లగ్జరీ బిల్డింగ్‌లలో ఇంటి లోపలకే కారును తెచ్చే స్కై గ్యారేజ్‌లు

By Ravi

స్వంత కారు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. అందులో కోట్ల రూపాయలు ఖరీదు చేసే విలాసవంతమైన కార్లంటే, ఆ ఇష్టం గురించి ఇక చెప్పనవసరం లేదు. మనం సాధారణంగా కార్లను పార్కింగ్ సౌకర్యం లేకపోతే ఇంటికి ఎదురుగానో పార్క్ చేస్తాం, అదే పార్కింగ్ సౌకర్యం ఉంటే ఇంటి కాంపౌండ్‌లోని గ్యారేజ్‌లో పార్క్ చేసుకుంటాం.

కానీ ఎవరైనా కారును నేరుగా ఇంటి లోపలే పార్క్ చేసుకుంటారా..? మనం ఉండటానికి చోటు దొరకని ఈ రోజుల్లో ఇంట్లో కారు పార్క్ చేసుకోవటం ఏంటి అంటారు కదా..! కానీ ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ల కథే వేరు. ఇప్పుడు మనం చూడబోయే బహుళ అంతస్థుల భవనంలో ఎవరి కార్లను వారు తమ ఇళ్లలోనే పార్క్ చేసుకోవచ్చు.

తమ నివాసం 20వ అంతస్థులో ఉన్నా సరే, కారును నేరుగా ఇంటిలోకి తీసుకొని వెళ్లిపోవచ్చు. కార్లను అపార్ట్‌మెంట్‌లోని నివాసాలకు చేర్చేందుకు ప్రత్యేకమైన లిఫ్ట్స్ ఉంటాయి. వీటిని స్కై గ్యారేజ్‌లు అంటారు. ఇందులో కారు ఓనర్ చేయాల్సిందిల్లా, స్కై గ్యారేజ్‌లో కారును సరిగ్గా పార్క్ చేసి బయటకు వచ్చేయటమే.

స్కై గ్యారేజ్ పార్కింగ్ ప్లేస్‌లోకారును ఉంచి, అపార్ట్‌మెంట్ ఫ్లోర్ నెంబర్‌ను ప్రెస్ చేసిన తర్వాత కారుతో పాటుగా స్కై గ్యారేజ్ నేరుగా ఆ అపార్ట్‌మెంట్ గదిలోకి వెళ్లి ఆగిపోతుంది. బాగుంది కదూ.. ఈ లగ్జరీ ఫెసిలిటీ. మరి ఆలస్యమెందుకు ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.

Post by DriveSpark.

Most Read Articles

Story first published: Tuesday, April 8, 2014, 19:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X