నందన్ నీలేకని.. ఎవరితను, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు?

By Ravi

'నందన్ నీలేకని' తాజా రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు ఇది. ఎవరీ నందన్ నీలేకని? ఎందుకు ఇతని గురించి అంతగా చర్చించుకుంటున్నారు? ఇతని రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న మర్మమేమటి? సగటు ఓటరు మదిలో ప్రస్తుతం ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కథనంలో మనం వాటన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

మనకు భారతీయుడిగా ఓ విశిష్ట గుర్తింపునిచ్చేలా తయారు చేసిన ఆధార్ (యూఐడీఏఐ) చైర్మనే ఈ నందన్ నిలేకని. ఈయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌లో కూడా సీఈఓగా పనిచేశారు. ఐటి విభాగంలో ఎనలేని తెలివితేటలు సంపాధించుకున్న ఈ నందన్ నీలేకని ప్రస్తుతం పాపాల పుట్టగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరారు.

కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాలోనే ఆయనకు చోటు కల్పించారు. నీలేకనికి దక్షిణ బెంగళూర్ లోక్ సభ నియోజకవర్గాన్ని కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను వెల్లడించిన అనంతరం నీలేకని కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. పార్టీలో చేరినదే తడవుగా నందన్ రాజకీ ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ మోడిఫైడ్ మహీంద్రా థార్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీని తన క్యాంపైన్ వెహికల్‌గా ఎంచుకున్నారు.

జననం, విద్యార్హత

జననం, విద్యార్హత

నందన్ నీలేకని జూన్ 2, 1955న కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జన్మించారు. ముంబై ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు.

కెరీర్

కెరీర్

నందన్ నీలేకని 1978 లో ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌‌లో చేరారు. ఆ తర్వాత 1981లో నారాయణమూర్తి నాయకత్వంలో ఆరుగురు కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. అనంతరం 2002 మార్చిలో ఇన్ఫోసిస్‌‌కు ఆయన సీఈఓగా ఎన్నికయ్యారు. 2007వ సంవత్సరం వరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌‌గా పనిచేశారు. 2006వ సంవత్సరంలో నీలేకనికి పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది.

టైమ్ మ్యాగజైన్ గుర్తింపు

టైమ్ మ్యాగజైన్ గుర్తింపు

2006వ సంవత్సరంలో నందన్ నీలేకని టైమ్ మేగజేన్ ప్రచురించిన ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాల్లో ఆయన్ని చేర్చింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ నాలెడ్జ్ సొసైటీలో కూడా ఆయన సభ్యుడిగా పని చేశారు.

ఆధార్

ఆధార్

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఆధార్) అధ్యక్షుడిగా నందన్ నీలేకని 2009లో బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన యూఐడీఏఐ ఛైర్మన్ పదవికి మార్చ్ 13, 2014వ తేదీన రాజీనామా సమర్పించారు.

ఆస్తుల విలువ రూ.7700 కోట్లు

ఆస్తుల విలువ రూ.7700 కోట్లు

నందన్ నీలేకని, ఆయన భార్య అధికారిక ఆస్తుల విలువ రూ.7700 కోట్లు. దక్షిణ బెంగుళూరు లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్న ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఈ వివరాలు పేర్కొన్నారు. తన సంస్థలు అనూహ్య విజయాలను సాధించడంతో ఆస్తుల విలువ రూ.7700 కోట్లకు చేరిందని నీలేకని వివరించారు.

ఇన్ఫోసిస్‌లో వాటాలు

ఇన్ఫోసిస్‌లో వాటాలు

నీలేకని దంపతుల సంపదలో ఎక్కువ భాగం (దాదాపు 80 శాతం) ఇన్ఫోసిస్‌లో వాటాల రూపంలో ఉంది. ఈ కంపెనీలో నీలేకనికి 1.45 శాతం, ఆయన భార్యకు 1.3 శాతం మేర వాటాలు ఉన్నాయి. (ఆస్తులను కాపాడుకునేందుకే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి).

సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు

నందన్ నీలేకని 1999వ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాల కోసం సుమారు రూ.400 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.

మహీంద్రా థార్ గురించి..

మహీంద్రా థార్ గురించి..

సరే ఇదంతా అటుంచి, మహీంద్రా థార్ ఎస్‌యూవీ గురించి పరిశీలిస్తే.. ప్రత్యేకించి ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్లు చేసే ఎస్‌యూవీ ప్రియులను దృష్టిలో ఉంచుకొని మహీంద్రా అండ్ మహీంద్రా ఈ వాహనాన్ని తయారు చేసింది. దీని టాప్-లెస్ ఎన్నికల క్యాంపైన్ వాహనంగా వినియోగించుకునేందుకు కూడా చక్కగా సరిపోతుంది.

ఇంజన్ వివరాలు..

ఇంజన్ వివరాలు..

మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2498సీసీ సిఆర్‌డిఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 105 హెచ్‌పిల శక్తిని, 1800-2000 ఆర్‌పిఎమ్ వద్ద 247 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఫీచర్లు..

ఫీచర్లు..

క్లాసిక్ జీప్ లుక్ కలిగి ఉంటే మహీంద్రా థార్ మోడ్రన్ ఫీచర్లతో లభిస్తుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేక్‌లతో కూడిన శక్తివంతమైన 9 ఇంచ్ బూస్టర్లను ఆఫర్ చేస్తున్నారు. థార్‌లో ఎయిర్ కండిషనింగ్ (డ్రైవర్ క్యాబిన్‌లో) సదుపాయం కూడా ఉంది. పవర్ స్టీరింగ్, 5.25 మీ. టర్నింగ్ రేడియస్, రిమూవబల్ టాప్ వంటి పలు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధరలు

ధరలు

మహీంద్రా థార్ సిఆర్‌డిఈ మరియు డిఐ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* మహీంద్రా థార్ సిఆర్‌డిఈ - రూ.7,23,369

* మహీంద్రా థార్ డిఐ (2 వీల్ డ్రైవ్) - రూ.4,74,352

* మహీంద్రా థార్ డిఐ (4 వీల్ డ్రైవ్) - రూ.5,22,784

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Nandan Nilekani, chairman of UIDAI and co-founder of Infosys, has joined in Congress party recently to contest the Lok Sabha polls. Now Nilekani has bought an all new Mahindra Thar SUV for his election campaign.
Story first published: Thursday, March 27, 2014, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X