మోటార్‌సైక్లింగ్ అపోహలు మరియు వాస్తవాలు..

By Ravi

మోటార్‌సైకిళ్లకు పెద్దగా శబ్ధం చేసే సైలెన్సర్లను బిగించుకుంటే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయా..? మోటార్‌సైకిల్ నడపటం వలన తీవ్ర గాయాలు కావటం లేదా ప్రాణాలు పోవటం జరుగుతుందా..?మీ బైక్‌కు రేస్ టైర్లు బిగించుకుంటే, అది మరింత వేగంతో పరుగులు తీస్తుందా..? బైకర్లు నల్లటి లెథర్ వస్తువులనే ధరిస్తారు ఎందుకు..? మీ మొదటి బైక్‌గా మీరు ఎప్పుడూ కలగనే బైక్‌నే కొనాలా..?

ఏంటి.. ఇక్కడ అన్ని ప్రశ్నలే ఉన్నాయి అనుకుంటున్నారా..? హమ్.. అక్కడికే వస్తున్నా..! మోటార్‌సైకిళ్ల విషయంలో చాలా మందికి కొన్ని రకాల అపోహలు ఉంటాయి. అలాంటి వాటిల్లో పైన పేర్కొన్నవి కొన్ని మాత్రమే. ఈ కథనంలో అటువుంటి అపోహల గురించి, వాటికి సంబంధించిన వాస్తవాల గురించి తెలుసుకుందాం రండి..!

పెద్ద సైలెన్సర్లతో లైఫ్ సేఫ్?

పెద్ద సైలెన్సర్లతో లైఫ్ సేఫ్?

ఇది కేవలం అపోహ మాత్రమే. పెద్దగా శబ్ధం చేసే సైలెన్సర్లతో ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చాలా మంది రైడర్లు, కస్టమ్ ఆఫ్టర్-మార్కెట్ ఎగ్జాస్ట్ పైప్ మేకర్స్ దీనిని నిజమని భావిస్తారు. వాస్తవానికి ఇందులో ఉన్న లాజిక్ ఎంటంటే.. పెద్ద శబ్ధం చేసే సైలెన్సర్లను బైక్‌లకు బిగించుకుంటే, ఆ శబ్ధానికి రోడ్డుపై వెళ్లేవారు, విండో కొద్దిగా డౌన్ చేసుకొని కారులో వెళ్లేవారు అప్రమత్తమం అవుతారు.

ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ ఇలాంటి సైలెన్సర్ల వినియోగం వల్ల శబ్ధ కాలుష్యం పెరగుతుంది. ఇది మన చుట్టూ ఉండే పర్యావరణానికి అంత మంచిది కాదు. సైలెన్సర్ మోడిఫికేషన్ వలం మైలేజ్ తగ్గడం, ఇంజన్ జీవితకాలం తగ్గటం వంటి ప్రమాదాలు కూడా లేకపోలేదు. మీ లైఫ్ నిజంగా సేఫ్‌గా ఉండాలంటే, లౌడ్ సైలెన్సర్లకు బదులుగా, సేఫ్టీ గేర్ (జాకెట్, గ్లౌవ్స్, షూస్, హెల్మెట్ మొదలైనవి) ధరించటం మంచిది.

మోటార్‌సైకిల్ నడిపటం వలన తీవ్ర ప్రమాదాలు లేదా మరణం సంభవిస్తుందా?

మోటార్‌సైకిల్ నడిపటం వలన తీవ్ర ప్రమాదాలు లేదా మరణం సంభవిస్తుందా?

మోటార్‌సైకిల్ నడిపటం వలన తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో చనిపోయే ఆస్కారం కూడా ఉంటుందని కొంతమంది భయపడుతుంటారు. అజాగ్రత్తగా ఉన్నప్పుడు మోటార్‌సైకిల్ నడపటం వల్లనే ఏ వాహనం నడిపినా ప్రమాదం సంభవిస్తుంది. కొన్నిసార్లు ప్రకృతి విపత్తుల వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు. గాలి వేగంగా వీచినప్పుడు, వర్షం జోరుగా పడుతున్నప్పుడు వంటి సందర్భాల్లో కూడా ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. అంతమాత్రాన భయపడి మోటార్‌సైకిల్ నడపటం మానేయం కదా..!

కాబట్టి, మోటార్‌సైకిల్ నడపటానికి ముందు తగిన శిక్షణ అలాగే నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాద తీవ్రతను తగ్గించే ఆస్కారం ఉంటుంది.

రేస్ టైర్లు బిగించుకుంటే రోడ్డుపై బైక్ వేగం పెరుగుతుందా..?

రేస్ టైర్లు బిగించుకుంటే రోడ్డుపై బైక్ వేగం పెరుగుతుందా..?

ఇది పూర్తిగా అవాస్తవం. మోటార్‌సైకిల్ రోడ్డు టైర్లతో పోల్చుకుంటే రేస్ టైర్లు పూర్తిగా విభిన్నమైనవి. రేస్ ట్రాక్‌లపై సమర్థవంతమైన రోడ్ గ్రిప్ కోసం వాటిని విభిన్నమైన కాంపౌండ్స్, ప్రాపర్టీస్‌తో తయారు చేస్తారు. రేస్ టైర్లను బిగించుకొని, సాధారణ రోడ్లపై ప్రయాణిస్తే, బైక్ నుంచి జారి పడిపోవటం వంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.

కాబట్టి, నిత్యం సాధారణ రోడ్లపై నడిపే వారు ఎట్టి పరిస్థితుల్లోను రోడ్ టైర్లనే ఉపయోగించండి.

బైక్‌పై పోలీసులకు దొరకం..?

బైక్‌పై పోలీసులకు దొరకం..?

మోటార్‌సైకిళ్లు కార్లు లేదా ట్రక్కుల కన్నా చిన్నవిగా ఉంటాయి, కాబట్టి, పోలీస్ స్పీడ్ రాడార్లు మనల్ని గుర్తించవు అని చాలా మంది భావిస్తుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం పోలీసులకు అధునాతన లేజర్స్/స్పీడ్ గన్స్ అందుబాటులోకి వచ్చాయి. మీరు ఎంత ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పటికీ, వీటి సాయంతో స్పష్టమైన ఫొటోలను, అలాగే మీరు ప్రయాణించే వేగాన్ని కూడా రికార్డు చేయటం జరుగుతుంది.

కాబట్టి, బైక్‌పై వేగంగా వెళ్తే ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకోవచ్చని అర్థం కాదు. మీరు కూడా స్పీడ్/లేజర్ గన్ చేతికి చిక్కుతారు.

కొత్త టైర్లపై కోటింగ్..?

కొత్త టైర్లపై కోటింగ్..?

కొత్త టైర్లు ఓ రకమైన కోటింగ్‌తో లభిస్తాయి, వాటిని గాలి లేకుండా కొన్ని కిలోమీటర్లు నడిపితే ఈ కోటింగ్ తీసేయటం సాధ్యమవుతుందని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. అలా చేస్తే మీరు ప్రమాదానికి గురి కావటం ఖాయం. వాస్తవానికి కొత్త మోటార్‌సైకిళ్లకు అమర్చిన కొత్త రోడ్ టైర్లపై మనకు ఏదో కోటింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి అలా ఏమీ ఉండదు. ఫ్యాక్టరీలో టైర్ మోల్డ్‌లను నుంచి తీసిన వాటిని అలానే కొత్త బైక్‌లకు బిగిస్తారు కాబట్టి, అలా అనిపిస్తుంది.

కాబట్టి, ఎప్పుడూ కూడా టైర్లలో గాలి తగ్గించి బైక్‌ను నడపటానికి ప్రయత్నించకండి.

ప్రమాదాన్ని చూసి బైక్‌‌ను డౌన్ మంచిది?

ప్రమాదాన్ని చూసి బైక్‌‌ను డౌన్ మంచిది?

ఒకవేళ తాము రాబోయే ప్రమాదాన్ని చూసినట్లయితే, బైక్‌ను ముందుగానే డౌన్ మంచిదని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది ముమ్మాటికి అవాస్తవం. ఇలా చేయటం వలన ప్రమాదం నుంచి తప్పించుకోవటం మాట అటుంచితే, కొత్త ప్రమాదానికి స్వాగతం చెప్పిన వారు అవుతారు. ఇలాంటి సందర్భాల్లో బైక్‌ను ముందుగానే డౌన్ చేయటానికి బదులుగా, వేగాన్ని తగ్గించుకొని, బైక్‌పై చక్కటి రైడింగ్ పొజిషన్‌లో ఉండి, రెండు బ్రేక్‌లను అప్లయ్ చేసి, ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు.

కాబట్టి, ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు, మంచి బ్రేకింగ్ టెక్నిక్స్‌ను నేర్చుకోండి.

నలుపు లెథర్ ఎందుకు?

నలుపు లెథర్ ఎందుకు?

బైకర్లు ఎక్కువగా నలుపు రంగు లెథర్ వస్తువులను ధరిస్తారు, ఎందుకంటే వారు అందులో కూల్‌గా కనిపించాలని కోరుకుంటారు. ఇది వాస్తమే. నలుపు రంగు కూల్‌గా కనిపిస్తుంది. అందుకే, బైకర్లు ధరించే జాకెట్స్, గ్లౌవ్స్, ప్యాంట్స్ అలాగే వారు నడిపే మోటార్‌సైకిల్స్ కూడా ఎక్కువ భాగం నలుపు రంగులోనే ఉంటాయి.

మీ ఫస్ట్ బైక్‌గా మీ డ్రీమ్ బైక్‌నే కొనాలా?

మీ ఫస్ట్ బైక్‌గా మీ డ్రీమ్ బైక్‌నే కొనాలా?

మీరు ఎప్పుడు కలగనే బైక్‌నే మీ ఫస్ట్ బైక్‌గా కొనుగోలు చేయాలని అనుకుంటుంటారు. అయితే, మీరు కలగనే డ్రీమ్ బైక్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ, అది మీ ఫస్ట్ బైక్ కాబట్టి, బైక్‌తో పాటు మంచి సేఫ్టీ గేర్ (జాకెట్, హెల్మెట్, గ్లవ్స్ మొదలైవని) కొనేందుకు తగిన బడ్జెట్‌ను కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత బైక్ గురించి ఆలోచించుకోవాలి. కేవలం మీరు మనసు పడ్డారని మీ డ్రీమ్ బైక్‌ను నేరుగా కొనుగోలు చేయటం కాకుండా, ఆ బైక్ పనితీరు ఎలా ఉంటుంది, ధరెంత, సర్వీస్ నెట్‌వర్క్ ఎలా ఉంది వంటి అనేక అంశాలను బేరీజు వేసుకోవాలి. అవసరమైతే మీ స్నేహితులు లేదా నిపుణుల సాయం తీసుకొన్న తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలి.

తక్కువ దూరాలకు మాత్రమేనా?

తక్కువ దూరాలకు మాత్రమేనా?

మోటార్‌సైకిళ్లు తక్కువ దూరాలు ప్రయాణించే వారికి, రోజు ప్రయాణం చేసే వారికి మాత్రమే అని భావిస్తుంటాం. అయితే, మోటార్‌సైకిళ్లపై దూరప్రయాణాలు చేయటం కూడా సాధ్యమే. దీనినే టూరింగ్ అంటాం. ఇలాంటి ప్రయాణాల కోసం ఉపయోగించే బైక్‌లను టూరింగ్ బైక్స్ అని అంటాం. ఎలాంటి బైక్‌పై అయినా లాంగ్ ట్రిప్ వెళ్లొచ్చు. అయితే, అంతకన్నా ముందుగా బైక్ కండిషన్‌లో ఉందో లేదో చూసుకోవాలి, మార్గమధ్యంలో ఏదైనా చిన్నపాటి మరమ్మత్తు వస్తే చేసుకోగలిగే టెక్నిక్ తెలిసి ఉండాలి. వీటన్నింటికీ మించి, లాంగ్ ట్రిప్‌కు వెళ్లేందుకు కావల్సిన రైడ్ సేఫ్టీ గేర్, యాక్ససరీస్, ఫుడ్ మొదలైనవి వెంట తీసుకొని వెళ్లాలి.

ఫ్రంట్ బ్రేక్ వాడకూడదా?

ఫ్రంట్ బ్రేక్ వాడకూడదా?

మీకు నైపుణ్యం ఉంటే తప్ప, ఫ్రంట్ బ్రేక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోను వాడకూడదు. ఈమాటను మనం తరచూ వింటూనే ఉంటాని. ఇందులో కొంత వాస్తం ఉంది, కొంత అవాస్తవం కూడా ఉంది. ఫ్రంట్ బ్రేక్‌లను వాడటానికి భయపడాల్సిన పని లేదు. బిగినర్స్ మాత్రం వెనుక బ్రేక్‌తో ప్రాక్టీస్ చేయాలి, అత్యవసర సమయాల్లో ఫ్రంట్, రియర్ బ్రేక్‌లను అప్లయ్ చేయటం వలన బైక్‌ను సమర్థవంతంగా నిలపవచ్చు.

బైక్ ఇంజన్ నుంచి వచ్చే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది కాబట్టి, ముందు బ్రేక్‌ల కన్నా వెనుక బ్రేక్‌లే సమర్థవంతంగా పనిచేస్తాయని అనుకుంటాం. కానీ ముందు బ్రేక్‌కు 70 శాతనికి పైగా స్టాపింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి, రెండు బ్రేక్‌లను టెక్నిక్‌గా అప్లయ్ చేయటం నేర్చుకోండి.

బైక్ ఉంటే, అమ్మాయిలు లవ్‌లో పడాతారా?

బైక్ ఉంటే, అమ్మాయిలు లవ్‌లో పడాతారా?

బైక్ ఉంటే అమ్మాయిలును సులువుగా లవ్‌లో పడేయచ్చు లేదా ఆకర్షించవచ్చు అని చాలా మంది కుర్రకారు భావిస్తుంటారు. ఇది పూర్తిగా అవాస్తవం. కేవలం ఒక్క మోటార్‌సైకిల్ ఉన్నంత మాత్రమే అమ్మాయిలు మీ వెంటపడరు. వాస్తవానికి ఇప్పటికే కొందరు అమ్మాయిలు మోటార్‌సైకిళ్లు నడుపుతున్నారు (అయితే, మెజారిటీ భాగం కాదనుకోండి).

హెల్మెట్ల వల్ల మెడ విరుగుతుందా?

హెల్మెట్ల వల్ల మెడ విరుగుతుందా?

మోటార్‌సైకిల్ హెల్మెట్ల వల్ల మెడ భాగం విరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఇది లాజికల్, ప్రమాదం జరిగినప్పుడు, బైక్ నుంచి క్రింద పడేటప్పుడు భారం మొత్తం మెడ భాగం మీద పడినట్లయితే, ఇలా జరుగే అవకాశం ఉంటుంది. అలాకాకుండా, పక్కగా పడితే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, హెల్మెట్ ధరించినప్పుడు, ధరించనప్పుడు జరిగే ప్రమాదాలతో పోల్చుకుంటే, ధరించిన సందర్భాల్లో మెడ భాగంలో దెబ్బలు తక్కువగా తగులుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

హెల్మెట్ వల్ల కనిపించదు, వినిపించదా?

హెల్మెట్ వల్ల కనిపించదు, వినిపించదా?

హెల్మెట్ ధరించడం వలన రోడ్డు సరిగ్గా కనిపించదు, రోడ్డుపై ట్రాఫిక్ సబ్ధాలు సరిగ్గా వినిపించవు అని చెబుతుంటారు. ఇది అవాస్తవం. సరైన/నాణ్యమైన హెల్మెట్స్ ధరిస్తే ఈ సమస్య ఉండదు. వాస్తవానికి హెల్మెట్ ధరించిన వారి కన్నా ధరించని వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కొద్దిగా మద్యం సేవిస్తే ప్రమాదం ఏమీ ఉండదా..?

కొద్దిగా మద్యం సేవిస్తే ప్రమాదం ఏమీ ఉండదా..?

మద్యం పెగ్గయినా ఫుల్లయినా పెను ప్రమాదమే. కొంతమంది కొద్దిగా మద్యం సేవించడం వల్ల ప్రమాదం ఏమీ లేదని, మొండిగా వాహనం నడుపుతారు, ఆ తర్వాత ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. మద్యం సేవించిన తర్వాత, అందరూ చెప్పే మాట, నాకేం కాలేదు, నేను పర్‌ఫెక్టుగా ఉన్నానని. కానీ ఇది వారి భ్రమ మాత్రమే, వాస్తవిక పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి.

మద్యం సేవించిన తర్వాత వాహనం నడపటం అత్యంత ప్రమాదకరం, అంతేకాదు ఇది చట్టరీత్యా నేరం కూడా.

ఏబిఎస్, నాన్ ఏబిఎస్?

ఏబిఎస్, నాన్ ఏబిఎస్?

నైపుణ్యం కలిగిన రైడర్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన బైక్‌ల కన్నా రెగ్యులర్ బ్రేక్స్ కలిగిన బైక్‌లను చక్కగా నిలుపుదల చేయగలడు. తాజా అధ్యయనాల ప్రకారం, ఎంత నైపుణ్యం కలిగిన రైడర్ అయినా సరే నునుపుగా, తడిగా, జారుతూ ఉండే రోడ్లపై రెగ్యులర్ బ్రేక్‌లు కలిగిన బైక్‌తో నిలుపదల చేసే దూరం (స్టాపింగ్ డిస్టాన్స్), అదే రోడ్లపై ఏబిఎస్‌తో కూడిన బైక్‌లతో నిలుపదల చేసే దూరం కన్నా ఎక్కువగా ఉంటుందని తేలింది. అంటే దీని అర్థం, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అత్యంత సురక్షితమైనదని.

ఫ్రంట్ వీల్ ఊగితే, యాక్సిలరేట్ చేస్తే సరి అవుతుందా?

ఫ్రంట్ వీల్ ఊగితే, యాక్సిలరేట్ చేస్తే సరి అవుతుందా?

మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ వీల్ ఊగినట్లు అనిపిస్తే, కొంత యాక్సిలరేషన్ ఇవ్వగానే అది సరి అయినట్లు అనిపిస్తుంది. అయితే, ఇది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. ఫ్రంట్ వీల్ ఊగిసలాడటానికి చాలా కారణాలుంటాయి. అందులో ప్రధానంగా వీల్ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోవటం లేదా, హార్డ్ బంప్‌ను ఢీకొట్టడం వలన చక్రం రౌండ్ షేప్‌లో లేకపోవటం వంటివి కారణాలు అయి ఉండొచ్చు. ఇలాంటి కారణాలకు, స్పీడ్‌కు సంబంధం లేదు. వీటిని గుర్తించిన తక్షణమే, నిపుణుడైన మెకానిక్ వద్ద ఆ సమస్యను సరి చేయించుకోవాలి.

ప్రీమియం పెట్రోల్‌తో బెటర్ మైలేజ్?

ప్రీమియం పెట్రోల్‌తో బెటర్ మైలేజ్?

ఇది నిజం ప్రీమియం పెట్రోల్‌ను ఉపయోగిస్తే మంచి మైలేజ్ లభిస్తుంది. హై-పెర్ఫామెన్స్ బైక్ ఇంజన్లు అధిక కంప్రెషన్ రేషియోలతో ఆపరేట్ చేసేలా డిజైన్ చేయబడి ఉంటాయి, ఇలాంటి వాటికి అధిక ఆక్టేన్ కలిగిన ఇంధనం అవసరం. కాబట్టి ప్రీమియం అన్‌లీడెడ్ పెట్రోల్ (సింపుల్‌గా చెప్పాలంటే, కల్తీ చేయని పెట్రోల్)ను ఉపయోగించడం వలన బైక్ మైలేజ్ పెరుగుతుంది.

ఏ పరిస్థితుల్లోనైనా హ్యాండ్లింగ్..?

ఏ పరిస్థితుల్లోనైనా హ్యాండ్లింగ్..?

నైపుణ్యం కలిగిన రైడర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బైక్‌ను చక్కగా హ్యాండిల్ చేయగలడు. కొన్ని సార్లు ఇది అతని అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. బైక్‌ను హ్యాండ్లింగ్ చేయటంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ కార్లు మాత్రమే తయారు చేస్తుందా?

బిఎమ్‌డబ్ల్యూ కార్లు మాత్రమే తయారు చేస్తుందా?

చాలా మంది హ్యార్లీ డేవిడ్‌సన్ గురించి విని ఉంటారు, బహుశా ఈ కంపెనీ 1903 నుంచి మోటార్‌సైకిళ్లను తయారు చేస్తుంది కాబట్టి. కానీ ఇతర పురాతన కంపెనీలు కూడా ఈ వ్యాపారంలో ఉన్నాయి. ఉదాహరణకు లగ్జరీ కార్ల తయారీలో పేరుగాంచిన బిఎమ్‌డబ్ల్యూ కూడా ఎప్పుడో మోటార్‌సైకిళ్ల తయారీని ప్రారంభించింది. వాస్తవానికి ఆర్32 అనే బైక్‌ను బిఎమ్‌డబ్ల్యూ 1923లోనే తయారు చేసింది. తొలి రియర్ బిఎమ్‌డబ్ల్యూ ఏఎమ్4 కారును 1932లో తయారు చేశారు.

పిల్లలు పుడితే బైకింగ్ దూరమవుతారా?

పిల్లలు పుడితే బైకింగ్ దూరమవుతారా?

ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు బైకింగ్‌కి దూరమవుతారా..? ఈ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి. మీకు పిల్లలు పుట్టిన తర్వాత బైకింగ్ మానేశారా..? వాస్తవానికి పిల్లలు పుట్టిన తర్వాతనే చాలా మంది బైకింగ్‌ను సీరియస్‌గా తీసుకుంటారు. అప్పటి వరకు అల్లాటప్పాగా నడిపే వారు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా వాహనాలు నడుపుతుండటాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరేమంటారు..?

ఫొటో మూలం: Motorcyclist Magazine
అపోహలు మరియు వాస్తవాలు..

అపోహలు మరియు వాస్తవాలు..

మరి తెలుసుకున్నారుగా.. మోటార్‌సైక్లింగ్‌కు సంబంధించిన అపోహలు, వాస్తవాలను. మీకు ఏవైనా అపోహలు ఉంటే, [email protected] ఈ-మెయిల్ ఐడిపై మెయిల్ చేయండి.

Most Read Articles

English summary
Motorcycling riding myths are originated in the very biking world and is has a lot of supporters among both riders and custom after-market exhaust pipes manufacturers. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X