పాత మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్!

By Ravi

రోల్స్ రాయిస్ వంటి కోట్ల రూపాయలు ఖరీదు చేసే లగ్జరీ కారును కొనుగోలు చేయటం సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. అందులోను రోజూవారీ సంపాదనపై ఆధారపడిన ఓ కార్ మెకానిక్‌కి రోల్స్ కారును కొనడం అంటే కలలో కూడా సాధ్యం కాదేమో. అందుకే కాబోలు ఈ ఫొటోలో కనిపిస్తున్న మెకానిక్ తన రోల్స్ రాయిస్ కారును తానే తయారు చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఫన్నీ కార్ మోడిఫికేషన్స్

కజక్‌స్థాన్‌కు చెందిన రస్లాన్ ముకనోవ్ అనే కార్ మెకానిక్ ఓ పాత మెర్సిడెస్ 190 ఈ మోడల్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చుకున్నాడు. ఇందుకోసం అతను కోట్ల రూపాయలేమీ ఖర్చు చేయలేదు. ఈ మోడిఫికేషన్ కోసం అతను ఖర్చు పెట్టిందల్లా కేవలం రూ.1,81,320లు మాత్రమే. మనదేశంలో ఈ మొత్తంతో ఓ చిన్న కారు (నానో తప్ప) కూడా కొనుక్కోలేం కదా..!

సరే అదటుంచి, రస్లాన్ తయారు చేసిన ఈ రోల్స్ రాయిస్ అలియాస్ మెర్సిడెస్ కారుకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం రండి.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

మెర్సిడెస్ కారును ఉపయోగించి తాను తయారు చేసిన రోల్స్ రాయిస్ కారును ప్రదర్శిస్తున్న మెకానిక్ రల్సాన్ ముకనోవ్. తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని ఫొటోలను, వివరాలను తెలుసుకోండి.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

దూరం నుంచి చూస్తే ఒరిజినల్ రోల్స్ రాయిస్ కారుకి ఈ మోడిఫైడ్ రోల్స్ రాయిస్ కారుకి పెద్దగా వ్యత్యాసాలు కనిపించవచ్చు. కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం కొన్ని డీటైలింగ్స్‌లో తేడాలు కనిపిస్తాయి. ఏదేమైనప్పటికీ, మెకానిక్ రస్లాన్ మాత్రం రోల్స్ రాయిస్‌ను కాపీ కొట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

కజక్‌స్థాన్‌లో తయారు చేసిన ఈ రోల్స్ రాయిస్ కారులో ఒరిజినల్ రోల్స్ రాయిస్ కారులో ఉన్నట్లుగా భారీ ఇంజన్ ఉండదు. మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ కారులో ఉన్న ఇంజన్‌నే ఇందులో యధావిధిగా ఉపయోగించారు.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

మెకానిక్ రస్లాన్‌కు తన కారు ఒరిజినల్ రోల్స్ రాయిస్ కాదని తెలిసినప్పటికీ, దానిని మాత్రం అతను ఒరిజినల్ దాని మాదిరిగానే చూసుకుంటాడు. అందులోను ఈ కారును అతను స్వతహాగా కస్టమైజ్ చేసినది కావటంతో ఈ కారంటే అతనికి మక్కువ ఎక్కువ.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

పాత మెర్సిడెస్ బెంజ్ కారును గుర్తుపట్టడానికి వీలు లేనంతగా, కొత్త రోల్స్ రాయిస్ కారుతో పొంతన ఉండేలా దీని ఇంటీరియర్స్‌ను మెకానిక్ కస్టమైజ్ చేశాడు. ఇంటి తలుపుల మాదిరిగా తెరచుకునే డోర్లు, విశాలమైన క్యాబిన్ స్పేస్, లగ్జరీ సీట్స్‌ను ఇందులో చూడొచ్చు.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

ఇందులో ఉపయోగించిన స్టీరింగ్ వీల్ చెక్కతో తయారు చేయబడినది, కారుకు ప్రీమియం అప్పీల్‌నిచ్చేలా ఎఫ్‌కె స్పోర్ట్స్ బ్రాండ్ స్టీరింగ్ వీల్‍‌ను ఇందులో అమర్చారు. డ్యాష్ బోర్డుపై కూడా ఉడెన్ ఫినిషింగ్‌ను ఇందులో చూడొచ్చు.

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

క్రోమ్ అల్లాయ్ వీల్స్, లో ప్రొఫైల్ టైర్లతో రస్లాన్ ఈ కారును కస్టమైజ్ చేశాడు. అయితే, ఒరిజినల్ రోల్స్ రాయిస్ కార్లలో మాత్రం ఇలాంటి చక్రాలు చూద్దామన్నా కనిపించవు (నిజానికి ఒరిజినల్ రోల్స్ రాయిస్ చక్రాలు ఎంతో అందంగా ఉంటాయి).

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

ఈ కారుకు ముందు వైపు రోల్స్ రాయిస్ బ్రాండింగ్ ఉంటుంది, అయితే బ్రాండ్ లోగో స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీకి బదులుగా సోవియెట్-ఎరా ఈగల్ స్కల్ప్చర్‌ను ఇక్కడ ఉపయోగించారు. (బహుశా ఈ బ్రాండ్ లోగో ఖరీదై ఎక్కువ కారణంగా అతను ఈ లోగో ఉపయోగించాడేమో).

మెర్సిడెస్ కారును రోల్స్ రాయిస్‌గా మార్చిన మెకానిక్

రోల్స్ రాయిస్‌గా మారిన ఈ మెర్సిడెస్ బెంజ్ కారును రస్లాన్ స్నేహితులు, బంధువులు తమ ఫంక్షన్ల కోసం కావాలని అతడిని కోరుతూ ఉంటారు. ఈ కారును తయారు చేయడంతో రస్లాన్ అక్కడ ఓ లోకల్ సెలబ్రిటీగా మారిపోయాడు.


Photo Credit: Voxpopuli

Most Read Articles

English summary
Owning a Rolls Royce for most is a distant possibility. Sometimes getting to see one in flesh is even tougher. British icon is an exclusive car for an exclusive audience.We have found a Kazakhstan mechanic, Ruslan Mukanov, who has tuned a Mercedes 190 E into a Rolls Royce.
Story first published: Monday, July 21, 2014, 10:04 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X