సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే జస్పాల్ బ్రతికి ఉండేవాడు: వైద్యులు

By Ravi

నవ్వుల రేడు 'కింగ్ ఆఫ్ సెటైర్' జస్పాల్ భట్టీ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ప్రజలకు వినోదాన్ని అందిస్తూ.. భారతీయుస గుండెల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న జస్పాల్ మరణానికి నిర్లక్ష్యం కూడా ఓ కారణం అని చెప్పవచ్చు. జస్పాల్ భట్టీ ప్రయాణిస్తున్న హోండా అకార్డ్ కారు మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టును ఢీకొనడంతో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.

జస్పాల్ భట్టీ మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన జలంధర్ సివిల్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపిన దాని ప్రకారం, వెనుక సీటులో ప్రయాణిస్తున్న జస్పాల్ భట్టీ సీట్ బెల్ట్ ధరించి ఉండి ఉంటే ప్రమాధ తీవ్రత తక్కువగా ఉండి ఆయన బ్రతికి ఉండే అవకాశం ఉండేదని వారు వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తు సీట్ బెల్ట్ ధరించడం కారణంగా ఫ్రంట్ సీట్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయపడ్డారని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో జస్పాల్ తలకు బలమైన గాయం తగలటం వలన పుర్రె ఎముకులు విరిగి, రక్తం గడ్డ కట్టి మరణించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. సంజ్ ఖన్నా తెలిపారు.

జస్పాల్ భట్టీ కారు ప్రమాదం

జస్పాల్ భట్టీ ఫైల్ ఫోటో

జస్పాల్ భట్టీ కారు ప్రమాదం

ప్రమాదానికి గురైన జస్పాల్ భట్టీ కారు

జస్పాల్ భట్టీ కారు ప్రమాదం

హోండా అకార్డ్ కారులో వెనుక సీటులు కూర్చునే ముగ్గురు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సీట్ బెల్ట్స్.

జస్పాల్ భట్టీ కారు ప్రమాదం

అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సీట్ బెల్టులను ధరించడం తప్పనిసరి.

జస్పాల్ భట్టీ కారు ప్రమాదం

జస్పాల్ భట్టీ హోండా అకార్డ్ కారు


వాస్తవానికి ప్రసుతం అమల్లో ఉన్న ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రతా ప్రయోజనార్థం, ప్రయాణికులంతా సీట్ బెల్టును ధరించడం తప్పనిసరి (ఈ విధానం ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో తప్పనిసరిగా పాటించడం జరుగుతుంది). అయితే, మనదేశంలో కేవలం ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకోవటానికి మాత్రమే ఈ నిబంధనను పాటించడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం.

అత్యవర సమయాల్లో సీట్ బెల్ట్ రక్షణ కవచంలా ప్రయాణికులను రక్షిస్తుంది. దీనిని విస్మరిస్తే ఇదే ప్రయాణికుల పాలిట యమపాశంగా మారుతుంది. జస్పాల్ భట్టీ విషయంలో కూడా ఇదే జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని సీట్ బెల్ట్ ప్రాధాన్యతను గుర్తుంచుకోండి. వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్‌ను ధరించటం మర్చిపోకండి..!

Most Read Articles

English summary
Jaspal Bhatti car crash has once again brought to fore the gaping flaw in the motor vehicles safety provisions. Doctors of the Civil Hospital, Jalandhar, who performed Bhatti’s autopsy say the impact of injury could have been less had he fastened his rear seat belt.
Story first published: Tuesday, October 30, 2012, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X