గోవాలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకను సందర్శించిన మోడీ

By Ravi

గోవా తీరంలో ఉన్న భారతదేశపు అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను నేడు (14.06.2014) ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ఉదయం గోవా చేరుకున్న ప్రధానికి నేవీ ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం యుద్ధనౌకపై నేవీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించారు.

భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే మొదటిసారి. అరేబియా సముద్ర జలాల్లో నిలిచిన ఈ యుద్ధనౌకపైకి ప్రధాని నేవీ హెలికాప్టర్‌లో వచ్చారు. ఆ తర్వాత యుద్ధనౌక, నేవీ యుద్ధ విమానాలు సంయుక్తంగా చేపట్టే విన్యాసాలను మోడీ స్వయంగా తిలకించడంతో పాటుగా ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌లో కూడా ఆయన గగనతలంలో విహరించారు.

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లలో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

తర్వాతి స్లైడ్‌లలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

విక్రమాదిత్య యుద్ధనౌకను రష్యా నుంచి 15 వేల కోట్లతో భారత్ కొనుగోలు చేసింది. దీని మొత్తం బరువు 44,500 టన్నులు.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

ఈ విమాన వాహక నౌక కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం 2004లో గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కుదరగా, పదేళ్ల తర్వాత 2013 నవంబర్ 16న అప్పటి రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ నౌకాదళంలోకి దాన్ని చేర్చారు.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

విక్రమాదిత్య యుద్ధనౌక భారత నౌకాదళంలోకెల్లా అతిపెద్ద, అతిబరువైన నౌక. దీని పొడవు 284 మీటర్లు, ఎత్తు 60 మీటర్లు, బరువు 44,500 టన్నులు.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

విక్రమాదిత్య యుద్ధనౌక ఏకకాలంలో 24 మిగ్-29 రకం యుద్ధ విమానాలు, 10 హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

విక్రమాదిత్య యుద్ధనౌక రోజుకు 1,300 కిలోమీటర్ల దూరం సముద్రయానం చేయగలదు. దీనిలో ఒకసారి ఇంధనం నింపితే ఇది నిరంతరాయం 45 రోజులపాటు పనిచేస్తుంది.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

విక్రమాదిత్య యుద్ధనౌకలో నౌక కార్యకలాపాలను 1,600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఇందులోని సిబ్బంది ఆహారం కోసం నెలకు 16 టన్నుల బియ్యం, 2 లక్షల లీటర్ల పాలు, లక్షకుపైగా గుడ్లు అవసరమవుతాయని అంచనా.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

విక్రమాదిత్య యుద్ధనౌక భారత్ కన్నా ముందు రష్యా నౌకాదళంలో సేవలు అందించింది. రష్యా 1987లో ఈ నౌకను ‘బకు' పేరుతో తన నౌకాదళంలో ప్రవేశపెట్టి ఆపై దీనికి అడ్మిరల్ గోర్ష్‌కోవ్ అని నామకరణం చేసింది.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

1996లో తన నౌకాదళ సేవల నుంచి తొలగించాక దీన్ని ఆధునీకరించి భారత్‌కు విక్రయించేందుకు ముందుకొచ్చింది. దీని కొనుగోలుకు 2004లో భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

వాస్తవానికి రష్యా 2008లోనే ఈ యుద్ధనౌకను భారత్‌కు అప్పగించాల్సి ఉన్నా నిర్మాణ వ్యయం పెరిగిందంటూ ఆధునీకరణ పనులను ఆపేయడంతో భారత్ మరింత సొమ్ము వెచ్చించేందుకు అంగీకరిస్తూ మరో ఒప్పందం కుదుర్చుకుంది.

ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌక

దీనిపై మిగ్ 29కె, సీ హారియర్స్, లాంగ్ రేంజి సముద్ర గస్తీ యాంటీ సబ్‌మెరైన్ యుద్ద విమానం పి8ఎల్, టియు 142ఎం, ఐఎల్-38 ఎస్‌డి సముద్ర గస్తీ విమానాలు, కామోవ్, సీకింగ్ హెలికాప్టర్లు లాంటి వివిధ రకాల యుద్ద విమానాలు ఉంటాయి.

Most Read Articles

English summary
Prime Minister Narendra Modi on Saturday visited the country’s largest warship INS Vikramaditya off Goa coast in Arabian Sea, showcasing India’s naval prowess.
Story first published: Saturday, June 14, 2014, 13:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X