వీడియో: సైలెన్సరే సైలెంట్‌గా కాల్చేసింది..

By Ravi

కోట్ల రూపాయల ఖరీదు చేసే సూపర్‌కార్లను కొనుగోలు చేయటం ఒక ఎత్తయితే, వాటిని సరిగ్గా మెయింటైన్ చేయటం మరొక ఎత్తు. వీటిలో ఉండే శక్తివంతమైన ఇంజన్ పెట్రోల్‌ని మంచినీళ్ల ప్రాయంగా తాగేస్తూ, డ్రైవర్లకు వినోదాన్ని పంచుతుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఇలా సైలెన్సర్ ద్వారా నిప్పులు కూడా కురిపిస్తుంటుంది.

లండన్‌లోని స్లోయెన్ స్ట్రీట్‌పై ఇలానే ఓ లాంబోర్గినీ సూపర్‌కారు సైలెన్సర్ నుంచి వచ్చిన స్కార్క్, ఆ కారును కాల్సేసింది. సాధారణంగా సూపర్‌కార్లు సైలెన్సర్ (ఎగ్జాస్ట్) ద్వారా అప్పుడప్పుడూ స్పార్క్ వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ స్పార్క్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే, ఆ కారునే తగలబెట్టే అంత.

ఈ బ్లాక్ కలర్ లాంబోర్గినీ అవెంటేడర్ విషయంలోనూ అదే జరిగింది. సదరు కారు ఓనర్ ఇంజన్ స్టార్ట్ చేయగానే ఎగ్జాస్ట్ నుంచి వచ్చిన స్పార్క్‌తో కారు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ తన జాకెట్‌తో మంటను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాకపోవటం, మండుతున్న కారునే నడుపుకుంటూ కాస్తంత ముందుకు వెళ్లిపోయాడు.

కారు నడపటం వలన మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు వాటర్ బాటిళ్ల సాయంతో మంటను ఆర్పేశారు. లేకుంటే, కారు మొత్తం కాలి బూడిదై ఉండేది. ఆ స్టన్నింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/oNCGWiOtfKo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
There have been several instances where vehicles have caught on fire or some problem has occurred that causes an accident. Today, we found an owner of Lamborgini's Aventador showing off his exhaust note, which is truly impressive.&#13;
Story first published: Thursday, November 6, 2014, 10:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X