ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

By Ravi

మనదేశంలో కూడా ఒకే పట్టాపై పరుగులు పెట్టే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే మోనోరైళ్లను, భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ప్రవేశపెట్టారు. మెట్రో రైలు మాదిరిగానే ఉండే ఈ మోనోరైలు సేవలు ఈ శనివారం నుంచి ముంబైలో ప్రారంభం కానున్నాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ ఈ మోనోరైలును శనివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటిరోజు (ఆదివారం) నుంచి ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది. రూ.3000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చింది.

అయితే, ఎట్టకేలకు శనివారం ఈ సర్వీసు ప్రారంభమవుతుండటంతో నిత్యం రద్దీగా ఉండే ముంబై వాసులకు కాస్తంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే పలు దఫాలు విజయంవంతంగా ఈ మోనోరైలును పరీక్షించిన తర్వాత, ఈ సేవలను సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మరిన్ని వివరాలను, మోనోరైల్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరీశిలించండి.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

ముంబైలో రెండు దశల్లో చేపట్టిన ఈ మోనోరైలు ప్రాజెక్టు తొలిదశ సర్వీసును వడాలా-చెంబూర్ పరిధిలో 8.9 కి.మీ. పొడవున నడపనున్నారు.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

రెండవ దశ సర్వీసును సాంతా గాడ్జే మహారాజ్ చౌక్ వరకు పొడిగించనున్నారు.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

మోనోరైలు టికెట్ ధరలు రూ.5 నుంచి రూ.11 మధ్యలో ఉంటాయి.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

మోనోరైల్ మెట్రోరైల్ మాదిరిగా ఒకే కలర్‌లో కాకుండా, పలు రకాల కలర్లలో ఉంటాయి.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

మొదటి దశలో ఆరు మోనో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

తర్వాతి దశలో మరో పది మోనోరైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

నాలుగు బోగీలు ఉండే ఒక్కో మోనోరైలులో సుమారు 560 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు.

ముంబై మోనోరైల్ ప్రయాణం ప్రారంభం

మోనోరైలు గంటకు 80 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

Most Read Articles

English summary
India's first monorail, the Mumbai Monorail, will make its first official run with passengers on saturday. The monorail ran between stations of Chembur and Wadala, covering a Distance of 8.9 kilometers.
Story first published: Saturday, February 1, 2014, 8:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X