ఫోర్డ్ మస్టాంగ్ కొనుగోలు చేసిన కొలవెరి స్టార్ ధనుష్

"వై దీస్ కొలవెరి సాంగ్" తో మంచి పాపులారిటీ దక్కించుకున్న తమిళ హీరో ధనుష్ ఫోర్డ్ ఇకానిక్ స్పోర్ట్స్ కారు మస్టాంగ్ ను కొనుగోలు చేశాడు.

Written By:

ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి 100 కు పైగా మస్టాంగ్ కార్లు అమ్ముడుపోయాయి. సెలబ్రిటీలయితే పోటీపడి మరీ ఎంచుకుంటున్నారు. ఈ మధ్య తాజాగ దక్షిణ భారత సెలబ్రిటీ తమిళ హీరో ధనుష్ బ్లాక్ ఎడిషన్ ఫోర్డ్ మస్టాంగ్‌ను ఎంచుకున్నాడు.

ఫోర్డ్ మోటార్స్ సుమారుగా 60 ఏళ్ల నుండి తమ ఇకానిక్ మస్టాంగ్ కారును ఏడాదికి ఒకటి చెప్పున ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చింది. అయితే మొదటి సారిగా 2015 ఏడాదితో దేశీయ విపణిలోకి మస్టాంగ్‌ను ప్రవేశపెట్టింది.

అనతి కాలంలో బాగా సుపరిచితమైన తమిళ హీరోలలో ధనుష్ ఒకరు. త్రీ అనే చిత్రంలో వై దీస్ కొలవెరి డీ అనే పాటతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. యువత ఎక్కువగా ఇష్టపడే సినిమాలు చేస్తూ దక్షిణ భారత సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు.

చాలా మంది ఫోర్డ్ మస్టాంగ్‌ను ఎరుపు, పసుపు మరియు తెలుగు రంగుల్లో ఎంచుకుంటున్నారు. అయితే ధనుష్ మాత్రం ఇందుకు విరుద్దంగా బ్లాక్ ఎడిషన్ మస్టాంగ్ ను ఎంచుకున్నాడు.

ఇకానిక్ మస్టాంగ్ కారు విషయానికి వస్తే, ప్రత్యేక పరిచయం అక్కర్లేదు, ఎన్నో ఏళ్లుగా భారతీయులు డ్రీమ్ కారు గత ఏడాది రూ. 65 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి అందుబాటులోకి వచ్చింది. ఫోర్డ్ అందుబాటులో ఉంచిన మొదటి లాట్ మస్టాంగ్ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

అయితే ఇప్పటికీ దీనికున్న డిమాండ్ తగ్గడం లేదు. వరుసగా బుకింగ్స్ నమోదవుతున్న నేపథ్యంలో మస్టాంగ్ డెలివరీకి కొన్ని నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ప్రకటిస్తోంది ఫోర్డ్. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి తక్కువ ధరతో అందుబాటులో ఉన్న వి8 ఇంజన్ గల కారుగా ఫోర్డ్ మస్టాంగ్ మొదటి స్థానంలో నిలిచింది.

ఫోర్డ్ మస్టాంగ్ ను ఎంచుకున్న దక్షిణ భారత దేశంలో ఉన్న సెలబ్రిటీల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్ అంబటి రాయుడు హైదరాబాద్‌లో రెడ్ ఎడిషన్ ఫోర్డ్ మస్టాంగ్ ఎడిషన్ కారును ఎంచుకున్నాడు.

తరువాత సెలబ్రిటీ కాళిదాస్ జయరామన్, కేరళకు చెందిన సినీ నటుడు ఫోర్డ్ మస్టాంగ్ ను ఎంచుకున్నాడు. బాల నటుడిగా మళయాల చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాళిదాస్ జయరామన్ వయసు 24 సంవత్సరాలు.

రోహిత్ శెట్టి, భారత సినీ చరిత్రలో అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు రోహిత్ శెట్టి. దేశీయంగా పూర్తి స్థాయిలో మొదటి స్టమైజ్డ్ మస్టాంగ్ కారును ఎంచుకున్నాడు. సింగమ్ రిటర్న్స్ మరియు చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలు ఇతని దర్శకత్వంలో రూపుదిద్దుకున్నవే.

భారతీయులకు ఫేవరేట్ స్పోర్ట్స్ కారుకు మంచి అమ్మకాలను నమోదు చేసుకుంటున్న మస్టాంగ్ విషయానికి వస్తే, ఇందులో 5.0-లీటర్ సామర్థ్యం గల వి8 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 396బిహెచ్‌పి పవర్ మరియు 515ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

అమెరికా ఆధారిత ఫోర్డ్ తమ మాతృ దేశంలో ఈ మస్టాంగ్ ను మరో రెండు ఇంజన్ ఆప్షన్‌లతో అందిస్తోంది. అవి, 2.3-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ఎకో బూస్ట్ మరియు 3.5-లీటర్ల సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి6 పెట్రోల్ ఇంజన్.

జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
అప్పటి నుండి ఇప్పటి నుండి ఇప్పటి వరకు.... తమిళ దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారు కలెక్షన్

డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్
నూతన అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో రాష్ట్రపతిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఇతనికి కార్లంటే భలే పిచ్చి. కార్లను ఎంచుకునే విషయంలో కూడా ఇతనిది ప్రత్యేకమైన శైలి. ట్రంప్ వద్ద ఉన్న కార్ల వివరాలు

ఫెరారి కార్లను కలిగి ఉన్న పది ఇండియన్ సెలబ్రిటీలు...!!
సామాన్య ప్రజలకు ఫెరారి, ల్యాంబోర్గిని వంటి కార్లను కొనుగోలు చేసే స్థోమత లేకపోవచ్చు. కాని దేశీయంగా ఉన్న ఎంతో మంది నటులు మరియు వ్యాపారవేత్తలలో కేవలం అతి కొద్ది మాత్రమే ఫెరారి కార్లను కలిగి ఉన్నారు. అయితే దేశీయంగా ఫెరారి కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాను పరిశీలిస్తే పది మంది ఉన్నారు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, January 6, 2017, 11:14 [IST]
English summary
Tamil Actor Dhanush Bought Ford Mustang Car
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK