టాటా నానో లాంగ్ ట్రిప్‌‌కి పనికిరాదా..? ఎవరన్నారు ఆ మాట!

By Ravi

లక్ష రూపాయల కారుగా 2009లో మార్కెట్లోకి ప్రవేశించి, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 'ప్రజల కారు' టాటా నానో పరిస్థితి ఇప్పుడు అంతగా బాగోలేదు. ఈ మోడల్‌ను మార్కెటింగ్ చేయటంలో టాటా మోటార్స్ అంత విజయవంతం కాలేకపోయింది. ఏదేమైనప్పటికీ, అతి తక్కువ ధరలో కారు కావాలనుకునే సామాన్య/మధ్యతరగతి ప్రజలకు మాత్రం టాటా నానో ఇప్పటికీ బెస్ట్ ఆప్షనే.

అయితే, ఈ చవక కారు సురక్షితం కాదని, ఇలాంటి కార్లలో ఎక్కువ దూరం ప్రయాణించలేమని, ప్రత్యేకించి హైవేలపై ఈ కారు ఎందుకు పనికిరాదని ఇలా అనేక పుకార్లు ఇప్పటికీ షికార్లు చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ కథనం చదివిన తర్వాత, ఈ పుకార్లు విని మనస్సు మార్చుకున్న వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. నానో కారులో ఏకంగా 2000 కిలోమీటర్లు చుట్టిన వ్యక్తి స్టోరీ ఇది.

వివరాల్లోకి వెళితే.. మా డ్రైవ్‌స్పార్క్ పాఠకులు శ్రీ. రవి కుమార్ కెఎస్ తన టాటా నానో కారులో దాదాపు 2000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దక్షిణ భారతదేశంలోని దాదాని అన్ని ప్రముఖ ప్రాంతాలను దర్శించి వచ్చారు. ఈ ప్రయాణంలో తాను నానో వలన ఎలాంటి ఇబ్బందలు ఎదుర్కోలేదని, కారులో తానొక్కడే కాకుండా తమ కుటుంబ సభ్యులు మొత్తం (ఆరుగురు) వెళ్లామని చెప్పారు.

రవి కుమార్ గారి నానో ప్రయాణ గాధను, ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

టాటా నానో కారులో లాం....గ్ ట్రిప్!

తర్వాతి స్లైడ్‌లలో రవి కుమార్ గారి టాటా నానో సౌత్ ఇండియా ట్రిప్ వివరాలను తెలుసుకోండి.

రోడ్ మ్యాప్

రోడ్ మ్యాప్

రవి కుమార్ ప్రయాణం కర్ణాటక రాజధాని బెంగుళూరు నుంచి ప్రారంభమై తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా తిరిగి కర్ణాటకకు చేరుకుంది. ఆయన ప్రయాణించిన రూట్ మ్యాప్‌ను ఈ స్లైడ్‌లో చూడొచ్చు. మొత్తం 8 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణంలో ఆయన 2000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని టాటా నానో కారుతో కవర్ చేశారు. సముద్ర తీర ప్రాంతాలు, ఆలయాల సందర్శన వీరి ట్రిప్‌లో ప్రధాన భాగమయ్యాయి.

ఆలయ సందర్శనలు

ఆలయ సందర్శనలు

రవి కుమార్ తన కుటుంబ సభ్యులతో సాగించిన ఈ ప్రయాణంలో ప్రతి గమ్యస్థానంలో అత్యంత ప్రముఖమైన దేవాలయాలను సందర్శించారు. మార్గ మధ్యంలో తన టాటా నానో కారు ఎక్కడా కూడా ట్రబుల్ ఇవ్వలేదని రవి చెప్పుకొచ్చారు. నిజానికి టాటా నానో ఓ చక్కటి ఫ్యామిలీ కారు అని, సురక్షితంగా నడిపే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

టాటా నానో 2011 మోడల్

టాటా నానో 2011 మోడల్

రవి కుమార్ తన రోడ్ ట్రిప్ కోసం ఉపయోగించిన టాటా నానో ఎల్ఎక్స్ వేరియంట్ కారును 2011లో కొనుగోలు చేశారు. అప్పట్లో ఇందులో పవర్ స్టీరింగ్ ఆప్షన్ కూడా లేదు. రవి తన రోడ్ ట్రిప్ ప్రారంభించడానికి ముందే ఈ నానో కారు ఓడోమీటర్ రీడింగ్ 27,143 కిలోమీటర్లుగా నమోదై ఉంది. ఈయన సగటును గంటకు 80-110 కి.మీ. వేగంతో డ్రైవ్ చేస్తూ, ఎయిర్ కండిషనింగ్ ఆన్‌లో ఉండి కూడా లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజీని తన నానో ద్వారా పొందినట్లు తెలిపారు.

టాటా నానో హైవే పెర్ఫార్మెన్స్

టాటా నానో హైవే పెర్ఫార్మెన్స్

టాటా నానో కారులోని 624సీసీ, ట్విన్-సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఫోర్-సిలిండర్ ఇంజన్, ఇతర కార్లతో పోల్చుకుంటే చిన్నదే అయినప్పటికీ, దీని హైవే పెర్ఫార్మెన్స్ మాత్రం మెరుగ్గా ఉన్నదని, తన ప్రయాణంలో ఇంజన్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని రవి తెలిపారు.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

వాస్తవానికి టాటా నానో కారు ఓ 5-సీటర్ కారు. ఇందులో డ్రైవర్‌తో కలిపి నలుగురు ప్రయాణీకులైతే సౌకర్యంగా కూర్చోవచ్చు. పరిమాణంలో నానో చిన్నదిగా కనిపించినప్పటికీ, దీని ఇంటీరియర్ స్పేస్ మాత్రం విశాలంగా ఉంటుంది. ఈ నానో కారులో రవితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు మరో ఐదుగురు కూడా ఉన్నారు. ఇందులో ఇద్దరు చిన్నారు, నలుగురు పెద్దవాళ్లు సౌకర్యంగా కూర్చొని ప్రయాణించినట్లు రవి చెప్పారు.

ఇదివరకటి లాంగ్ ట్రిప్స్

ఇదివరకటి లాంగ్ ట్రిప్స్

రవి తన నానో కారులో లాంగ్ ట్రిప్ చేయటం ఇదే ప్రథమం కాదు. గతంలో ఆయన కూడా ఇలాంటి కొన్ని లాంగ్ ట్రిప్స్ చేశారు. ఓ ట్రిప్‌లో ధర్మస్థళ, కుక్కే సుబ్రమణ్య, కొల్లూర్, సింగేరి, ఉడిపి, మురుదేశ్వర్ ప్రాంతాలను సందర్శించారు. అలాగే మరో ట్రిప్‌లో మహానంది, శ్రీశైలం, హైదరాబాద్ మీదుగా నానోలో ప్రయాణించారు. ఓసారి కర్ణాటక నుంచి పాండిచ్చేరికి కూడా ఈ నానో కారులోనే వెళ్లారు.

చివిరిమాట

చివిరిమాట

చాలా మంది టాటా నానో కారు కేవలం సిటీకి మాత్రమే సూట్ అవుతుందని, ఇందులో లాంగ్ ట్రిప్స్ చేయలేమని చెబుతుంటారు. అలాంటి వారికి రవి కుమార్ చేసిన లాంగ్ ట్రిప్ ఓ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. రవి కుమార్ తన తాజా ట్రిప్ ద్వారా టాటా నానో కారు శక్తి సామర్థ్యాలను మరోసారి రుజువు చేశారు. అతొనక సంతృప్తికర టాటా నానో కారు యజమాని.

Most Read Articles

English summary
One of our avid readers, Mr. Ravi Kumar KS, has taken his Tata Nano for a 1,960 kilometre trip around south India, with his family. Mr. Ravi travelled three states in his Nano, visiting temples and just absolutely adores the Nano.
Story first published: Saturday, January 10, 2015, 11:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X