నేటి వీడియో: 'మంచు' రాజుకి కోపం వచ్చింది

By Ravi

వర్షపాతం మాదిరిగానే హిమపాతం కూడా ఒక్కోసారి భీభత్సం సృష్టిస్తుంటుంది. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో శీతాకాలానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. చెట్లపై, ఇళ్లపై, వాహనాలపై కుప్పలుగా పేరుకుపోయే హిమం చూసే వారికి కన్నుల విందుగా అనిపిస్తుంది.

అయితే, ఇదే సమయంలో వాహన చోదకులకు మాత్రం ఈ హిమం చుక్కలు చూపిస్తుంది. నిత్యం తడిగా ఉండే రోడ్లు, కొన్ని చోట్ల రోడ్లపై గడ్డకట్టుపోయే మంచు, ఫలితంగా రోడ్లపై జర్రుమని జారిపోయే వాహనాలు.. ఇలా వారి ఇక్కట్లు ఆ భగవంతుడికే తెలియాలి.

సరే ఇదంతా అటుంచితే, ఒక్కోసారి హిమం ఆకాశం నుంచి పెద్ద పెద్ద పెళ్లలుగా భూమిపైకి పడుతుంటుంది. ఇదిగో ఈ వీడియోలో చూడండి. ఎవరో హిమ పర్వతాన్ని విరగ్గొట్టి నేలపైకి తోసినట్లుగా పడుతున్న హిమాన్ని చూడండి.

హిమం పడితే పడింది కానీ, ఇది ఖాలీ స్థలంలో పడకుండా నిలిపి ఉన్న వాహనాలపై పడి భారీ ఆస్తినష్టం కలిగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ కార్లలో ఎవ్వరూ లేరు. అలాగే అటు పక్కగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఈ హిమపాతాన్ని ముందుగానే గుర్తించి, అప్రమత్తమై పరుగులు తీశారు. లేదంటే, ఏం జరిగి ఉండేదో..!

వీడియో కోసం క్రింద కనిపించే ఫొటోపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
It's like Old Man Winter decided he wanted to play the drums. Luckily no one was in those cars.
Story first published: Monday, January 27, 2014, 17:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X