హైదరాబాద్ మెట్రో రైల్ మోడల్ కోచ్ ఆవిష్కరణ

Posted by:

రాష్ట్ర రాజధాని 'హైదరాబాద్'లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‍‌కు తొలి మెట్రో రైల్ కోచ్ వచ్చింది. ఈ కోచ్‌ను నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

కొరియాకు చెందిన హ్యుందాయ్ రోట్టర్‌డామ్ కంపెనీ ఈ మెట్రో రైల్ కోచ్‌ తయారు చేసింది. ఇది దక్షిణ కొరియా నుంచి చెన్నైకి, అక్కడి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 57 రైళ్లు కావల్సి ఉంది. ఇందుకు గాను 171 కోచ్‌లు అవసరం అవుతాయి. ఈ తొలి కోచ్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

మరిన్ని ఫొటోలను, వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కొరియాకు చెందిన హ్యుందాయ్ రోట్టర్‌డామ్ కంపెనీ ఈ మెట్రో రైల్ కోచ్‌ తయారు చేసింది. ఇది దక్షిణ కొరియా నుంచి చెన్నైకి, అక్కడి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చింది.

నెక్లెస్ రోడ్డులోని పివి జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.

మెట్రో రైల్ కోచ్‌ రైడర్ సీటులో కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

రోడ్డుపై రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెడుతూ, నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను మొత్తం ఆరు దశల్లో (6 స్టేజ్స్) పూర్తి చేయనున్నారు. ఇందులో మొదటి దశ మార్చ్ 2015 నాటికి పూర్తి కానుంది.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ దశలు, రూట్లు క్రింది విధంగా ఉన్నాయి.
స్టేజ్ 1 - నాగోల్ నుంచి మెట్టుగూడ : మార్చ్ 21, 2015
స్టేజ్ 2 - మియాపూర్ నుంచి ఎస్.ఆర్. నగర్ : ఆగస్ట్ 15, 2015
స్టేజ్ 3 - మెట్టుగూడ నుంచి బేగంపేట్ : నవంబర్ 14, 2015
స్టేజ్ 4 - బేగంపేట్ నుంచి శిల్పారామం : ఆగస్ట్ 15, 2016
స్టేజ్ 5 - ఎస్.ఆర్. నగర్ నుంచి ఎల్.బి. నగర్ : ఆగస్ట్ 15, 2016
స్టేజ్ 6 - జేబిఎస్ నుంచి ఫలక్‌నుమా : జనవరి 1, 2017

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రూట్ మ్యాప్.

English summary
Andhra Pradesh chief minister N Kiran Kumar Reddy on Wednesday asked officials to ensure Phase 1 of the Hyderabad Metro Rail (HMR) is completed by March 2015.
Please Wait while comments are loading...

Latest Photos