భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

By Anil

లేజర్, ఈ పదం వినగానే ఒక సారి మీద పడితే అమాతం ప్రాణాలను హరించి వేస్తుంది అని చాలా మంది అభిప్రాయం.ఇది నిజమే అయినప్పటికీ ఎక్కువ రేంజ్ గల లేజర్‌కు మాత్రమే ఆ శక్తి ఉంటుంది. దీనిని మంచికి వినియోగించుకుంటే అంతే మంచిది. చెడుకు వినియోగిస్తే తక్కువ వ్యవధిలోనే ప్రపంచం మొత్తాన్ని భూ స్థాపితం చేయవచ్చు.

లేజర్ లైటు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అనేగా మీ డౌట్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆకతాయిలు లేజర్‌ను సరాసరి విమానాలు మరియు హెలికాఫ్టర్ల మీదకు ప్రయోగిస్తున్నారు. తద్వారా పైలట్ మరియు విమానంలోని ప్రయాణికులు మొత్తం కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. దీనికి సంభందించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

లేజర్ లైట్లు రకాలు

లేజర్ లైట్లు రకాలు

ప్రస్తుత కాలంలో బ్లూ మరియు ఆకుపచ్చ వర్ణాలలో లేజర్ లైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి తక్కువ ధర కలిగి ఉంటాయి మరియు అత్యధిక దూరం వరకు ఈ లేజర్ కిరణాలు ప్రసారం అవుతాయి. ఈ రెండింటికి ముందు ఎరుపు వర్ణం లేజర్ లైట్లు ఉండేవి.

సరదాగా

సరదాగా

వీటిని చిన్న తనంలో సరదాగా ఆడుకునేందు చిన్న పరిమాణంలో తయారు చేసి అందుబాటులో ఉంచారు. అయితే కొన్ని దేశాలకు చెందిన మార్కెట్లు అధిక దూరం ప్రయాణించే మరియు అత్యంత శక్తివంతమైన లేజర్ భీమ్ లైటింగ్ పరికరాలను తయారు చేస్తున్నాయి. అయితే వీటి వలన ఎలాంటి ఉపయోగం లేదు.

విమానాలకు ముప్పు

విమానాలకు ముప్పు

చాలా మంది ఆకతాయిలు నింగిలో వెళుతున్న విమానాల మీద అత్యంత శక్తివంతమైన లేజర్ లైటింగ్ భీమ్‌ను ప్రయోగిస్తున్నారు. ఇది పైలట్ మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి.

ప్రమాదాలు జరిగే అవకాశాలు

ప్రమాదాలు జరిగే అవకాశాలు

లేజర్ కిరణాల ధాటికి పైలట్ చూపును కొల్పోయి విమానం పేళిపోవడానికి లేదా కూలిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా విమానాలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మొత్తం ప్రమాదానికి గురవుతారు.

కాక్‌పిట్ మీద ప్రభావం

కాక్‌పిట్ మీద ప్రభావం

లేజర్ లైటింగ్ సరాసరి విమానాల మీదకు ప్రయోగించడం వలన విమానాలలోని కాక్‌పిట్‌లు నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జరిమానాలు

జరిమానాలు

ఇలా విమానాల మీదకు లేజర్ లైటింగ్‌ను ప్రయోగించే వారిని పట్టుకుని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జరిమానాలు కూడా విధిస్తోంది. ఇప్పటి వరకు ఇలా జరిమానాల రూపంలో 11,000 డాలర్లు వచ్చినట్లు ఎఫ్ఎఎ తెలిపింది.

 1000 వరకు ప్రమాద నివేధికలు

1000 వరకు ప్రమాద నివేధికలు

ఎఫ్ఎఎ ఇలా జరిమానాలు విధించడానికి తీసుకున్న నిర్ణయం వెనకున్న కారణం 2011 లో దాదాపుగా 1000 వరకు లేజర్ లైట్ ప్రయోగించిన సంఘటనలను పైలట్లు నివేధించారు. 2010 లో వీటి సంఖ్య దాదాపుగా 2836 వరకు ఉండేది.

 కొన్ని వేల అడుగుల వరకు ప్రయాణించగలవు

కొన్ని వేల అడుగుల వరకు ప్రయాణించగలవు

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నీలం మరియు ఆకు పచ్చ వర్ణాలలో ఉన్న లేజర్ లైట్లు ప్రసారించే లేజర్ కిరణాలు గాలిలోకి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలవు. అందువలన చీకటిలో ఎగురుతున్న విమానాల మీదకు లేజర్ కాంతిని ప్రసారింపజేస్తున్నారు.

కంటికి కనిపించని కాంతిని

కంటికి కనిపించని కాంతిని

లేజర్‍‌ను మనం మూడు లేదా నాలుగు రంగులలో చూడగల కాని మన కంటికి కనిపించని లేజర్ కిరణాలు ఉన్నట్లు మరియు వాటిని విమానాల మీదకు ప్రయోగించడం వలన కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ప్రమాదానికి గురికావడం జరుగుతున్నట్లు తెలిసింది.

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ విమానం మీద

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ విమానం మీద

ఈ ఏడాది ఫిబ్రవరి లో లండన్‌కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ వారి విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సమయానికి తిరిగి విమానాశ్రయానికి ల్యాండింగ్ కోసం వచ్చింది.

కారణం

కారణం

ఇలా అకస్మాత్తుగా పైలట్ విమానాన్ని వెనక్కు తీసురావడానికి గల కారణం గురించి అధికారులు ఆరా తీయగా, అత్యంత శక్తివంతమైన లేజర్ భీమ్ కాంతిని విమానం మీద ప్రయోగించడటం వలన కంటి చూపు కొంచెం మందగించినట్లు వివరణ ఇచ్చాడు.

అట్లాంటిక్ మహాసముద్రంపై

అట్లాంటిక్ మహాసముద్రంపై

అట్లాంటిక్ మహాసముద్రం దాటిని వెంటనే విఎస్025 విమానం ఈ ఇలా లేజర్ కాంతిని ఎదుర్కొంది, దీనిని పైలట్ మరియు కో పైలట్ సురక్షితంగా అర్థరాత్రి పూట విమానాన్ని లండన్‌లోని హిత్రోయ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు.

అనుభవపూర్వకంగా

అనుభవపూర్వకంగా

బ్రిటీష్ ఎయిర్‌వేస్ పైలట్స్‌ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్న ఒక పైలట్ దీని గురించి మాట్లాడుతూ" చీకటిలో విమానం నడుపుతున్నపుడు పైలట్లు శక్తివంతమైన లేజర్ లైటింగ్‌కు గురి అయ్యి తాత్కాలికంగా చూపును కోల్పోయే అవకాశం ఉందని తెలిపాడు".

క్షణిక కాలంలో

క్షణిక కాలంలో

ఈ సంఘటన గురించి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ మెక్ అస్లన్ మాట్లాడుతూ, ఇది సాధారణ చర్య కాదు, లేజర్ కాంతిని ప్రయోగించిన తరువాత గడియార ఇచ్చే అలారమ్ శబ్దానికన్నా వేగంగా దాడి చేస్తుంది అని తెలిపాడు.

 భారీ స్థాయిలో నమోదు అవుతున్న లేజర్ సంఘటనలు

భారీ స్థాయిలో నమోదు అవుతున్న లేజర్ సంఘటనలు

2015 తొలిసగానికి బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీస్‌కు లేజర్ భీమ్ లైటింగ్‌కు సంభందించి 414 మరియు 2014 లో 1,440 వరకు నివేధికలు నమోదు అయ్యాయి.

 తక్కువ ఖర్చు మరియు ఎక్కువ రేంజ్

తక్కువ ఖర్చు మరియు ఎక్కువ రేంజ్

భారీ ప్రమాదాలు జరగడానికి కారణమయ్యే ఎక్కువ దూరం పాటుని లేజర్‌ కిరణాలను ప్రసారించగలిగే సామర్థ్యం ఉన్న లేజర్‌ లైట్లు తక్కువ ధరలకే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఇతర అవసరాల కోసం

ఇతర అవసరాల కోసం

లేజర్‌‌ను వైద్య రంగంలో శస్త్ర చికిత్సల కోసం వినియోగిస్తారు.

వినోదాల కోసం

వినోదాల కోసం

లేజర్ కాంతిని మ్యూజిక్ షో, ఆటో షో, టీవీ షో మరియు పబ్బులు, బార్లలో వీటిని విరివిగా వినియోగిస్తారు.

చట్టపరమైన నియమాలు

చట్టపరమైన నియమాలు

వీటి వాడకానికి చాలా వరకు దేశాలలో చట్టపరమైన నియమాలు కూడా ఉన్నాయి.

జైలు శిక్షలు

జైలు శిక్షలు

విమానాల మీదకు లేజర్ భీమ్ కిరణాలు ప్రసరించడానికి కారణం అయిన వారిని విమానయాన అథారిటీలు అరెస్ట్ చేసి జరిమానా మరియు జైలు శిక్షలు కూడా విధించారు.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్‌ నుండి భద్రత కోసం పాటించాల్సిన దూరం ఇందులో మీరు చూడవచ్చు.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్ భీమ్ లైటింగ్ ప్రయోగించక ముందు పైలట్ క్యాబిన్...

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్ భీమ్ లైటింగ్ ప్రయోగించిన తరువాత పైలట్ క్యాబిన్...

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్ భీమ్ లైటింగ్ విపత్తును తెలిపే చిత్రం

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

ఎఫ్‌ఎఎ వద్ద లేజర్ భీమ్ లైటింగ్ అట్టాక్‌కు సంభందించి రాత్రి వేళ ఎనిమిది గంటల నుండి 11 గంటల మధ్య లేజర్ లైటింగ్‌ దాడులు జరగుతున్నట్లు తెలిపే గ్రాఫ్.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్ భీమ్ లైటింగ్‌ను ప్రయోగించిన తరువాత పైలట్లు కళ్లు ఇలాంటి భయంకరమైన లైటింగ్‌కు గురి అయ్యి స్వల్పంగా కంటి చూపు మీద ప్రభావం పడుతుంది.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్ భీమ్ కాంతి తరంగాల దూరం మరియు వాటి ప్రభావాన్ని తెలిపే చిత్రం.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

పైలట్లు లేజర్ భీమ్ కాంతిని చూడాల్సిన పరిస్థతి ఎదురైతే పాటించాల్సిన నియమాలు గురించి.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం విమానాల మీద ప్రతి ఏడాది జరిగిన లేజర్ దాడులకు చెందిన వివరాలు గ్రాఫ్‌లో...

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

లేజర్ భీమ్ లైటింగ్ రకాలు

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

పబ్బులు మరియు బార్లలో లేజర్ లైటింగ్‌ను వినియోగించే తీరు.

మరిన్ని కథనాల కోసం

మృదువైన పక్షి ఢీ కొంటె పతనమవుతున్న విమానాలు: కారణాలు ఇవే

ఇలా చేస్తే ఎటువంటి విమన ప్రమాదం నుండి అయినా తప్పించుకోవచ్చు.

Most Read Articles

English summary
Laser Beam Attack-New Threat For Pilots and Travellers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X