రాత్రివేళల్లో స్వయంగా ప్రకాశించే రోడ్డును ప్రారంభించిన నెథర్లాండ్స్

By Ravi

నెథర్లాండ్స్ దేశం స్వయం ప్రకాశిత రోడ్లను నిర్మిస్తున్నట్లు మనం గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రచురించిన కథనంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ తరహా రోడ్లను ప్రజల కోసం ఓపెన్ చేస్తున్నట్లు నెథర్లాండ్స్ ప్రకటించింది. ఓస్స్‌లోని ఎన్329 జాతీయ రహదారిని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారు. ఈ స్వయం ప్రకాశిత రోడ్లను నెథర్లాండ్స్‌లో ప్రయోగపూర్వకంగా పరీక్షించిన తర్వాత ప్రజల కోసం వీటిని ఓపెన్ చేశారు.

ఈ రోడ్ రూపకర్తలు ఎవరు?
డాన్ రూస్‌గార్డ్ అనే డిజైనర్ మరియు పరిశోధకుడు డచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ హీజ్‌మ్యాన్స్‌తో కలిసి, స్మార్ట్ హైవే ప్రాజెక్టులో భాగంగా ఈ స్వయం ప్రకాశిత రోడ్లను ప్రారంభించారు.


ఈ రోడ్లను ఎలా నిర్మిస్తారు, ఇవి ఎలా పనిచేస్తాయి?
ఫోటో ల్యూమినైజింగ్ పౌడర్ కలిగిన పెయింట్‌తో రోడ్డు పక్కల మార్కింగ్స్ వేస్తారు. ఈ ఫోటో ల్యూమినైజింగ్ పౌడర్‌కు ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. అదేంటంటే, ఈ పౌడర్ పగటిపూట సూర్యకాంతిని గ్రహించి చార్జ్ అయ్యి, రాత్రివేళల్లో నెమ్మదిగా కాంతిని విడుదల చేస్తూ లైట్ గ్రీన్ కలర్‌లో ప్రకాశిస్తూ ఉండి (రేడియం మాదిరిగా) వాహనా చాలకులకు దారి చూపుతుంది.

వాహన చాలకులకు ఈ రోడ్లు ఎలా ఉపయోగపడుతాయి?
సూర్యకాంతిని గ్రహించే ఈ పెయింట్ రాత్రివేళల్లో 8-10 గంటల వరకు ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలా ప్రకాశించే రోడ్ సైడ్ మార్జిన్స్ వాహన చాలకులకు రోడ్డు గురించి దిశానిర్ధేశం చేయటమే కాకుండా, రాత్రివేళల్లో రోడ్డుపై విజిబిలిటీని పెంచేలా చేసి, ప్రమాదాలను అరికట్టేందుకు సహకరిస్తుంది.

వీధి లైట్ల సమస్య ఉండదు, విద్యుచ్ఛక్తి ఆదా!
ఈ రోడ్లు పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఇక రోడ్లపై వీధి లైట్లను ఏర్పాటు చేయటం, వాటికి కరెంటును అందించటం వంటి సమస్యలు ఉండవు. దీని వలన కోట్ల రూపాయల విలువైన విద్యుచ్ఛక్తి ఆదా అవుతుంది.
Glow In The Dark Road 3

Source: Smart Highway
Most Read Articles

English summary
Drivers on a road in the Netherlands are now being guided by glow-in-the-dark road markings. It is the first time "glowing lines" technology has been piloted on the road and can be seen on the N329 in Oss, approximately 100km south east of Amsterdam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X