బుల్లెట్ ప్రూఫ్ కారు వచ్చేంత వరకు ఎన్టీఆర్ స్వంత కారులోనే..

ఇది నిజంగా మహానుభావుడికి మహా సత్కారం అని చెప్పవచ్చు. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా తెలియజెప్పిన సీనియర్ తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) గారి జ్ఞాపకార్థం, ఆయన విగ్రహాన్ని భారత పార్లమెంటు ఆవరణలో మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు స్పీకర్ మీరా కుమార్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌కు దక్కిన ఈ ఘనత ప్రతి తెలుగువారికి దక్కిన ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయనను మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చేంత వరకు కూడా ఆయన తన స్వంత కారులోనే ప్రయాణించే వారని ఎన్టీఆర్‌కు డ్రైవర్‌గా పనిచేసిన లక్ష్మణ్ ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్టీఆర్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు భగవద్గీత, శివస్తుతి వినేవారని, ఒక్క రూపాయి జీతం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆరేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 1984లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎన్టీఆర్ తలకు 16 కుట్లు పడ్డాయట.

నందమూరి తారక రామారావు అప్పట్లో 1938 మోడల్‌కు చెందిన ఓ పురాతన కారును ఉపయోగించేవారు (క్రింది ఫొటోలో చూడొచ్చు). ఈ టాప్‌లెస్ కారులో ఆయన ప్రయాణిస్తునప్పుడు వెనుక అంబాసిడర్ కార్లు కాన్వాయ్‌గా వెళ్లేవి. ఈ కారును ఎన్టీఆర్ ఎస్టేట్స్ పేరుపై రిజిస్టర్ చేయించారు.

Nandamuri Taraka Rama Rao

Image Credits: Tollywodrockz
Most Read Articles

English summary
After 13 year-old controversy over installation of the statue of TDP founder president and former chief minister N.T. Rama Rao in Parliament House, Today the statue has been unveiled at 10.30am by Lok Sabha Speaker Meira Kumar near the entrance of the Rajya Sabha. On this occasion we remember his vintage car journey on Indian roads.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X