సైకిల్‌రిక్షాపై కలకత్తా నుంచి లడక్ రోడ్ ట్రిప్.. బాప్రే..!

ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తైన మోటారబల్ రోడ్స్‌లో లడక్‌లోని ఖర్దుంగ్ లా పాస్ ఒకటి. అనేక మంది మోటారిస్టులు, ఆఫ్-రోడ్ ప్రియులు ఈ ప్రాంతంలో తమ మెషీన్లపై సవారీ చేసేందుకు మక్కువ చూపుతుంటారు. అయితే, ఎవ్వరూ కూడా ఇలాంటి ప్రమాదకరమైన రోడ్లపై, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని వాతావరణంతో కూడుకున్న ప్రదేశంలో సైకిల్‌రిక్షాపై సవారీ చేసే ప్రయత్నం చేయరు.

కానీ దక్షిణ కలకత్తాలోని నక్తలాకు చెందిన 40 ఏళ్ల సత్యన్ దాస్ మాత్రం ఈ సాహసం చేసి చూపించాడు. కలకత్తా నుంచి సైకిల్‌రిక్షా తొక్కుకుంటూ బయలుదేరి దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి లడక్ చేరుకున్నాడు. రిక్షా తొక్కి సంపాదించి దాచుకున్న మొత్తం మరియు స్థానికులు అందించిన విరాళాల సాయంతో అతను తన లగేజ్ ప్యాక్ చేసుకొని గడచిన నెలలో తన ప్రయాణం ప్రారంభించాడు.

తన రిక్షానే నివాసంగా మార్చుకున్నానని, రోజంతా దానితోనే గడుపుతుంటానని, లడక్ ట్రిప్ ప్రారంభించినప్పుడు ఏ సందర్భంలోను దీనిని విడిచిపెట్టాలనుకోలేదని దాస్ చెప్పుకొచ్చాడు. దాస్ ఇప్పటికే తన ట్రిప్‌లో భాగంగా ఉత్తర ప్రదేశ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అతను శ్రీనగర్ మీదుగా వచ్చే నెలలో కార్గిల్‌ను దాటిన తర్వాత లడక్ చేరుకుంటాడు.

Ladak Road

తన ప్రయాణం ద్వారా ప్రపంచ శాంతిని చాటాలనుకుంటున్నానని, అంతేకాకుండా సైకిల్‌రిక్షా అత్యంత చవకైన మరియు ప్రకృతి సాన్నిహిత్యమైన రవాణా సాధమని ప్రచారం చేయాలనుకుంటున్నాని దాస్ తెలిపాడు. దాదాపు ఐదు నెలల సమయంలో తన ప్రయాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్న దాస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో కూడా చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ప్రయాణాలంటే ఇష్టపడే దాస్ 2008లో కూడా సైకిల్‌రిక్షాలో తన భార్య, కుమార్తెతో హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్ మొత్తం చుట్టేశాడు. అయితే, ఈసారి ఒంటరిగా సుధీర్ఘ ప్రయాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సముద్ర మట్టం నుంచి దాదాపు 17,582 అడుగుల ఎత్తులో ఉండే ఖర్దంగ్ లా పాస్ నుంచి హిమాలయ పర్వతాలు అత్యంత సుందరంగా కనిపిస్తాయి.

ఈ రూట్‌లో కొన్ని రోడ్లపై సైకిల్‌రిక్షా తొక్కటం సాధ్యం కాదు, అలాంటి సందర్భాల్లో దాస్ రిక్షా దిగి తన బలమంతా ఉపయోగించి పైకి లాగాల్సి ఉంటుంది. తన అడ్వెంచర్ రైడ్ కోసం దాస్ సుమారు రూ.15,000లు ఖర్చు చేసి తన సైకిల్‌రిక్షాకు కొత్త టైర్లు, అదనపు బ్రేక్‌లు, తేలిక స్టీల్‌తో చేసిన కొత్త బాడీతో లాంగ్ ట్రిప్‌కు అనుకూలంగా కస్టమైజ్ చేయించుకున్నాడు.

మార్గమధ్యంలో రిక్షా ఎక్కడైనా బ్రేక్‌డౌన్ అయితే, దానిని రిపేరు చేసుకునేందుకు పరికరాలు కూడా అందులో ఉంచుకున్నాడు. తన ప్రయాణానికి అవసరమైన బట్టలు, తిండి తదితర వస్తువులను ప్యాసింజర్ సీటులో ఉంచుకున్నాడు. ప్రతిరోజు అతను 40-50 కి.మీ. దూరం ప్రయాణం చేసిన తర్వాత రాత్రివేళల్లో విశ్రాంతి కోసం గుడి లేదా గురుద్వార వంటి ప్రదేశాలను ఆశ్రయిస్తాడు.

Rickshaw

ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన ఈ రిక్షావాలా తన ఈ రోడ్ ట్రిప్ ద్వారా దేశంలో విభిన్న సంస్కృతుల గురించి తెలుసుకునేందుకు ఓ చక్కటి అవకాశం ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. ప్రతిరోజు ఉదయం తాను స్థానిక పోలీస్ స్టేషన్లకు వెళ్లటం, తన ప్రయాణానికి కావల్సిన అనుమతులను తీసుకోవటం చేస్తున్నాని, ఇప్పటి వరకైతే అనుమతులు సులువుగా లభించాయని చెప్పాడు.

తన ప్రయాణంలో తర్వాతి స్టాప్‌కు సంబంధించి తెలుసుకునేందుకు మ్యాప్స్ మరియు స్పెషల్ జర్నీని డాక్యుమెంట్ చేసుకునేందుకు ఓ డిజిటల్ కెమెరాని తన వెంట తీకుకొని వెళ్తున్నాడు. ఇంటి దగ్గర అతను వదలి వెళ్లిన భార్య, కుమార్తె బాగోగులను క్లబ్ మెంబర్లు చూసుకుంటున్నారు. ఈ ప్రయాణం కోసం సుమారు రూ.80,000 ఖర్చు అవుతుందని అంచనా.

ఈ మొత్తాన్ని స్థానిక క్లబ్ మెంబర్లు కలెక్ట్ చేసి ఓ బ్యాంక్ ఖాతాలో జమ చేసి, దాని ఏటిఎమ్ కార్డును దాస్‌కు ఇచ్చారు. ప్రయాణంలో దాస్‌కు అవసరమైనప్పుడల్లా డబ్బును ఆ ఏటిఎమ్ కార్డు సాయంతో విత్‌డ్రా చేసుకుని తన అవసరాలు తీర్చుకుంటాడు. కలకత్తాలో దాస్ రోజు రిక్షా తొక్కితే రూ.150-200లు వస్తుంది. ఈ మొత్తం లోనుంచే అతను తన ట్రిప్ కోసం కొంత దాచిపెట్టుకునే వాడు.

రిటర్న్ ట్రిప్‌లో దాస్ ఖర్దుంగ్ లా పాస్ నుంచి రోహ్‌తంగ్ పాస్ మరియు మనాలీ గుండా తిరిగి కలకత్తా చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మరి పట్టు వదలని ఈ భట్టి విక్రమార్కుడికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదామా..! ఆల్ ది బెస్ట్ దాస్.. హేవ్ ఏ హ్యాప్ అండ్ సేఫ్ జర్నీ.

Most Read Articles

English summary
The mighty Himalayas is full of surprises. However, Forty-year-old Satyen Das is all set to surprise the mighty Himalayas as he sets out on a 3,000-km expedition from Kolkata to the famous Khardung La pass in Ladakh in his rickshaw.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X