హైదరాబాద్: కస్టమర్ల సొమ్ముతో పరారైన బైక్ షోరూమ్ మేనేజర్

By Ravi

హైదరాబాద్: నగరంలో స్పోర్ట్స్ బైక్ బుక్ చేసుకోవటానికి వెళ్తున్నారా..? అయితే పారాహుషార్.. సదరు బైక్ షోరూమ్ వాళ్లు మీ డబ్బుతో ఉడాయించే ఆస్కారం ఉంది. నగర నడిబొడ్డులో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే.. బంజారా హిల్స్‌లోని కెబిఆర్ పార్క్‌కు ఎదురుగా, రోడ్ నెం.2లో ఉన్న 'బంజారా హిల్స్ కెటిఎమ్' షోరూమ్‌లో కెటిఎమ్ స్పోర్ట్స్ బైక్‌ల కోసం కస్టమర్లు చెల్లించిన డబ్బుతో జ్యోతిరాజు అనే స్టోర్ మేనేజర్ ఉడాయించాడు.

శేషగిరి అనే ఓ కస్టమర్ మూడు నెలల క్రితం తాను రూ.40,000 అడ్వాన్స్ మొత్తాన్ని కట్టి ఓ స్పోర్ట్స్ బైక్‌ను బుక్ చేసుకున్నానని, కానీ బైక్ బుక్ చేసుకొని మూడు నెలలు దాటిపోయినప్పటికీ ఇంకా షోరూమ్ వాళ్లు బైక్‌ను డెలివరీ చేయలేదని, ఇందుకు కారణం ఏంటని విచారిస్తే, సదరు స్టోర్ మేనేజర్ జ్యోతిరాజు కస్టమర్లు కట్టిన డబ్బుతో ఉడాయించాడని తెలిసిందని ఓ టెలివిజన్ ఛానెల్‌తో చెప్పుకొచ్చాడు.

KTM Bikes

జ్యోతిరాజు బాధితుల్లో తాను మాత్రమే కాకుండా మరో 20 మంది కస్టమర్లు ఉన్నారని, ఇలా వారి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు అడ్వాన్సులను సేకరించి, పరారైనట్లు తనతో షోరూమ్ యాజమాన్యమే చెప్పిందని శేషగిరి వెల్లడించారు. ఈ విషయమైన కెటిఎమ్ షోరూమ్ జిఎమ్ తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

కాబట్టి, మిత్రులారా.. ఇకపై ఏ షోరూమ్‌లోనైనా సరే లేదా సేల్స్ పర్సన్ వద్దనైనా సరే మీ వాహనాన్ని బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితమైన రసీదును తీసుకోవటం మర్చిపోకండి.

Most Read Articles

English summary
In an incident, a Store Manager at Banjara Hills KTM showroom has cheated around 20 customers in Hyderabad. He collected the advance amount for sports bike delivery and escaped with the money.
Story first published: Tuesday, November 26, 2013, 17:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X