కొన్ని ప్రమాదకరమైన/ఆశ్చర్యకరమైన మోటార్‌సైకిల్ స్టంట్స్

By Ravi

మోటార్‌సైకిల్ స్టంట్స్ చేయాలనే కోరిక చాలా మందికి యువతకు ఉంటుంది. స్టంట్స్ చేసి పక్కవాళ్లను ఇంప్రెస్ చేయబోయి బొక్కబోర్లా పడిన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ తరహా స్టంట్స్ చేయటానికి గుండె ధైర్యంతో పాటుగా దీర్ఘకాల శిక్షణ కూడా అవసరం.

ఏదైనా ఆటో షో లేదా బైక్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ప్రొఫెషనల్స్ చేసే అద్భుతమైన స్టంట్స్‌ను చూడొచ్చు. మోటార్‌సైకిల్ స్టంట్స్‌లో అనేక రకాల స్టంట్స్ ఉన్నాయి. ఈనాటి మన కథనంలో కొన్ని బెస్ట్ మోటార్‌సైకిల్ స్టంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హెచ్చరిక

హెచ్చరిక

ఈ కథనంలో చూపించబడిన స్టంట్‌లన్నింటినీ కూడా నిపుణులైన ప్రొఫెషనల్స్‌చే నిర్వహించబడినవి, దయచేసి వీటిని ఇంటి వద్ద ప్రయత్నించవద్దని మనవి.

ది వీలీ

ది వీలీ

ముందు చక్రాన్ని గాల్లోకి లేపి, వెనుక చక్రంపై బ్యాలెన్సింగ్ చేయటాన్ని వీలీ అంటారు. దీనినే ఫ్రంట్ వీలీ అని కూడా పిలుస్తారు. ఈ తరహా స్టంట్ మన వీధుల్లో కుర్రాళ్లు కూడా చేస్తుంటారు. కాకపోతే ఇలాంటి స్టంట్స్ చేసేటప్పుడు కాస్తంత వళ్లు దగ్గరపెట్టుకొని చేయాలి.

ది స్టాపీ

ది స్టాపీ

వీలికి ఆపోజిటే ఈ స్టాపీ. ఇందులో వెనుక చక్రాన్ని గాల్లోకి లేపి ముందు చక్రంపై బ్యాలెన్స్ చేయటం జరుగుతుంది. అయితే, ఇది చాలా ప్రమాదకరమైనది. బ్యాలెన్సింగ్ చేయటంలో ఏ మాత్రం తేడా వచ్చినా మూతి పచ్చడవటం ఖాయం.

సర్కిల్

సర్కిల్

వీలీ చేస్తూ (ఫ్రంట్ టైరును గాలిలోకి లేపి వెనుక చక్రంపై బ్యాలెన్స్ చేస్తూ) గుండ్రంగా తిరగటాన్ని సర్కిల్ అంటారు.

12ఓ క్లాక్

12ఓ క్లాక్

హైవీలీ చేయటాన్నే 12ఓ క్లాక్ అంటారు. అంటే ఫ్రంట్ వీల్‌ను దాదాపుగా 90 డిగ్రీల కోణంలో పైకి లేపి, వెనుక వీల్‌పై బ్యాలెన్సింగ్ చేయటం అన్నమాట.

హై చైర్

హై చైర్

వీలీ చేస్తూ రైడర్ హ్యాండిల్ బార్ మీదుగా కాళ్లు ముందుకు చాచి స్టంట్ చేయటాన్ని హై చైర్ అంటారు.

స్ప్రెడర్

స్ప్రెడర్

వీలీ చేస్తూ రెండు కాళ్లను గాలిలో చాచడాన్ని స్ప్రెడర్ అని పిలుస్తారు.

సీట్ స్టాండర్

సీట్ స్టాండర్

వీలీ చేస్తూ సీట్‌పై నిలుచుకోవటాన్ని సీట్ స్టాండర్ స్టంట్ అని పిలుస్తారు.

సూసైడ్ బర్నవుట్

సూసైడ్ బర్నవుట్

బైక్‌ను ఆన్ చేసి, ఫ్రంట్ వీల్‌ బ్రేక్‌ను అప్లయ్ చేసి బైక్‌ను గేరులో సర్కిల్‌లో తిప్పడాన్ని సూసైడ్ బర్నవుట్ అని పిలుస్తారు.

జీసెస్ క్రైస్ట్

జీసెస్ క్రైస్ట్

బైక్‌ను రెండు చక్రాలపై నడుపుతూ ట్యాంక్‌పై నిలుచుకొని రెండు చేతులను గాలిలో చాపడాన్ని జీసెస్ క్రైస్ట్ స్టంట్ అని పిలుస్తారు.

Most Read Articles

English summary
Here is a quick list of insane motorcycle stunts performed by professionals. Have you ever tried any of these? If you wish to try these stunts please gear up and seek professional advice.
Story first published: Friday, March 20, 2015, 19:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X