YouTube

ప్రేమ కోసం 26 ఏళ్లు అడ్వెంచరస్ వరల్డ్ టూర్ చేసిన తాత

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న తాత అత్యంత అరుదైన, అద్భుతమైన అడ్వెంచర్ చేశాడు. ఈయన పేరు గంథర్ హోల్టోర్ఫ్ (Gunther Holtorf). జర్మనీకి చెందిన ఈయన 1989లో ఆఫ్రికాను సందర్శిద్దామని తన నాల్గవ భార్యతో కలిసి తన మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ 4x4 ఆఫ్-రోడర్ వాహనంలో పయనమయ్యాడు. ఆ తర్వాత 26 ఏళ్లకు ఇప్పుడు ఆయన తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నాడు.

ఈ 26 ఏళ్ల సమయంలో గంథర్ హోల్టోర్ఫ్ 215 దేశాలను సందర్శించి, 9,00,000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేశాడు. ఈ తాతగారి ట్రిప్ వెనుక ఓ విషాదకరమైన లవ్ స్టోరీ ఉంది. అ లవ్ స్టోరీ ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

తర్వాతి స్లైడ్‌లలో ఈ తాత గారి స్టోరీ తెలుసుకోండి.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

హోల్టోర్ఫ్ 1989లో తన మూడవ భార్య నుంచి విడాకుల తీసుకున్న తర్వాత డైట్ జీట్ అనే వార్తాపత్రికలో జీవితభాగస్వామి కావాలని ప్రకటన ఇచ్చాడు. అలా క్రీస్టీన్ అనే ఆవిడను కలుసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా క్రీస్టీన్, హోల్టోర్ఫ్‌కు నాల్గన భార్య అయ్యింది.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

వివాహానంతరం వీరిద్దరూ వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. తమ ముద్దుల మెర్సిడెస్ బెంజ్ వ్యాన్‌లో ప్రయాణం ప్రారంభించారు. అలా 22 ఏళ్ల పాటు వీరి ప్రయాణం నిర్విరామంగా సాగిపోయింది.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

మార్గమధ్యంలో అప్పుడప్పుడూ క్రిస్టీన్ కుమారుడు మార్టిన్ కూడా వీరి వరల్డ్ టూర్‌లో భాగం పంచుకునే వాడు.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

అయితే, దురదృష్టవశాత్తు క్రిస్టీన్ 2010లో క్యాన్సర్ మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమె చనిపోవటానికి ముందే, తన జ్ఞాపకార్థం వరల్డ్ టూర్ పూర్తి చేస్తానని హోల్టోర్ఫ్ క్రిస్టీన్‌కు ప్రామిస్ చేశాడు.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

ఈ జంట మొదటి ఐదేళ్లు ఆప్రికాలోనే టూరింగ్ చేస్తూ గడిపారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాకు పయనమయ్యారు. అక్కడి ఉత్తర అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా మరియు యూరప్ ఖండాలలోని పలు దేశాలలో సంచరించారు. ఇదంతా కూడా తమ మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ ఎస్‌యూవీలోనే జరిగింది.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

కొన్ని దేశాల్లో అయితే, స్వంత కారుతో తమ దేశంలోకి వచ్చిన మొట్టమొదటి ఫారినర్స్‌గా కూడా వీరిద్దరూ రికార్డు సృష్టించిన దాఖలాలున్నాయి.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

హోల్టోర్ఫ్ లుఫ్తాన్సా మరియు సౌత్ జర్మన్ ఎయిర్‌లైన్, హపాగ్ లాయడ్ ఫ్లగ్ సంస్థలలో మేనేజర్‌గా పనిచేస్తూ దాచుకున్న డబ్బుతో 1989లో తన ట్రిప్‌ను ప్రారంభించాడు.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

ఆ తర్వాత ట్రిప్‌కు కావల్సిన డబ్బును క్రిస్టీన్, హోల్టోర్‌లు తమ కార్టోగ్రఫీ విద్య (మ్యాప్స్‌ను తయారు చేయటం)తో సమకూర్చుకున్నారు. వీరిద్దరూ 1977-2005 మధ్య కాలంలో ఇండోనేషియన్ రాజధాని జకార్తాలోని అనేక కొత్త ప్రాంతాలను తమ కారులో చేరుకొని జకార్తాకు సంబంధించిన పరిపూర్ణ మ్యాప్‌ను తయారు చేశారు.

ప్రేమ కోసం తాత చేసిన 'అడ్వెంచర్'

హోల్టోర్ఫ్ ఉపయోగించే 1988 స్కై బ్లూ కలర్ మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ ఎస్‌యూవీని ఆయన ముద్దుగా 'ఓటో' అని పిలుచుకనే వాడు. ఈ వాహనం చాలా అరుదుగా బ్రేక్‌డౌన్‌కు గురయ్యేది. ఎస్‌యూవీ పైభాగంలో ఉండే బాక్సులో హోల్టోర్ఫ్ ఈ కారుకు సంబంధించిన విడిభాగాలను క్యారీ చేసుకెళ్లేవాడు. ఏదైనా మరమత్తు గురయితే, తానే స్వయంగా రిపేర్ చేసుకునేవాడు. ఈ ఇంజన్ ఇప్పటికే 9 లక్షల కిలోమీటర్లకు పైగా రన్ అయ్యింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది ఇప్పటికీ రన్నింగ్ కండిషన్‌లో ఉంది.

Most Read Articles

English summary
Some of us are known to use cars for 200,000 kilometres. But almost 900,000 kays? And that too on one spectacular road trip? Nope, that sure don't happen too often. It is, however, what a certain German national named Gunther Holtorf managed to accomplish in a round-the-world trip that spanned 215 countries.
Story first published: Tuesday, October 14, 2014, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X