 నాటికి పూర్తిగా అందుబాటలోకి రానుంది.

చైనీస్ చెంగ్డు జె-20

చైనీస్ చెంగ్డు జె-20

జపాన్ మరియు భారత్ రెండు కూడా చైనా వారి మరొక స్టెల్త్ యుద్ద విమానాన్ని ఎందుర్కోవాల్సి వస్తోంది. అదే చైనీస్ మెనాక్-2 - చెంగ్డు జె-20. ఈ జె-20 విమానం 20 మీటర్లు పొడవు మరియు 13 మీటర్లు రెక్కల పొడవుతో ఉంది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఇందులో చైనా దేశం జె-31 స్టెల్త్ యుద్ద విమానంలో వినియోగించిన ఇంజన్‌ను ఉపయోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ఈ జె-20 స్టెల్త్ విమానాన్ని 2019 నాటికి చైనా తమ ఎయిర్ ఫోర్స్‌లోకి ప్రవేశపెట్టనుంది. కాబట్టి చైనా సృష్టిస్తున్న ఈ అధునాతన స్టెల్త్ విమానాల ద్వారా జపాన్ మరియు భారత్ రెండు దేశాలు కూడా ముప్పును ఎదుర్కుంటున్నాయి.

రష్యా సుఖోయ్ పిఎ‌కె ఎఫ్ఎ

రష్యా సుఖోయ్ పిఎ‌కె ఎఫ్ఎ

స్టెల్త్ యుద్ద విమాన పరిజ్ఞాన్ని కలిగి ఉన్న దేశాలలో రష్యా ఒకటి రష్యా వద్ద ఉన్న మల్టీ రోల్ సుఖయో పిఎకె ఎఫ్ఎ యుద్ద విమానం సుమరుగా 19.8 మీటర్లు పొడవు 13.95 మీటర్లు పొడవైన రెక్కలతో డిజైన్ చేయబడింది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఇందులో రష్యా రెండు టర్బో ఫ్యాన్ జెట్ ఇంజన్‌లు కలవు. ఇవి ఇది గరిష్టంగా మ్యాక్ 2.3 (గంటకు 2,440 కిమీలు) వేగాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. రష్యా యొక్క పిఎకె ఎఫ్ఎ స్టెల్త్ యుద్ద విమానం రేంజ్ 5,500 కిలోమీటర్లుగా ఉంది.

సుఖోయ్/ హెచ్‌ఎఎల్ ఎఫ్‌జిఎఫ్ఎ

సుఖోయ్/ హెచ్‌ఎఎల్ ఎఫ్‌జిఎఫ్ఎ

రష్యా యొక్క సుఖోయ్‌కు దీటుగా హిందుస్తాన్ ఏరోనాటికల్స్ సంస్థ హెచ్‌ఎఎల్ ఎఫ్‌జిఎఫ్ఎ ను రూపొందించింది. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా రష్యా విమానంలో ఒక్కరు మరియు ఇండియన్ హెచ్‌ఎఎల్ ఎఫ్‌జిఎఫ్ఎ లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంది.

హెచ్‌ఎఎల్

హెచ్‌ఎఎల్

ప్రస్తుతం ఇండియా స్టెల్త్ పరిజ్ఞానం గల హెచ్‌ఎఎల్‌ ఎఎమ్‌సిఎ అనే స్టెల్త్ యుద్ద విమనాన్ని తయారు చేసే పనిలోని నిమగ్నమయ్యింది. ఎటువంటి ఇతర దేశాల పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందిస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టనుంది.

భవిష్యత్ స్టెల్త్ పరిజ్ఞానం- బి-2 స్పిరిట్ బాంబర్

భవిష్యత్ స్టెల్త్ పరిజ్ఞానం- బి-2 స్పిరిట్ బాంబర్

మొదటి సారిగా భవిష్యత్ తరాలకు సరిపోయేంత పరిజ్ఞానంతో అమెరికా రూపొందించిన ఈ బి-2 స్పిరిట్ బాంబర్ స్టెల్త్ యుద్ద విమానం అమెరికా వాయు సైన్యంలోకి 1997 లో ప్రవేశించింది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

21 మీటర్లు పొడవు మరియు 52.4 మీటర్లు వెడల్పాటి రెక్కలున్న ఈ స్టెల్త్ యుద్ద విమానాన్ని కోసోవా, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాక్‌లో జరిగిన యుద్దాల్లో అమెరికా వినియోగించింది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

అప్పట్లో ఇందులో ఎఫ్118-జిఇ-100 అనే నాలుగు ఎలక్ట్రి టర్బో ఫ్యాన్‌లు గల ఇంజన్‌లను వినియోగించారు. ఇంజన్‌లో చెలరేగే వేడిని అప్పటికప్పుడే చల్లార్చే ప్రత్యేక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారు.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ బి-2 స్పిరిట్ బాంబర్ స్టెల్త్ యుద్ద విమానం గరిష్టంగా మ్యా 0.95 ( గంటకు 1,010 కిమీలు) వేగంతో పరుగులు పెడుతుంది. దీని రేంజ్ గరిష్టంగా 11,100 కిలోమీటర్లుగా ఉంది.

నాత్రోప్ గ్రుమాన్ బి-21

నాత్రోప్ గ్రుమాన్ బి-21

అమెరికా ఈ బి-2 స్టెల్త్ విమానమే కాకుండా నాత్రోప్ గ్రుమాన్ బి-21 అనే మరొక శక్తివంతమైన స్టెల్త్ యుద్ద విమానాన్ని రూపొందిస్తోంది. ఇది ఈ బి-2 స్పిరిట్ బాంబర్ కన్నా శక్తివంతమైనది.

ఎఫ్-35 లైట్నింగ్ -II

ఎఫ్-35 లైట్నింగ్ -II

అమెరికా సంయుక్త నావికా మరియు వాయిు రంగం ఈ ఎఫ్-35 లైట్నింగ్ -II స్టెల్త్ విమానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఈ స్టెల్త్ యుద్ద విమానంలో సింగిల్ సిలిండర్ మాత్రమే కలదు. ప్రస్తుతం అమెరికాలోని మెరైన్ రంగంలో ఇది సేవలు అందిస్తోంది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

అమెరికాలో ఉన్న స్టెల్త్ యుద్ద విమానాల్లో తక్కువ దూరంలో టేకాఫ్ తీసుకోవడం మరియు ఉన్న ప్రదేశంలో నిటారుగా ల్యాండ్ అవగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక స్టెల్త్ విమానం కూడా ఇదే. దీని పొడవు సుమారుగా 15.5 మీటర్లు మరియు దీని రెక్కల పొడవు 10.7 నుండి 13.4 మీటర్లు మధ్య ఉండేటట్లు డిజైన్ చేస్తారు.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ ఎఫ్-35 స్టెల్త్ విమానంలో ప్రాట్ట్ అండ్ విట్నీ ఎఫ్135 టర్భో ఫ్యాన్ జెట్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా మ్యాక్ 1.61 ( గంటకు 1988 కిమీలు) వేగంతో దూసుకెళుతుంది. దీని రేంజ్ సుమారుగా 2,200 కిలోమీటర్లుగా ఉంది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ ఎఫ్-35 స్టెల్త్ యుద్ద విమానం యుకె, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, డెన్మార్క్, నెథర్లాండ్స్ మరియు టర్కీ వంటి దేశాల యొక్క ఎయిర్ ఫోర్స్ విభాగాలకు సేవలు అందించింది.

మార్టిన్ లాక్‌హీడ్ ఎఫ్-22 రాప్టర్

మార్టిన్ లాక్‌హీడ్ ఎఫ్-22 రాప్టర్

ప్రస్తుతం అన్ని స్టెల్త్ యుద్ద విమానాలకు రాజుగా ఉంది ఈ ఎఫ్-22 రాప్టర్. అన్నింటి కన్నా శక్తివంతమైన ఈ స్టెల్త్ విమాన్ని 2005 లో పరిచయం చేశారు. ఒక్కొక్క ఎఫ్-22 రాప్టర్ స్టెల్త్ విమానం ధర 200 మిలియన్ డాలర్లుగా ఉంటుంది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ ఎఫ్-22 18.92 మీటర్లు పొడవు మరియు 13.56 మీటర్లు పొడవు గల రెక్కలను కలిగి ఉంది. ఇందులో ప్రాట్ట్ అండ్ విట్నీ ఎఫ్119-పిడబ్ల్యూ-100 టర్బో ఫ్యాన్ ఇంజన్‌ను వినియోగంచారు.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఇది గరిష్టంగా మ్యాక్ 2.5 ( గంటకు 2,410 కిమీలు) వేగాన్ని చేరుకుంటుంది. స్టెల్త్ విమానాలు అన్నింటి కన్నా గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. దీని రేంజ్ సుమారుగా 3,220 కిలోమీటర్లుగా ఉంది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

లాక్ హీడ్ సంస్థ ఈ స్టెల్త్ యుద్ద విమానం పరిజ్ఞానంతో దీని స్థానంలో ఎఫ్-117 నైట్‌వాక్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం అమెరికా 187 ఎఫ్-22 స్టెల్త్ యుద్ద విమానాలను కలిగి ఉంది.

 ఎఫ్-117

ఎఫ్-117

మల్టీ రోల్ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్‌ను 1983 లో అమెరికా ఎయిర్ ఫోర్స్ వినియోగించింది. అయితే దీని గురించి 1988 లో వివిరాలు వెల్లడించింది. అంత వరకు దీనిని రహస్యంగా వినియోగించింది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ ఎఫ్-117 నైట్‌వాక్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పొడవు 20.09 మీటర్లు పొడవు మరియిు 13.2 మీటర్లు పొడవైన రెక్కలను కలిగి ఉటుంది. ఇందులో సాధారణ ఎలక్ట్రి టర్బో ఫ్యాన్‌ గల రెండు ఇంజన్‌లను కలిగి ఉంది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ ఎఫ్-117 స్టెల్త్ విమానం గరిష్టంగా మ్యాక్ 0.92 (గంటకు 993 కిమీలు) వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని రేంజ్ సుమారుగా 1,720 కిలోమీటర్లుగా ఉంది.

ప్రపంచపు మొదటి స్టెల్త్ విమానం

ప్రపంచపు మొదటి స్టెల్త్ విమానం

మీరు ఇప్పటి వరకు చాలా స్టెల్త్ యుద్ద విమానాలను చూశారు కదా. ఇందులో ప్రపంచపు మొదటి స్టెల్త్ విమానం ఏది అనే సందేహం కలిగి ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో నాజీ జర్మనీ 1944 లో మొదటి స్టెల్త్ యుద్ద విమానాన్ని వినియోగించింది.

స్టెల్త్ పితామహులు - హార్టిన్ బ్రదర్స్

స్టెల్త్ పితామహులు - హార్టిన్ బ్రదర్స్

రెండవ ప్రపంచ యుద్దంలో నాజీయులు ఓటమిని చవిచూశాక హిట్లర్ అక్కడ నుండి హార్టిన్ సొదరులు రూపొందించిన హో 229 యుద్ద విమానంలో తిరుగు ప్రయాణమయ్యాడు.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ స్టెల్త్ విమానంలో రెండు జంకర్స్ జుమో 004బి అనే టర్బో జెట్ ఇంజన్‌లను వినియోగించారు. ఆ తరువాత మొదటి టర్బో జెట్ ఇంజన్‌ల ఉత్పత్తిని ప్రారంభించారు.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

ఈ విమానం రెక్కలను అప్పట్లో చెక్కతో తయారు చేశారు మరియు రాడార్ల నుండి తప్పించుకోవడానికి కార్బన్ పొడి మరియు బంక మిశ్రమాలతో తయారు పదార్థాన్ని పూతగా పూశారు. ఇది 7.47 మీటర్లు పొడవు మరియు 16.76 మీటర్లు పొడవైన రెక్కలను కలిగి ఉండేది.

ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

నాజీ జర్మన్లు రెండవ ప్రపంచ యుద్దంలో ఓడిపోయాక ఈ విమానానికి చెందిన ప్రోటోటైప్ నమూనాలను అమెరికా సేకరించి పట్టుకెళ్లింది. దీని ప్రేరణతో దాదాపుగా 40 సంవత్సరాల తరువాత అమెరికా బి-2 స్టెల్త్ యుద్ద విమానాన్ని తయారు చేసుకుంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీ కోసం....

విశ్వపు అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 గురించి ఆసక్తికర విషయాలు

ఖండాతరాలను చుట్టేస్తున్న 19 నాన్-స్టాప్‌ విమానాలు: ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీ కోసం....

ఆకతాయిలు వేసే లేజర్ లైట్లు ప్లైట్లోని అమాయకుల పాలిట మృత్యువుగా మారుతోంది... ఎందుకు ?

ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా

Most Read Articles

English summary
Japan Gets Its Own Stealth Jet! Is India Even Close?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X