భారీ ప్రమాదానికి గురయ్యి తన బలాన్ని నిరూపించుకున్న మారుతి బాలెనో ఆర్ఎస్

Written By:

మారుతి సుజుకి గత నెలలో ఇండియన్ మార్కెట్లోకి తమ రెగ్యులర్ బాలెనోకు కొనసాగింపుగా బాలెనో ఆర్ఎస్ మోడల్‌ను శక్తివంతమైన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లోకి విడుదల చేసింది. అయితే మొదటి బాలెనో ఆర్ఎస్ కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదానంతరం కారు పరిస్థితి మరియు ఎంతవరకు సురక్షితమైనదో చూద్దాం రండి....

విడుదల అనంతరం బాలెనో ఆర్ఎస్ విక్రయాలు బాగానే ఉన్నాయి. అందులో రోడ్డెక్కిన ఓ కారు భారీ ప్రమాదానికి గురైంది. పల్టీలు కొట్టి బోల్తాపడినప్పటికీ ఓ మోస్తారు డ్యామేజ్‌తో బయటపడింది.

ఈ ప్రమాదం కేరళలో చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్నపుడు ఉన్నట్లుండి కుక్క అడ్డం రావడంతో దానిని తప్పించేందుకు షడన్‌గా బ్రేకులు అప్లై చేయడం, ఆ తరువాత యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టిమ్ (ABS) ఆక్టివేట్ అయ్యింది.

ఏబిఎస్ యాక్టివేట్ అయినపుడు ఎలాంటి వేగం వద్ద అయినా బ్రేకులు అప్లై చేసినపుడు కారు అదుపు తప్పి ప్రమాదానికి గురికాకుండా కారు పాస్ అవుతుంది. అయితే ఇది తెలియని డ్రైవర్ స్టీరింగ్‌తో కారును ప్రక్కకు నడిపాడు. అంతే భారీ వేగంతో డివైడర్లను ఢీ కొట్టి పల్టీలు కొట్టుకుట్టూ వెళ్లి బోల్తాపడి రోడ్డు ప్రక్కన ఆగిపోయింది.

ప్రమాదానంతరం కారు డ్రైవర్ ఘటనా స్థలి నుండి పరారయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన కారులో ఇతర ప్రయాణికులు ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు.

కారుకు జరిగిన ప్రమాదం

ముందు మరియు వెనుక వైపు ఉన్న బంపర్లు, హెడ్ లైట్లు మరియు టెయిల్ లైట్లు అదే విధంగా ముందు వైపున ఉన్న వీల్ యాక్సిల్ డ్యామేజ్ అయ్యాయి. అయితే ప్రయాణికులు ఉండే క్యాబిన్‌ మీద ప్రమాదం ప్రభావం పడలేదు.

ఎంత వరకు సురక్షితం

కారుకు ముందు మరియు వెనుక వైపున భాగాలు ప్రమాదంలో డ్యామేజ్‌కు గురైనప్పటికీ క్యాబిన్‌కు ఏమీ జరగకూడదు. ప్రయాణికులందూ క్యాబిన్‌లో ఉంటారు కాబట్టి అత్యుత్తమ నిర్మాణపరమైన నాణ్యత తప్పనిసరి. బాలెనో ఆర్ఎస్ స్ట్రక్చరల్ నిర్మాణంలో దీనిని గుర్తించవచ్చు.

సాధారణ బాలెనో కన్నా బాలెనో ఆర్ఎస్ 60 కిలోలు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది. కారు బాడీ కోసం అధిక స్టీల్ వినియోగించడం జరిగింది. ప్రమాదానంతరం కారు క్యాబిన్ యొక్క ధృడత్వాన్ని ఇక్కడం మనం గుర్చించవచ్చు.

ప్రస్తుతం ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను మారుతి సుజుకి కలిగి ఉంది. కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో మారుతి తమ ఉత్పత్తులకు మరింత భద్రతను జోడిస్తోంది.

సాంకేతికంగా మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 101బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది. అత్యంత శక్తివంతమైన బాలెనో ఆర్ఎస్ లో బ్రేకింగ్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తూ నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది.

సాధారణ బాలెనో వేరియంట్లకు టాప్ ఎండ్ వేరియంట్‌గా అందుబాటులో ఉన్న బాలెనో ఆర్ఎస్ ధరలు

  • హైదరాబాద్ లో ధర రూ. 10,32,899 లు
  • విజయవాడలో ధర రూ. 10,33,570 లు
  • విశాఖపట్నంలో ధర రూ. 10,40,459 లు
అన్ని ధరలు ఆన్ రోడ్‌గా ఇవ్వబడ్డాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, April 11, 2017, 12:42 [IST]
English summary
Read in Telugu Maruti to know about Baleno RS First Crash Reported
Please Wait while comments are loading...

Latest Photos