గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ లూప్: ముంబాయ్ మరియు పూనేల మధ్య

Written By:

దేశంలో ప్రధాన నగరాలైన ముంబాయ్ మరియు పూనేల మధ్య హై స్పీడ్ రవాణా ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. అల్ట్రా హై స్పీడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌గా పిలువబడే హైపర్ లూప్ ను ఈ రెండు నగరాల మధ్య ఏర్పాటు చేడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమెరికా ఆధారిత హైపర్ లూప్ నిర్మాణ సంస్థ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి ప్రతిపాదించారు.

అమెరికా కేంద్రంగా హైపర్ లూప్ రవాణా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ది మరియు నిర్మాణాలను చేపట్టే సంస్థ అధ్యక్షుడు బిబాప్ గ్రెస్టా తమ బృందంతో ఇండియాలో పర్యటించినపుడు ఈ ప్రతిపాదనలు చేశాడు.

ప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభిస్తే రెండు నగరాల మధ్య హైపర్ లూప్ నిర్మాణానికి సంభందించిన విషయాలను అధ్యయనం చేసిన తరువాత కేవలం 38నెలల కాలంలోనే హైపర్ లూప్ రవాణా మార్గాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించవచ్చని సంస్థ తెలిపింది.

దేశీయ వార్తా పత్రికలకు గ్రెస్టా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇండియాలో ఉన్న రాజకీయ పటిమ, నిర్మాణ విలువల లేమి, మరియు నూతన రవాణా సాధనాలను ఎంచుకోవడానికి సిద్దంగా ఉండటం వలన భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ఆమోదిస్తే హైపర్ లూప్ నిర్మాణానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

హైపర్ లూప్ అనగా, గొట్టాల నిర్మాణంలో ఉన్న వ్యాక్యుమ్ ట్యూబ్‌లు. దీని ద్వారా కేవలం గంటలో 1,200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

హైపర్ లూప్ ట్రాక్ ఒక కిలోమీటర్ నిర్మాణానికి సుమారుగా 40 మిలియన్ డాలర్లు ఖర్చవనుంది. గ్రెస్టా మాట్లాడుతూ హై స్పీడ్ రైళ్లే ట్రాక్ నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చులో ఇది నాలుగవ వంతు మాత్రమే మరియు ప్రదేశాన్ని బట్టి పెట్టుబడిలో వ్యత్యాసం ఉంటుందని ఆయన తెలిపాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కి పైగా దేశాలు వీటి నిర్మాణ మీద ఆసక్తి కనబరుస్తున్నాయి. మరియు స్లోవేకియా, నైజీరియా, అబుదాబి మరియు అమెరికాలోని కాలిఫోర్నియాలలో వీటి నిర్మాణం ఇప్పటికే ప్రారంభమయ్యింది.

ఇండియాలో ఉన్న కేవలం ముంబాయ్ పూనే మార్గాలలోనే కాకుండా ఇతర మార్గాల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు గ్రెస్టా తెలిపాడు.

జపాన్‌కు చెందిన మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబాయ్ మరియు అహ్మదాబాద్ నగరాల మధ్య రానుంది. ఈ నగరాల మధ్య ప్రయాణం కేవలం రెండు గంటలు మాత్రమే ఉండనుంది.

గంటకు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌కు మొత్తం 98,000 కోట్ల రుపాయలు ఖర్చవనుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, December 9, 2016, 14:42 [IST]
English summary
A Mumbai-Pune Hyperloop Project Could Soon Be Real
Please Wait while comments are loading...

Latest Photos