వేలంలో అత్యధిక వెల పలికిన అరు(ఖరీ)దైన కార్లు

పురాతన కార్లకు, అరుదైన కార్లకు మరియు సెలబ్రిటీలు, ప్రముఖులు ఉపయోగించిన కార్లకు ఓ విశిష్ట ఉంటుంది. మన వద్ద కూడా ఇలాంటి ఓ కారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే, ఇటువంటి అరుదైన కార్లను సొంతం చేసుకునేందుకు కోట్ల రూపాయలను సైతం వెచ్చించేందుకు వెనుకాడరు. అందుకే కొన్ని రకాల అరుదైన కార్లు వేలంలో కోట్ల రూపాయల వెల పలుకుతుంటాయి.

వాస్తవానికి ఏదైనా కారును కొనాలనుకుంటే వేలం అనేది సరైన మార్గం కాదు. ఈ విధానంలో ఒక్కోసారి లక్షల ఖరీదు చేసే కార్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అయితే, అదృష్టం బాగుంటే, అసలు ధర కన్నా కూడా తక్కువ ధరకే కూడా ఇవి లభించే ఆస్కారం ఉంది. కానీ, ఇలా జరగటానికి అవకాశాలు చాలా తక్కువ. అందుకే, అరుదైన కార్లను విక్రయించాలనుకునే వారు వేలం సంస్థలను ఆశ్రయిస్తుంటారు.

ఎవరైనా వేలంలో కారును కొనాలనుకుంటే, వేలంలో వారు పాడిన ధరకు అధనంగా 5 శాతం నుంచి 20 శాతం మధ్యలో బయ్యర్ ప్రీమియం‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి సెల్లర్ ప్రీమియంను కూడా చెల్లించాల్సి రావచ్చు. సరే ఇదంతా అటుంచితే, వేలంలో అధిక వెల పలకిన, అత్యంత ఖరీదైన మరియు అరుదైన కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

1957 ఫెరారీ 250 టెస్టా రోసా

1957 ఫెరారీ 250 టెస్టా రోసా

ఫెరారీ 250 టెస్టా రోసా లేదా ఫెరారీ టిఆర్‌గా ప్రసిద్ధి చెందిన రేస్ కారు 1950-60 దశకంలో ఓ వెలుగు వెలిగింది. ఫెరారీ కంపెనీ 1956 నుంచి 1961 మధ్య కాలంలో కేవలం 34 యూనిట్ల 250 టెస్టా రోసా కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఆగస్ట్ 21, 2011లో గూడింగ్ అండ్ కంపెనీ నిర్వహించిన వేలంలో ఇది 16,390,000 డాలర్ల వెల పలికింది.

1936 మెర్సిడెస్ బెంజ్ 540కె స్పెషల్ రోడ్‌స్టర్

1936 మెర్సిడెస్ బెంజ్ 540కె స్పెషల్ రోడ్‌స్టర్

మెర్సిడెస్ బెంజ్ 540కె కారును 1935 నుంచి 1940 మధ్య కాలంలో తయారు చేశారు. అప్పట్లో ఇది మోస్ట్ వాంటెడ్ కార్లలో ఒకటి. వార్నర్ బ్రదర్స్ ఫిల్మ్ స్టూడియోస్‌కు చెందిన జాక్ వార్నర్ వద్ద ఈ మెర్సిడెస్ బెంజ్ 540కె కారు ఉంది. ఆగస్ట్ 19, 2012లో గూడింగ్ అండ్ కంపెనీ నిర్వహించిన వేలంలో ఇది 11,770,000 డాలర్ల వెల పలికింది.

1960 ఫెరారీ 250 జిటి కాలిఫోర్నియా ఎల్‌డబ్ల్యూబి కాంపిటీజీయన్ స్పైడర్

1960 ఫెరారీ 250 జిటి కాలిఫోర్నియా ఎల్‌డబ్ల్యూబి కాంపిటీజీయన్ స్పైడర్

ఫెరారీ ఈ కారును నార్త్ అమెరికన్ మార్కెట్ల కోసం అభివృద్ధి చేసింది. హాలీవుడ్ నటుడు జేమ్స్ కోబర్న్ వద్ద ఒకప్పట్లో ఈ కారు ఉండేది. ఫెరారీ 250 జిటి కాలిఫోర్నియా స్పైడర్ ఎల్‌డబ్ల్యూబి అరుదైన మోడల్. కంపెనీ కేవలం 50 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఆగస్ట్ 19, 2012లో గూడింగ్ అండ్ కంపెనీ నిర్వహించిన వేలంలో ఇది 11,275,000 డాలర్ల వెల పలికింది.

1968 ఫోర్డ్ జిటి40

1968 ఫోర్డ్ జిటి40

ఫోర్డ్ తయారు చేసిన అమెరికన్-బ్రిటీష్ హై పెర్ఫామెన్స్ కార్లలో జిటి40 ఒకటి. ఫెరారీని సవాల్ చేసేందుకు ఈ కారును 1964 నుంచి 1969 మధ్య కాలంలో ఉత్పత్తి చేశారు. ఈ కారు వరుసగా నాలుగు సార్లు 24 అర్స్ లీమ్యాన్స్ రేసులో గెలుపొందింది. ఆగస్ట్ 17, 2012లో ఆర్ఎమ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో ఇది 11,000,000 డాలర్ల వెల పలికింది.

1931 డ్యూసెన్‌బర్గ్ మోడల్ జే లాంగ్ వీల్‌బేస్ కూపే

1931 డ్యూసెన్‌బర్గ్ మోడల్ జే లాంగ్ వీల్‌బేస్ కూపే

డ్యూసెన్‌బర్గ్ ఆటోమొబైల్ అండ్ మోటార్స్ కంపెనీ 1913 నుంచి 1937 కాలం వరకూ కార్యకలాపాలు నిర్వహించింది. ఈ మోడల్ జే కారును 1928 నుంచి 1937 మధ్య కాలంలో తయారు చేశారు. ఆగస్ట్ 17, 2012లో ఆర్ఎమ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో ఇది 10,340,000 డాలర్ల వెల పలికింది.

1931 బుగాటి రాయల్ కెల్నెర్ కూపే

1931 బుగాటి రాయల్ కెల్నెర్ కూపే

బుగాటి రాయల్ కారను రాయల్టీ కోసం తయారు చేశారు. ఇది కొత్త తరం రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు కన్నా 20 శాతం ఎక్కువ పొడవును, 25 శాతం అధిక బరువును కలిగి ఉంటుంది. బుగాటి ఇలాంటివి కేవలం ఆరు కార్లను మాత్రమే ఉత్పత్తి, ఆ హయాంలో కేవలం మూడు కార్లను మాత్రమే విక్రయించగలిగింది. నవంబర్ 17, 1987లో క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో ఇది 9,800,000 డాలర్ల వెల పలికింది.

1962 ఫెరారీ 330 టిఆర్ఐ/ఎల్ఎమ్ స్పైడర్

1962 ఫెరారీ 330 టిఆర్ఐ/ఎల్ఎమ్ స్పైడర్

ఈ ఫెరారీ మోడల్ కేవలం ఒకే ఒక 4-లీటర్ టెస్టా రోసా మరియు ఇదే చివరి టెస్టా రోసా. అంతేకాకుండా, ఫెరారీ నిర్మించిన ఫ్రంట్ ఇంజన్ (ముందు వైపు ఇంజన్ కలిగిన మోడల్) కారు కూడా ఇదే. మే 20, 2007లో ఆర్ఎమ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో ఇది 9,281,250 డాలర్ల వెల పలికింది.

1955 ఫెరారీ 410ఎస్

1955 ఫెరారీ 410ఎస్

ఫెరారీ 1955లో ఇలాంటివి కేవలం 4 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఆగస్ట్ 17, 2012లో ఆర్ఎమ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో ఇది 8,250,000 డాలర్ల వెల పలికింది.

1937 బుగాటి టైప్ 57ఎస్‌సి అట్లాంటా కూపే

1937 బుగాటి టైప్ 57ఎస్‌సి అట్లాంటా కూపే

బుగాటి సంస్థ వ్యవస్థాపకుడు ఎట్టోర్ బుగాటి కుమారుడు జీన్ బుగాటి డిజైన్‌కు ప్రతిరూపమే ఈ కారు. కేవలం 17 బుగాటి టైప్ 57ఎస్‌సి అట్లాంటా కూపే కార్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఆగస్ట్ 17, 2008లో గూడింగ్ అండ్ కంపెనీ నిర్వహించిన వేలంలో ఇది 7,920,000 డాలర్ల వెల పలికింది.

1929 బెంట్లీ బౌలర్

1929 బెంట్లీ బౌలర్

బెంట్లీ బౌలర్ కారులో 4½ లీటర్ సూపర్‌ఛార్జ్‌‌డ్ వెర్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో టూరింగ్ మోడల్ గరిష్టంగా 175 హార్స్ పవర్‌ల శక్తిని, రేసింగ్ వెర్షన్ 240 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జూన్ 29, 2012లో బోన్‌హామ్స్ నిర్వహించిన వేలంలో 7,906,745 డాలర్ల వెల పలికింది.

Most Read Articles

English summary
Drivespark cracks down on some of the most expensive cars sold at an auction till date. Be it auctioneers such as Goodings & Company or RM Auctions, listed in the photo gallery below are some of the most exotic cars to face the gavel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X