భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఈవిడ ఏం చేస్తుందో తెలుసా ?

Written By:

ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు వరకు ఏ/సీ గదుల్లో టన్నుల కొద్ది ఒత్తిడితో పని చేస్తూ నెలకు వేలల్లో, లక్షల్లో సంపాదిస్తుంటారు. వీరిలో మహిళలు కూాడా ఉంటారు. ఈ కథనంలో మేము పరిచయం చేస్తున్న మహిళ మెరీనా పిరో కూడా ఈ కోవకు చెందినదే. కాని భారీ ఒత్తిడితో అయిష్టంగా ఏ/సి గదుల్లో ఉద్యోగం చేసే వాళ్లకు కొదవేలేదని చెప్పవచ్చు. ఇలాంటి అనుభవాన్ని పొందిన మెరీనా సాటి మహిళకు సాధ్యం కాని మార్గాన్ని ఎంచుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తూ, సంపాదిస్తోంది. ఎలాగో తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.....

ఇటలీకి చెందిన మెరీనా పిరో వృత్తిరిత్యా ఇంగ్లాండులో సెటిల్ అయ్యింది, నెల దాటితే మంచి జీతం, ఏ/సి గదుల్లో శరీరానికి బరువు లేకుండా సాగిపోయే ఉద్యోగం. కాని ఎంతో మంది ఉద్యోగులు అనుభవిస్తున్న అదే టార్చర్ (పని ఒత్తిడి) ఈమెను కూడా చుట్టు ముట్టింది.

కంప్యూటర్ ద్వారా పనిచేసే అవకాశం ఉన్నప్పుడు ఆఫీసులో ఉంటే ఏం, అడవిలో ఉంటే ఏం. మరీ ఒత్తిడితో పూర్తిగా ఇతరుల ఆధీనంలో పనిచేయాల్సిన అవసరం ఏంటని తనను తాను ప్రశ్నించుకుని చేస్తున్న పనికి అనుకున్నదే తడవుగా గుడ్ బై చెప్పేసింది.

తను ఎలాంటి వాతావరణంలో పనిచేయాలనుకుందే, దానిని సృష్టించుకుంది. అందుకోసం రెనోకు చెందిన పాత వ్యాను తన ప్రయాణానికి ఉపయోగపడేలా తనే స్వయంగా మోడిఫై చేసుకుంది.

ఇంతకీ ఈ వెహికల్ ఎందుకో తెలుసా ? తను ఎంతగానే ప్రేమించే పెంపుడు శునకం ఒడియో తో వివిధ ప్రదేశాలను సందర్శించడం. ఇలా సందర్శించి తనకు తానుగా సృష్టించిన పామ్‌దవ్యాన్ (Pamthevan) అనే బ్లాగర్ మీద తను సందర్శించిన ప్రదేశాల గురించి, తన ప్రయాణ అనుభవాల గురించి కథనాలను వ్రాయడం ప్రారంభించింది.

అయితే ఒక మహిళ ఒంటరిగా ఇలా ప్రయాణించడం కాస్త ఇబ్బందికరమైనదే. అయితే తన జర్నీకి కావాల్సిన అన్ని అవసరాలకు అనుగుణంగా ఈ వ్యాన్‌ను మార్చేసింది.

చిన్న ఇంటిని పోలి ఉండే విధంగా ఇంటీరియర్ మోడిఫికేషన్స్ అన్నింటి తానే స్వయంగా దగ్గరుండి డిజైన్ చేసుకుంది. మహిళలు ఇలాంటి వాటికి చాలా మంది దూరంగా ఉంటారు. అయితే మనమెందుకు ఇలాంటి మోడిఫికేషన్స్ చేయకూడదంటూ తన వెబ్‌సైట్లో మొదటి కథనాన్ని ప్రచురించింది.

ఇలా ఎలాంటి ఒత్తిడి లేకుండా తను కోరుకున్న జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, వివిధ నగరాలను సందర్శిస్తూ, తన అనుభవాల్ని ఓ ఆన్‌లైన్ పత్రికను వేదికగా చేసుకుని తనను తాను నిరూపించుకుంటోంది.

తన జర్నీలో భాగమై, కీలక పాత్ర పోషిస్తున్న రెనో వ్యాన్ గురించి ఈమె మాట్లాడుతూ, మెకానికల్, వుడ్ వర్క్ మరియు ఎలక్ట్రికల్ వర్క్ గురించి నాకు ఎలాంటి ఐడియా లేదు, అయితే ఇతరుల సహాయం తీసుకోకుండా స్వయంగా నేర్చుకుని ఈ వాహనాన్ని ఇలా మలుచుకున్నాని తెలిపింది.

ఇలాంటి ఇంటీరియర్ మోడిఫికేషన్ పనుల వెనుక కూడా పురుషుడే ఉన్నాడు, మహిళలు ఇలాంటివి చేయడం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. అందుకే నా మొదటి అనుభవాన్ని మహిళల కోసం పంచుకున్నాని తెలిపింది.

చివరిగా మెరీనా మాట్లాడుతూ, " ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చినపుడు, ఇంట్లో కూర్చునే పని చేసే అవకాశం వచ్చినపుడు దీనిని అవకాశంగా ఎందుకు తీసుకోకూడదు" అందుకే నాకు ఇష్టమైన ఓడియో(పెంపుడు కుక్క)తో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తూ సంపాదిస్తున్నాని తెలిపింది.

ఇలాంటి సాహసాలు చేయడానికి చాలా మంది వెనకడుగేస్తారు. అయితే మెరీనా పిరో సాహసం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి.... ఎలాంటి అనుభవం లేకుండా మెరీనా ఓ వాహనాన్ని మోడిఫై చేయడం నిజంగా అద్బుతం అని ఇక్కడ గుర్తుచేసుకోవాలి...

ఏడు నుండి ఎనిమిది మంది కూర్చునే సామర్థ్యంతో, కుటుంబ సమేతంగా లాంగ్ డ్రైవ్ మరియు టూర్ల కోసం చక్కగా ఉపయోగపడే రెనో లాజీ ఎమ్‌పీవీ ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, February 27, 2017, 18:33 [IST]
English summary
A Girl, Her Dog And A Homely Van Called Pam Are The Perfect Road Trip Trio
Please Wait while comments are loading...

Latest Photos