బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ అవెంటేడర్.. అందరూ సేఫ్..

By Ravi

చైనాలో భారీ యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ లాంబోర్గినీ కారు బస్సును ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం, చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లోని హెఫీ నగరంలో ఓ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారు కంట్రోల్ తప్పి సిటీ బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు.

కానీ, బస్సులోని ప్రయాణీకులకు మాత్రం చిన్నపాటి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇంత భారీ యాక్సిడెంట్ జరిగినప్పటికీ, ఆ కారులో డ్రైవర్ శరీరంపై మాత్రం చిన్న గీత కూడా పడలేదట. అయితే, ఈ యాక్సిడెంట్‌లో లాంబోర్గినీ కారు కుడివైపు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయిపోయింది. మరమ్మత్తుకు సైతం వీలులేని విధంగా ఈ కారు పాడైపోయింది.

బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ

ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసు పరిశీలిస్తున్నారు. ప్రాధమిక నివేదిక ప్రకారం, లాంబోర్గినీ అవెంటేడర్‌కు ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ

ఈ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారు ధర 7.38 మిలియన్ యువాన్‌లు (1.2 మిలియన్ డాలర్లు).

బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ

విచారణలో ఒకవేళ ఈ ప్రమాదం డ్రైవర్ తప్పిదం వలన జరిగిందని తేలితే, బీమా కంపెనీ సదరు బీమా మొత్తాన్ని చెల్లించదు.

బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ

యాక్సిడెంట్ సమయంలో ఈ కారుకు లైసెన్స్ ప్లేట్ కూడా లేదు. ఇలా లైసెన్స్ ప్లేట్ లేకుండా కారు నడపటం నేరం, అంతేకాదు బీమా కంపెనీ బీమా చెల్లించకపోవటానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు.

బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారు.

బస్సును ఢీకొట్టిన లాంబోర్గినీ

ప్రమాదంలో నుజ్జు నుజ్జయిన లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్‌కారు. విచ్చుకున్న ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్.

Most Read Articles

English summary
According to preliminary reports, the driver of the Arancio Argos-painted Aventador was trying to overtake a car but pulled too far on the other side of the road and frontally collided with an incoming bus. 
Story first published: Tuesday, February 4, 2014, 11:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X