అమీర్ ఖాన్‌కు థ్రెట్; రూ.10 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు

By Ravi

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన 'సత్యమేవ జయతే' అనే టెలివిజన్ షో ద్వారా దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీని దక్కించుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, అమీర్ ఖాన్ పాపులారిటీని చూసి గిట్టని కొందరు ఆయనకు బెదిరింపులు చేస్తున్నారు.

ఇలా ఒకసారి కాదు రెండు సార్లు అనేక సార్లు అమీర్ ఖాన్‌కు బెదిరింపులు రావటంతో, ఆయన భద్రతకు ముప్పు వాటిళ్లకుండా ఉండేందుకు సుమారు రూ.10 కోట్ల రూపాయల విలువైన బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ కారును ఆయన కొనుగోలు చేశారట.

మరి అమీర్ ఖాన్‌కు బెదిరింపులు చేసింది ఎవరు? ఆయన ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు కొన్నారు అనే విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

అమీర్ ఖాన్ లైఫ్ రిస్కులో పడిందా?

‘సత్యమేవ జయతే' అనే టీవీ షో మొదటి సీజన్‌లో అమీర్ ఖాన్ అంటరానితనం, ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, నకిలీ మందుబిళ్లలు, వరకట్న దురాచారం, బాల కార్మిక వ్యవస్థ మొదలైన అనేక అంశాల గురించి నిర్భయంగా చర్చించి రియల్ హీరో అనిపించుకున్నారు.

అమీర్ ఖాన్ లైఫ్ రిస్కులో పడిందా?

సత్యమేవ జయతే మొదటి సీజన్ పూర్తి కాగానే ఆయనకు కొన్ని థ్రెట్స్ వచ్చాయి. కాగా, ఇటీవలే ప్రారంభమైన రెండవ సీజన్ నేపథ్యంలో, ఈసారి అమీర్ ఏయే అంశాలపై చర్చ జరుపుతారోనన్న ఆందోళన కొన్ని అసాంఘి శక్తుల మదిలో నెలకొని ఉంది.

అమీర్ ఖాన్ లైఫ్ రిస్కులో పడిందా?

కాగా.. మార్చి 2 నుంచీ ధారావాహికంగా ప్రసారం అవుతున్న ‘సత్యమేవ జయతే' రెండవ సీజన్‌లో అమీర్ ఖాన్ లోక్‌సభ ఎన్నికలు 2014, అవినీతి, ప్రభుత్వ విధి విధానాలు మొదలైన పలు అంశాలను ప్రస్తావించనున్నారట. అందుకే, థ్రెట్స్‌ను తిప్పికొట్టేందుకు అమీర్ ఖాన్ ముందు జాగ్రత్తగా ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అమీర్ ఖాన్ లైఫ్ రిస్కులో పడిందా?

అమీర్ ఖాన్ కొనుగోలు చేసిన ఈ బుల్లెట్/ఎక్స్‌ప్లోజివ్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-600 కారు ధర సుమారు రూ.10 కోట్లు. ప్రత్యేకించి వీవీఐపిల కోసం మాత్రం ఈ కారును తయారు చేస్తారు.

అమీర్ ఖాన్ లైఫ్ రిస్కులో పడిందా?

మనదేశంలో ఇలాంటి ‘స్పెషల్ ప్రొటెక్షన్' కారు ఇప్పటి వరకూ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరియు దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వద్ద మాత్రమే ఉంది.

Most Read Articles

English summary
A series of security threats has compelled Bollywood star Aamir Khan to apparently purchase an expensive 'special protection' Mercedes Benz S600 to tackle bullets and explosives.
Story first published: Monday, March 10, 2014, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X