కారు నడుపుతూ సిగరెట్ త్రాగి, కారుని తలపైకి ఎక్కించుకున్నాడు!

ప్రాణం మీదకు తెచ్చిన కాచాలా మందికి కారు నడుపుతూ సిగరెట్ త్రాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత, అలాంటి వారు ఇక అలవాటును మార్చుకోక తప్పదు. సిగరెట్ త్రాగటం వలన లంగ్స్ పాడవుతాయి, క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలిసినదే. కానీ సిగరెట్ త్రాగటం వలన మనం నడిపే కారే మన తలపైకి ఎక్కుతుందనే విషయం ఎవరికైనా తెలుసా.. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని కొలరాడో ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, సిగరెట్ త్రాగుతూ కారు నడుపుతుండగా, ప్రమాదశవశాత్తుక సిగరెట్ చేజారి అతని జాకెట్‌లో పడిపోయిండి. ఆ సిగరెట్ ఎక్కడ అంటుకుంటుని, తనని కాల్చేస్తుందోనని అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కారు డోరు తీసుకొని బయటకు దూకేశాడు.

అయితే, ఆ సమయంలో కారు ఆన్‌లోనే ఉంది, పైపెచ్చు కారు ఎత్తు రోడ్డుపై వెళ్తోంది. సదరు వ్యక్తి కారు లోనుంచి క్రిందకు దూకేసి సిగరెట్‌ను తన జాకెట్ నుంచి వదిలించుకునే పనిలో ఉండగా, కారు దొర్లుకుంటూ వెనక్కి వచ్చి ముందు వైపు డ్రైవర్ సైడ్ టైరు అతని తల మీదగా వెళ్లిపోయింది.

Man Gets Run Over By His Own Car Because Of A Cigarette

కారు టైరు తలపైకి ఎక్కడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, అతను బ్రతికే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో కారును నడుపుతున్న వ్యక్తి బంధువు కారు ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో కూర్చొన్ని ఉన్నాడట, అతనికి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు.

చూశారా.. మద్యం సేవించి కారును నడపటమే కాదు, ధూమపానం చేస్తూ కారును నడపటం కూడా ఎంత డేంజరో. ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వస్తుందో చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తలో ఉండటం ఎంతో అవసరం. అందుకే, ఇకపై మీరు కూడా కారు నడుపున్నప్పుడు ధూమపానం చేయకండి, ప్రమాదాలను కొని తెచ్చుకోకండి.
రులో సిగరెట్!

Most Read Articles

English summary
Every smoker has heard this multiple times: Smoking causes cancer, smoking kills. People just chose to ignore it. Here's a classic example to say smoking is injurious to health! An unidentified man from Colorado, USA, suffered life threatening injuries to his head after he was run over by his own vehicle.
Story first published: Friday, October 31, 2014, 14:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X