మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) ప్రయోజనాలు

ఇప్పటి వరకు ఆటోమొబైల్ మార్కెట్లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా.. వీటికి అదనంగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) కొత్త టెక్నాలజీతో కూడిన కార్లు అందుబాటులోకి వచ్చాయి. మ్యాన్యువల్ కారులో గేర్లను డ్రైవర్ మార్చాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ కార్లలో గేర్లను కారులోని కంప్యూటర్ మార్చుతుంది.

కాగా.. కొత్తగా వచ్చిన ఈ ఏఎమ్‌టి టెక్నాలజీని రెండు రకాలుగాను వాడుకోవచ్చు. డ్రైవర్ కావాలనుకుంటే గేర్లను తనే స్వయంగా మార్చవచ్చు లేదా కంప్యూటర్ ఇష్టానికి వదిలేయవచ్చు. ఏదేమైనప్పటికీ, కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు ఏ రకమైన గేర్‌బాక్స్‌ను ఎంచుకోవాలో తెలియక తర్జన భర్జన పడుతుంటారు.

వాస్తవానికి, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లతో పోల్చుకుంటే మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు నడపటానికి కొంచెం కష్టంగా/అసౌకర్యంగా అనిపించినప్పటీ, వాటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈనాటి మన కార్ టాక్ శీర్షికలో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) వలన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ప్రయోజనాలు

తర్వాతి స్లైడ్‌లలో మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) వలన ప్రయోజనాలను తెలుసుకోండి.

ఎక్కువ మైలేజ్

ఎక్కువ మైలేజ్

రెగ్యులర్ ఫుల్లీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లతో పోల్చుకుంటే మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తాయి. ఆటోమేటిక్ కార్లు పవర్-శాపింగ్ హైడ్రాలిక్ పంప్‌ను కలిగి ఉండవు కాబట్టే ఇలా జరుగుతుంది. కారును నడిపే వేగాన్ని బట్టి డ్రైవర్ సరైన సమయంలో గేరు మార్చుకుంటాడు కాబట్టి మైలేజ్ పెరుగుతుంది. ఆటోమేటిక్ కార్ల విషయంలో ఇలా జరగదు, కారు వేగాన్ని కంప్యూటర్ అంచనా వేసి, అందుకు ఏ గేరు అయితే సరిపోతుందో చెక్ చేసుకుని, ఆ గేరుని అప్లయ్ చేస్తుంది. ఇందులో ఖచ్చితత్వం ఉండకపోవచ్చు.

తక్కువ ఖర్చు

తక్కువ ఖర్చు

సాంప్రదాయ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లతో పోల్చుకుంటే, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్ల ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, మ్యాన్యువల్ కార్లను కొనుగోలు చేయటం వలన నగదు ఆదా అవుతుంది. అంతేకాకుండా.. తక్కువ మైలేజీనిచ్చే ఆటోమేటిక్ కార్ల కన్నా ఎక్కువ మైలేజీనిచ్చే మ్యాన్యువల్ కార్లను కొనుగోలు చేయటం వలన ఇంధనంపై డబ్బు ఆదా అవుతుంది.

డ్రైవింగ్ ఫన్

డ్రైవింగ్ ఫన్

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన కార్లను డ్రైవ్ చేయటంలో ఎంతో ఫన్ ఉంటుందని డ్రైవర్లు చెబుతుంటారు. అదే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లలో ఆ ఫన్ ఉండదని, సదరు కార్లను నడిపేవారు చెబుతుంటారు. ఉదాహరణకు, మ్యాన్యువల్ కారును హైవేపై నడుపుతున్నప్పుడు ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయటం కోసం గేర్ డౌన్ చేసుకొని, ఎక్కువ పవర్‌తో ఓవర్‌టేక్ చేయవచ్చు. కానీ ఆటోమేటిక్ కార్ల విషయంలో అలా జరగదు, ఒకవేళ ప్యాడల్ షిఫ్టర్ల ద్వారా ఇలా చేసినప్పటికీ మ్యాన్యువల్ కారులోని ఫన్ మాత్రం రాదు.

తక్కువ మెయింటినెన్స్

తక్కువ మెయింటినెన్స్

రెగ్యులర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లతో పోల్చుకుంటే, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు తక్కువ మెయింటినెన్స్‌ను కలిగి ఉంటాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో చాలా సున్నితమైన భాగాలు ఉంటాయి. అవి దెబ్బతింటే, వాటికయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అదే మ్యాన్యువల్ గేర్‌బాక్స్ విషయానికి వస్తే, వాటి మరమ్మత్తుకయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది.

సేఫ్టీ

సేఫ్టీ

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కార్లను అత్యవసరంగా వేగాన్ని తగ్గించాల్సి వచ్చినప్పుడు 'ఇంజన్ బ్రేకింగ్' బ్రేకింగ్ చేయవచ్చు. ఇంజన్ బ్రేకింగ్ అంటే, కారు వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్స్‌ని నొక్కడంతో పాటుగా మ్యాన్యువల్ గేర్లను తగ్గించడం. ఆటోమేటిక్ కార్లలో ఇది సాధ్యం కాదు. ప్రత్యేకించి ఏటవాలు రోడ్లపై క్రిందకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ కార్లు అధిక వేగం కారణంగా టాప్ గేర్లో ప్రయాణిస్తుంటాయి. అదే మ్యాన్యువల్ కారు అయితే, మనకు నచ్చిన గేరులో క్రిందకు రావటం సాధ్యమవుతుంది.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కన్నా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఎక్కువ వేగంతో పరుగులు తీస్తూ, మంచి పెర్ఫార్మెన్స్‌ను కనబరుస్తాయి. మ్యాన్యువల్ కార్ల యాక్సిలరేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. ఆటోమేటిక్ కార్లలో ఇందుకు భిన్నంగా ఉంటుంది.

దుష్ప్రయోజనాలు

దుష్ప్రయోజనాలు

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కార్లలో ప్రయోజనాలతో పాటుగా కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొత్తగా కారు నేర్చుకునే వారు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఇబ్బంది పడుతారు. సరైన షిఫ్టింగ్ విధానం నేర్చుకునే వరకు వారికి ఇవి ఇబ్బందిగానే అనిపిస్తాయి. నిత్యం రద్దీగా ఉండే సిటీ రోడ్లపై తరచూ గేర్లు మార్చే మ్యాన్యువల్ కార్ల ఆటేమేటిక్ కార్లే నయం. ఎక్కువ కాలం మ్యాన్యువల్ కారును నడపటం, క్లచ్‌ను బలంగా నొక్కడం వలన మోకాలి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది.

Most Read Articles

English summary
Manual transmissions are an endangered species, as people are switching to automatics because of the convenience offered in our manic traffic conditions. But there is an large oldschool community that will always staunchly support manual cars, even in the present day market with an increasing number of gearbox options available. Ever wondered why the following still exists?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X