మైఖేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం లేదు: వైద్యులు

By Ravi

వరుసగా ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షుమాకర్‌ గడచిన సవంత్సరం డిసెంబర్ నెలలో జరిగిన స్కీయింగ్ యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసినదే. మైఖేల్ షుమాకర్‌ను కోమా నుంచి బయటుకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అయినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితులో ఎలాంటి మార్పు కనబడటం లేదని వైద్యులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా షుమాఖర్ కోమాలోనే ఉన్నారు. అయితే, మైఖేల్ షుమాకర్‌కు తగిలిన గాయాలు మానిపోయాయని సమాచారం. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం మైఖేల్ ఆరోగ్యం గురించి అభిమానుల్లో వదంతులు పుట్టరాదనే ఉద్దేశ్యంతో నిజానిజాలను దాస్తున్నారనే పుకార్లు కూడా ఉన్నాయి.


ఈ నేపథ్యంలో, మైఖేల్ అభిమానులు ఎవరి మాట నమ్మాలో, ఎవరి మాట నమ్మకూడదోనన్న అయోమయంలో ఉన్నారు. జర్మనీకి చెందిన ఫార్ములా వన్ డ్రైవర్ మైఖేల్ షుమార్ (44 ఏళ్లు) గడచిన డిసెంబర్‌లో పొడిమంచుపై స్కీయింగ్ చేస్తూ, బ్యాలెన్స్ తప్పి పోడిపోవటంతో అతని బండరాయికి తగిలి, తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్లిపోయారు.

మైఖేల్ షుమాకర్‌ తన కెరీర్‌లో మొత్తం 30,5 ఫార్ములా వన్ రేసుల్లో పాల్గొన్నాడు. అందులో 91 విజయాలు, 7 ఛాంపియన్‌షిప్ టైటిళ్లను షుమీ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నతనం నుంచే ఫార్ములా వన్ రేస్ పట్ల ఆసక్తి ఉన్న మైఖేలు షుమాకర్, ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పై ఇప్పటి వరకూ 80,000 కిలోమీటర్లకు పైగా టైర్లు అరిగేలా చకర్లు కొట్టాడు.

Michael Schumacher 2006

వివిధ రేస్ ట్రాక్‌ల మైఖేల్ షుమాకర్‌ ప్రయాణించిన మొత్తం దూరం 80,000 కిలోమీటర్లు (49,710 మైళ్లు)ను దాటింది. ఫార్ములా వన్ కార్లలో మైఖేల్ షుమాకర్‌ ఇప్పటి వరకూ చుట్టిన దూరంతో, రెండు సార్లు భూమిని చుట్టి రావచ్చట. 19 ఎఫ్ సీజన్స్ పూర్తి చేసిన తర్వాత అతను మొలురాయిని అధిగమించగలిగాడు. ఏదైతేనేం.. షుమాకర్ త్వరగా కోలుకోవాలని మనం ఆ దేవుడిని ప్రార్థిద్దాం.
Most Read Articles

English summary
Formula One Legend and Germany's iconic motorsport figure Michael Schumacher has been in an induced coma since December. The German suffered head injuries during a skiing accident, while he was with his family.
Story first published: Thursday, June 12, 2014, 14:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X