ధోనీ వాహనానికి అడ్డుపడిన అమ్మాయి: ఏం కావాలంటోందో తెలుసా ?

Written By:

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనికి దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. తన సొంతం నగరం రాంచీ నుండి వెహికల్‌లో బయలుదేరాడు అనుకోండి అంతే సంగతులు, అయస్కాంతానికి ఇనుప చువ్వలు ఆకర్షితమైనట్లు ఫ్యాన్స్ చుట్టుముట్టేస్తారు. అయితే ధోనికి ఓ యువతి నుండి అనుకోని సంఘటన ఎదురైంది.

ధోని తన హమ్మర్ వాహనంలో ఉన్నది గుర్తించిన అభిమాన యువతి ధోని వాహనానికి ముందు తిష్ట వేసింది. అప్పటికీ ధోనీ తప్పుకోమని కోరుతున్నాడు. అయినా కూడా తనకేమీ పట్టనట్లు కావాలనే వాహనాన్ని నిలువరించింది.

ఓ ఫ్యాన్‌గర్ల్ ఇలా తనను నిలువరిస్తోందని తలచుకుంటే మనస్సుల్లో కాస్త ఆనందంగానే అనిపిస్తుంది. కానీ ఆమె ధోనీ వాహనాన్ని ఎందుకు ఆపిందో తెలుసా ? ధోనీ వాహన దిగివచ్చి ఆమెకు ఓ ఆటోగ్రాఫ్ మరియు ఆమెతో ఓ సెల్ఫీ దిగివెళ్లాలని డిమాండ్ చేసింది.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఫ్యాన్‌గర్ల్ ధోనీని ఢిల్లీ నుండి కలకత్తా వరకు ఫాలో అవుతూ వచ్చింది. ధోని ఉన్న విమానంలోనే ఢిల్లీ నుండి కలకత్తా వరకు ప్రయాణించింది. మాజీ కెప్టెన్‌ను కలవడానికి ఎన్ని కష్టాలు పడిందో చూడండి.

డెక్కన్ క్రానికల్ పత్రిక తెలిపిన కథనం మేరకు, విమానాశ్రయానికి వెలుపల ఓ అభిమాని యొక్క హ్యాండ్‌బ్యాక్ రోడ్డు మీద పడిపోగా, దాని మీద దోని హమ్మర్ వాహనం ఎక్కి వెళ్లిపోయింది. అయితే కొద్ది దూరం వెళ్లిన తరువాత ఏమీ జరగలేదు కదా అని నిర్ధారించుకునేందుకు ధోని తల బయటపెట్టి గమనించాడని తెలిపింది.

ధోని హమ్మర్ వాహనం పట్ల ఫ్యాన్స్ ఎంతలా దృష్టిసారిస్తారో తెలిసిందే. సాధారణ ఫ్యాన్స్ మాత్రమే కాదు క్రికెట్ ప్లేయర్స్ కూడా దీనికి అభిమానులో. ఇందు కోసం 2016 లో జరిగిన న్యూజిల్యాండ్ క్రికెట్ మ్యాచ్‌కు ముందు జరిగిన సంఘటన గుర్తుకుతెచ్చుకోవాలి.

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ బస్సులో ఇండియాలో పర్యటిస్తున్నపుడు, ధోని న్యూజిలాండ్ టీమ్ లోని బెస్ట్ ప్లేయర్స్ టామ్ లథాన్ మరియు రోస్ టేలర్ లను హమ్మర్‌లో కూర్చోబెట్టుకుని రాంచీలో వారి బస్సు కన్నా వేగంగా నడిపాడు.

ధోనికి క్రికెట్ మాత్రమే కాదు, బైకులు మరియు కార్లన్నా అమితమైన ఇష్టం. అందులో హమ్మర్‌ అంటే విపరీతమైన ప్రేమ, ప్రస్తుతం ధోని వద్ద ఉన్న హమ్మర్ వాహనం హెచ్2 ను 75 లక్షల ధరతో 2009లో కొనుగోలు చేశాడు.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కార్లు మరియు బైకు గురించి ప్రత్యేక కథనం....

 

Story first published: Friday, March 10, 2017, 11:35 [IST]
English summary
MS Dhoni's Hummer Blocked By Obsessed Fangirl — Here's What happened
Please Wait while comments are loading...

Latest Photos