కాస్ట్లీ కార్లను గిఫ్టిచ్చే తల్లిదండ్రులకు చక్కటి గుణపాఠం

18 వ పుట్టినరోజు కానుకగా కుమారునికి అతని తల్లిదండ్రులు లాంబోర్గిని కారును గిఫ్టిచ్చారు, నిజానికి ఆ వయస్సుకు తగ్గ కానుక కాదిది.ఎందుకంటే ఈ కుర్రాడు గిప్ట్‌గా తీసుకున్న కారుతో నానా బీభత్సం సృష్టించాాడు..

Written By:

లాంబోర్గిని సూపర్ కార్లంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. టీనేజర్లయితే మరీ ఇష్టపడతాడు. అయితే టీనేజర్లకు వీటిని నడపడం పట్ల మెళుకువలు సరిగా తెలియవు, మరియు సూపర్ కార్లను నడపడానికి ముందుగా తగిన శిక్షణ అవసరం. లేదంటే ఈ కథనంలో చూపినట్లే జరుగుతుంది.

కార్‌స్కూప్ అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాలు మేరకు, ఈ కథనంలో ఉన్న ఫోటోలు మరియు వీడియోలు ప్రకారం అత్యంత ఖరీదైన లాంబోర్గిని కారును ఒక అబ్బాయి 18 ఏళ్ల పుట్టిన రోజు కానుకగా బహుకరించినట్లు తెలిసింది.

ఈ కుర్రాడు కొన్నాళ్ల పాటు ఎలాంటి ప్రమాదం జరపకుండా జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చాడు. అయితే గత వారాతంలో మలేషియాలో యాక్సిడెంట్ చేసాడు. ఎక్ట్సీరియర్ పరంగా గమనిస్తే, ఈ కారు దాదాపుగా ధ్వంసమైపోయింది.

ప్రమాద స్థలిని పరిశీలించాక, ఈ రహదారి ఎక్కువగా జారుడు స్వభావాన్ని కలిగి ఉండటం వలన, అదుపు తప్పి ప్రక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు, ఇందులోని కుర్రాడు, అతనితో ప్రయాణించిన మరో వ్యక్తి సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఈ ప్రమాదానికి చెందిన ఫోటోలను మరియు వీడియోను పరిశీలించి లాంబోర్గిని గల్లార్డోలోని ఏ వెర్షన్ అని చెప్పడం కాస్త కష్టతరమే. ఎందుకంటే, గత పది సంవత్సరాల నుండి లాంబోర్గిని గల్లార్డో మోడల్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో అనేక వెర్షన్‌లను విడుదల చేస్తూ వచ్చింది.

కారు అంచు భాగంలో ఉండే లోయర్ రేసింగ్ స్ట్రిప్ ఆధారంగా 2011లో సింగపూర్‌లో విడుదలైన లాంబోర్గిని గల్లార్డో లిమిటెడ్ ఎడిషన్ అని స్పష్టం అవుతోంది.

18 ఏళ్ల వయస్సున్న కుర్రాడు చేసిన లాంబోర్గిని గల్లార్డో ప్రమాద అనంతరం తీసిన వీడియోను వీక్షించగలరు....

సూపర్ కార్లను కొనుగులు చేయడం విదేశాల్లో పెద్ద సమస్య కాదు. కాని వాటిని పబ్లిక్ రోడ్ల మీద నడపడం అంత సురక్షితం కాదు, ఇందుకు శిక్షణ తీసుకోవడం ముఖ్యం. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. భద్రత పరంగా లాంబోర్గిని ఉత్తమ నియమాలను పాటిస్తుంది కాబట్టి ఈ కారులో ఉన్న ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు....

ఖరీదైన హెలికాఫ్టర్, 120 లగ్జరీ కార్లను కలిగిన గుట్కా, పాన్ మసాలా బిజినెస్ మేన్
ఓ సాధరణ వ్యక్తిగా వచ్చి గుట్కా బిజినెస్, ప్రారంభించి ఇప్పడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అత్యంత ఖరీదైన 120 లగ్జరీ కార్లను మరియు హెలికాఫ్టర్‌ను కలిగి ఉన్నాడు. గుట్కా తినే ప్రతి వ్యక్తి చదవాల్సిన కథనం.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, March 1, 2017, 17:47 [IST]
English summary
18-Year Old Crashes Lamborghini — Proof That Age Really Isn't Just A Number
Please Wait while comments are loading...

Latest Photos