మోడీ కాన్వాయ్ విదేశీనే! బిఎమ్‌డబ్ల్యూకే జై కొట్టిన కొత్త ప్రధాని!

By Ravi

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయంతో ప్రధాన్ని పీఠాన్ని దక్కించుకుని, భారతదేశపు 15వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బిజెపి నేత నరేంద్ర మోడీ ఉపయోగించబోయే కాన్వాయ్ స్వదేశీనా లేక విదేశీనా అన్ని ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ప్రధాని కార్యలయానికి సాయుధ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులో కాన్వాయ్‌తో పాటుగా విచ్చేశారు.

దీన్నిబట్టి చూస్తుంటే ఆయన స్వదేశీ వాహనం కన్నా విదేశీ వాహనానికే ఎక్కువ ప్రధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తొలుత అందరూ నరేంద్ర మోడీ మేడ్ ఇన్ ఇండియా సాయుధ స్కార్పియో వాహనాలనే ప్రధాని కాన్వాయ్‌గా ఉపయోగిస్తారని భావించారు. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఈ మేరకు ప్రధానిక భద్రతా అవసరాలకు అనుగుణంగా తమా కార్లను మోడిఫై చేసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించింది.

అయితే, పలు భద్రతా అంశాల దృష్ట్యా భారత ప్రధానికి కేటాయించే అధికారిక కాన్వాయ్‌నే (ఇదివరకు అంబాసిడర్ కార్లు, ప్రస్తుతం బిఎమ్‌‌డబ్ల్యూ కార్లు) మన కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా కేటాయించారు. ఈ కథనంలో ప్రధాని కొత్త కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

మోడీ కాన్వాయ్ విదేశీనే

తర్వాతి స్లైడ్‌లలో భారత ప్రధానమంత్రి (ప్రస్తుతం నరేంద్ర మోడీ) ఉపయోగించే సెక్యూరిటీ కాన్వాయ్ గురించి తెలుసుకోండి..!

మోడీ కాన్వాయ్ విదేశీనే

సాధారణంగా భారత ప్రధానమంత్రి (ప్రస్తుతం నరేంద్ర మోడీ) ఉపయోగించే కాన్వాయ్‌లో 7 బుల్లెట్ ప్రూఫ్ ఎక్స్‌5 ఎస్‌యూవీలు, 5 మోడిఫైడ్ టాటా సఫారీలు మరియు 2 అత్యధికంగా మోడిఫై చేసిన బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సెడాన్ కార్లు (మొత్తం 14 వాహనాలు) ఉంటాయి.

మోడీ కాన్వాయ్ విదేశీనే

ప్రస్తుత ప్రధాని కాన్వాయ్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 వాహనాలను ఎస్‌పిజి బలగాలు ఉపయోగిస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కార్లలో ఒకదానిలో ప్రధాని కూర్చుకుంటారు. ఇంకొకదానిని డెకాయ్ వెహికల్‌గా ఉపయోగిస్తారు. టాటా సఫారీలను జామర్లుగా, బాంబ్ డిటెక్టర్లుగా ఉపయోగిస్తారు.

మోడీ కాన్వాయ్ విదేశీనే

వాస్తవానికి, చాలా కాలం నుంచి అంబాసిడర్ కార్లనే ప్రధానమంత్రి అధికారిక కాన్వాయ్‌గా ఉపయోగిస్తూ వస్తున్నప్పటికీ, పలు భద్రతా అంశాల దృష్ట్యా 2003 ప్రాంతంలో (అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు) భారత ప్రభుత్వం అంబాసిడర్ కార్లను తొలగించి వాటి స్థానంలో బిఎమ్‌డబ్ల్యూ కార్లను ప్రవేశపెట్టింది.

ఇది కూడా చదవండి: ముగిసిన అంబాసిడర్ శకం, ఉత్పత్తి బంద్!

మోడీ కాన్వాయ్ విదేశీనే

ప్రధానమంత్రికి కేటాయించిన బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లను ధృడమైన స్టీల్‌తో తయారు చేయబడి ఉంటాయి. ఇవి బుల్లెట్ దాడులు, బాంబు దాడులను తట్టుకుని కారు లోపల ఉండే వారికి అన్ని వైపుల నుంచి రక్షణను ఇస్తాయి. ఈ కార్లలో అధునాతన సాంకేతిక వ్యవస్థ, అలారమ్ సిస్టమ్‌లు ఉంటాయి. టైర్లు పంక్చర్ అయినా సరే ఇవి ఫ్లాట్ టైర్లపై కూడా మైళ్ల దూరం పరుగులు తీయగలవు.

మోడీ కాన్వాయ్ విదేశీనే

కారు క్రింది భాగంలో పేలుడు సంభవించినా ఫ్యూయెల్ ట్యాంక్ పేలిపోకుండా ఉండేలా ఇందులో ఏర్పాటు చేశారు. బాంబులు, మిస్సైళ్లను గుర్తించేందుకు ఇందులో అధునాతన హీట్ సెన్సార్లు ఉంటాయి. కారులో క్యాబిన్ గ్యాస్ ప్రూఫ్ చాంబర్‌గా ఉంటుంది. రసాయన, గ్యాస్ దాడుల నుంచి ఇది క్యాబిన్‌లోని ప్రయాణీకులను రక్షిస్తుంది.

మోడీ కాన్వాయ్ విదేశీనే

భారత ప్రధానమంత్రి ఉపయోగించే కారు ఆర్మోర్డ్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760ఎల్ఐ హై సెక్యూరిటీ ఎడిషన్'. ఇది చూడటానికి రెగ్యులర్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 745ఎల్ఐ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. విఐపిలు ఉపయోగించే ప్రపంచంలో కెల్లా హై సెక్యురిటీ వాహనాల్లో ఈ 760ఎల్ఐ హై సెక్యూరిటీ మోడల్ కూడా ఒకటి. ఇది క్లాస్ బి6/బి7 బల్లిస్టిక్ ప్రొటెక్షన్‌ను (భద్రతా ప్రమాణాల్లో అత్యున్నతమైనది) ఆఫర్ చేస్తుంది.

మోడీ కాన్వాయ్ విదేశీనే

ఈ వాహనాలను సాధారణ డ్రైవర్లు ఆపరేట్ చేయలేరు. ఇందుకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. అందుకే బిఎమ్‌డబ్ల్యూ తమ 'ట్రైనింగ్ ఫర్ ప్రొఫెషనల్స్' కోర్స్ క్రింది వీరికి శిక్షణ ఇస్తుంది. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలా స్పందించాలో, కారులోని ఫీచర్లను ఎలా ఆపరేట్ చేయాలో వారికి తెలియజేస్తుంది.

మోడీ కాన్వాయ్ విదేశీనే

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 760ఎల్ఐ హై సెక్యూరిటీ కారులో 6.0 లీటర్, వి-12, 439 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది (రియల్ వీల్ డ్రైవ్). ఈ కారు కేవలం 7.5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మోడీ కాన్వాయ్ విదేశీనే

ఇది కూడా చదవండి: మరిన్ని హైసెక్యూరిటీ వాహనాలు

Most Read Articles

English summary
India's 15th Prime Minister Mr. Narendra Modi has opted for a specially designed armoured BMW 7-Series as his official car. On his first day to office, Mr. Modi came chauffeured in a BMW 7-Series, given to the Prime Minister in India. Take a look at this car.
Story first published: Friday, May 30, 2014, 11:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X