ఎగిరే మూడో కన్ను మిమ్మల్ని వీక్షిస్తోంది.. జాగ్రత్త..!!

By Ravi

ఇప్పటి వరకూ మానవ రహిత డ్రోన్ విమానాలతో టెర్రరిస్టుల భరతం పట్టడాన్ని మనం చూశాం. ఇకపై, నేరాలను, యాక్సిడెంట్ జరిగిన తీరును విచారించేందుకు మిచిగాన్ పోలీసులు ఇదే తరహా డ్రోన్ విమానాలను ఉపయోగించనున్నారు.

మానవ రహిత విమానాలతో నిఘా నిర్వహించేందుకు మిచిగాన్ స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)తో కలిసి పనిచేస్తోంది. పబ్లిక్ సేఫ్టీ కోసం స్టేట్ మొత్తం నిఘా ఉంచేందుకు ఈ డ్రోన్‌లను ఎగిరించేందుకు అనుమతి కోసం పోలీసులు ఎఫ్ఏఏ నుంచి ఆథరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

police use drone for safety

సెప్టెంబర్ 2013లోనే మిచిగాన్ స్టేట్ పోలీసులు ఏర్‌యాన్ స్కైరేంజర్‌ను కొనుగోలు చేశారు. బహుశా వారు ఇదే విమానాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2014లో డైమండేల్‌లోని మిచిగాన్ స్టేట్ పోలీస్ అకాడెమీ వద్ద ట్రైనింగ్ ఫ్లైట్లను నిర్వహించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు అనుమతి కూడా లభించింది.

ఈ డ్రోన్‌ను ఇద్దరు క్రూ సభ్యులు ఆపరేట్ చేస్తారు. ఇది భూమిపై నుంచి 400 అడుగుల ఎత్తులో విహరిస్తూ, రాష్ట్రంపై నిఘా ఉంచుతుంది. ఈ డ్రోన్ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు గాను క్రూ సభ్యులకు ఏర్‌యాన్ స్కైరేంజర్ తయారీదారు శిక్షణ అందిస్తుంది. ఈ డ్రోన్ విమానానికి ఓ అధునాతన కెమెరా ఉంటుంది.

ఈ కెమెరా రాత్రివేళల్లో సైతం మంచి క్వాలిటీతో కూడిన వీడియోలు చిత్రీకరించడమే కాకుండా, సదరు వీడియో లైవ్‌గా కనెక్టెడ్ డివైజెస్‌కి స్ట్రీమ్ చేస్తుంది. అంతేకాకుండా.. ఈ డ్రోన్ సాయంతో ఫొటోలను కూడా క్యాప్చూర్ చేయవచ్చు.

Most Read Articles

English summary
The Michigan State Police department, for the first time for any police department will use drones to investigate crimes and accidents that happen in the city.
Story first published: Friday, January 30, 2015, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X