రెండు ముక్కలైన లాంబోర్గినీ, బుద్ధుడే కాపాడాడన్న డ్రైవర్!

By Ravi

సూపర్ కార్లలో డ్రైవింగ్ చాలా ఫన్‌గా ఉంటుంది. ఈ ఫన్ టూ రైడ్ కార్లను నడపటం ఓ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్. అయితే, ఇలాంటి సూపర్ కార్లలో డ్రైవింగ్ అన్ని వేళల్లో సరదాగా, థ్రిల్లింగ్‌గా ఉండకపోవచ్చు. ఇదిగో ఈ సంఘటన చూడండి.. ఓ లాంబోర్గినీ సూపర్ కార్ డ్రైవర్ దాదాపు యమలోకపు గేటు వరకూ వెళ్లి తిరిగొచ్చాడు.

మితిమీరిన వేగం ఎప్పటికీ ప్రమాదమే. ఇదిగో ఆ వేగానికి బలైనదే ఈ ఖరీదైన లాంబోర్గినీ కారు. ప్రత్యేకించి సూపర్ కార్లను వేగంలో కంట్రోల్ చేయటం సాధ్యం కాదు. ఇవి అదుపు తప్పితే, వాటి వలన కలిగే ప్రమాదం అంచనాలకు మించినది. గతంలో న్యూయార్క్ సిటీలోని బ్లూక్లిన్‌లో మితమీరిన వేగంతో వచ్చిన ఓ తెలుపు రంగు లాంబోర్గినీ కారు అదుప తప్పి, ప్రమాదానికి గురై రెండు ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసినదే.

Lamborghini Gallardo

కాగా.. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే థాయ్‌లాండ్‌లో చేసుకుంది. బుద్ధుడి భక్తుడైన ఓ 40 ఏళ్ల వ్యాపారవేత్త తన లాంబోర్గినీ గల్లార్డో కారులో తడిసిన రోడ్డుపై సుమారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, కారు అదుపు తప్పి చెట్టుకు గుద్దుకుంది. అత్యంత వేగంతో వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో కారు రెండు ముక్కలుగా విడిపోయింది.

ఇంజన్ భాగం రోడ్డుపైనే పడిపోగా, క్యాబిన్ భాగం రోడ్డు పక్కనే గడ్డిలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో డ్రైవర్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ జరగటానికి ముందే డ్రైవర్ బుద్ధుని గుడిని దర్శించుకొని వచ్చానని, బుద్ధుడే తనని కాపాడాడని చెప్పుకొచ్చాడు. అయితే, మితమీరిన వేగమే ఇందుకు ప్రధాన కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Lamborghini Gallardo Crash

వయా బ్యాంకాక్‌పోస్ట్
Most Read Articles

English summary
In a shocking news, a Lamborghini Gallardo supercar has split in half after what can only be presumed as a high-speed crash in Thailand.
Story first published: Monday, June 30, 2014, 13:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X