టైటానిక్-2 షిప్ వస్తోంది, టైటానిక్-1 గురించి మరచిపోండి

పాత టైటానిక్ షిప్‌ను మరిచిపోవడానికి సరికొత్త టైటానిక్-షిప్‌ను అతి త్వరలో సముద్ర మీదకు తీసుకురానున్నారు.

By Anil

జరిగిపోయిన సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చేదాన్నే చరిత్ర అంటారు. మీరు దీనితో ఏకీభవిస్తారా ? ఖచ్చితంగా ఏఖీభవించాల్సిందే. ఎందుకంటే ఓ సారి టైటానిక్‌ను గుర్తుకు తెచ్చుకోండి. మీరు కూడా అవునంటారు. నిజంగా టైటానిక్ ఓడ మునక గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి తెలియదు అయితే టైటానిక్ సినిమా ద్వారా ఎంతో మంది తెలుసుకున్నారు.

టైటానిక్ ఓడ మునిగి పోయి దాదాపు 100 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ టైటానిక్ గురించి వచ్చే ప్రతి సమాచారాన్ని స్వాగతిస్తున్నారు. పాత రోజులు టైటానిక్‌ను గురించి గుర్తు చేసి టైటానిక్ ప్రేమికులను భాదపెడుతుంటే రానున్న కొత్త రోజులు వారికి సంతోషాన్ని మిగల్చనున్నాయి. అవును మీరు విన్నది నిజమే, 2018 నుండి టైటానిక్-2 సముద్రం మీద పరుగులు పెట్టనుంది.

టైటానిక్-2 గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకోగలరు

మొదటి ప్రయాణం

మొదటి ప్రయాణం

టైటానిక్ ఓడ మునిగిపోయి దాదాపుగా 100 సంవత్సరాలు గడిచిపోయిన నేపథ్యంలో టైటానిక్-2 షిప్ ను 2018 నుండి తన మొదటి ప్రయాణం ప్రారంభించనుంది. దీనికి చెందిన నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ప్రయాణ మార్గం

ప్రయాణ మార్గం

మొదటి సారిగా టైటానిక్ ఓడ ఇంగ్లాండ్ నుండి అమెరికాలోని న్యూ యార్క్‍‌కు ప్రయాణమయ్యింది. ఈ సంధర్భంలోనే మొదటి టైటానిక్ ప్రమాదానికి గురయ్యింది. అయితే ఈ రెండవ టైటానిక్‌ను కూడా అవే దేశాల మధ్య ప్రయాణాన్ని ప్రారంభించనుంది. కాని కొన్ని రిపోర్ట్ ప్రకారం ఇది చైనాలోని జియాంగ్సు నుండి దుబాయ్‌కు ప్రయాణం అవ్వనుందని తెలిసింది.

ఆకృతి (రూపం)

ఆకృతి (రూపం)

ఈ సరికొత్త టైటానిక్-2 మొదటి టైటానిక్ రూపంతో తయారవుతోంది. దీని బాడీ, ఆకృతులు అచ్చం మునిగిపోయిన దానిలానే ఉంటుంది. అయితే మునుపటిలా ప్రమాదాలు జరగకుండా ఇందులో ఆధునిక సాంకేతకతలను వినియోగిస్తున్నారు.

కొలతలు

కొలతలు

ప్రస్తుతం టైటానిక్-2 ఓడ 270 మీటర్ల పొడవు, 53 మీటర్ల ఎత్తు కలదు. ఈ టైటానిక్-2 దాదాపుగా 40,000 బరువు కలిగి ఉంది మరియు 9 లేయర్లుగా దీనిని రూపొందించారు.

ఇటువంటివి ఉండవు

ఇటువంటివి ఉండవు

మునిగిపోయిన ఓడలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మరియు థర్డ్ క్లాస్ అని గదులను మూడు రకాల విభజించారు. కాని ప్రస్తుతం టైటానిక్ -2 లో 840 గదులను ఎటువంటి విభజన లేకుండా కల్పించారు.

 ప్రయాణికుల సామర్థ్యం

ప్రయాణికుల సామర్థ్యం

ఈ సరికొత్త టైటానిక్-2 లో దాదాపుగా 2,400 మంది ప్రయాణించవచ్చు మరియు 900 మంది వరకు ఇందులో సౌకర్యాలను కల్పించడానికి సిబ్బందిగా సమకూర్చుకున్నారు

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఈ టైటానిక్-2 ఓడలో స్విమ్మింగ్ ఫూల్, స్టీమ్ బాత్, టర్కీ బాత్ రూమ్స్, జిమ్, స్మోకింగ్ రూమ్, థియేటర్, మరియు స్టేడియం వంటి ఎన్నో ఇందులో ఉన్నాయి.

వస్త్రాలు

వస్త్రాలు

మీరు టైటానిక్‌ సినిమాను గమనించినట్లయితే అందులో ప్రయాణికుల వస్త్రదాణ 1920 ల కాలంనాటికి చెందినట్లుగా ఉంటాయి. అందుకోసం ప్రత్యేకంగా ప్రస్తుతం టైటానిక్-2 షిప్ లో ప్రయాణించబోయే వారికి అచ్చం అలాంటి వస్త్రాలను ఇవ్వనున్నారు.

భద్రత

భద్రత

ఓడలు ప్రమాదానికి గురయితే ఆ ప్రమాదం నుండి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం లైఫ్ బోట్లు. మునిగిపోయిన టైటానిక్ ఓడలో తగినన్ని లైఫ్ బోట్లు లేకపోవడం మరియు ఉన్న బోట్లను సరైన ప్రదేశం ఉంచకవపోవడం అని తేలింది. అందుకోసం నయా టైటానిక్‌లో వీలైన్ని ఎక్కువ లైఫ్ బోట్లను అన్ని ప్రమాణాలను అనుసరించి అందుబాటులో ఉంచనున్నారు.

టైటానిక్-2 యాజమాని

టైటానిక్-2 యాజమాని

ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్ క్లేవ్ పాల్మర్. ప్రఖ్యాత బ్లూ స్టార్ లైనింగ్ షిప్పింగ్ సంస్థకు అధినేత. ప్రస్తుత చైనాలో దీనికి చెందిన నిర్మాణం కొనసాగుతోంది.

పెట్టుబడి

పెట్టుబడి

ఈ టైటానిక్-2 నౌక కోసం దాదాపుగా 500 మిలిన్ డాలర్లను ఖర్చుపెడుతున్నారు.

 టైటానిక్ ఎంతో ఆసక్తికరమైది

టైటానిక్ ఎంతో ఆసక్తికరమైది

మీరు టైటానిక్ గురించి ఇంత సమాచారం ఎక్కడైనా పొందారా...? ఇది కేవలం టైటానిక్-2 గురించి మాత్రమే. మునిగిపోయిన పాత టైటానిక్ గురించి ఎంతో ఆసక్తికరమైన విశయాలు తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

ఘోరం

ఘోరం

సముద్రానికి రాణిగా పిలువబడే మొదటి టైటానిక్ ఓడలో దాదాపుగా 3,547 మంది ప్రయాణించారు. మంచు కొండను ఢీకొట్టిన ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో కేవలం 706 మంది మాత్రమే లైఫ్ బోట్ల ద్వారా ప్రాణాలు దక్కించుకున్నారు. మైనస్ 2 డిగ్రీల ఉష్ణోగ్రత గల సముద్రపు నీటిలో మిగిలిన వారంతో గడ్డకట్టుకుపోయి మరణించారు.

విధ్యుద్దీపాలు

విధ్యుద్దీపాలు

టైటానిక్ ‌లో మొదటిసారిగా టెలిఫోన్ మరియు ఎలక్ట్రానిక దీపాలను ఉపయోగించారు. ఇలా ఈ రెండింటిని వినియోగించుకున్న మొదటి ఓడ కూడా ఇదే

కొండను మింగే ఇంజన్

కొండను మింగే ఇంజన్

టైటానిక్ కొండను మింగే ఇంజన్ అనేది అక్షరాలా నిజమే. ఎందుకంటారా ఇది ఒక రోజు ప్రయాణానికి దాదాపుగా 800 టన్నుల బొగ్గును ఆరగించేస్తుంది.

ఎత్తు

ఎత్తు

టైటానిక్ షిప్ అడుగు భాగం నుండి, దీని పొగ గొట్టం చివరి వరకు ఉన్న ఎత్తు దాదాపుగా 17 అంతస్థుల భవనానికి సమానంగా ఉంటుంది.

వెడల్పు

వెడల్పు

టైటానిక్ పొడవు మూడు ఫుట్ బాల్ స్టేడియంలకు సమానంగా ఉంటుంది.

 వేగం

వేగం

టైటానిక్ షిప్ గంటకు 23 నాటికల్ మైళ్ల వేగంతో పరుగులు పెడుతుంది. అయితే ఇది అత్యధికంగా గంటకు 43 కిలోమీటర్ల వేగంతో సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్లగలదు.

అప్పట్లో లిఫ్ట్ సౌకర్యాలు

అప్పట్లో లిఫ్ట్ సౌకర్యాలు

మొదటి టైటానిక్ ఓడలో నాలుగు లిఫ్ట్‌లు ఉండేవి , వీటితో పాటు వేడి నీళ్లు గల స్విమ్మింగ్ ఫూప్, ఫిట్‌నెస్ సెంటర్, రెండు లైబ్రరీలు మరియు రెండు క్షవరం చేసే సెంటర్లు కూడా ఉండేవి.

నీటి వినియోగం

నీటి వినియోగం

ఈ నౌకలో ప్రయాణించే వారి కోసం రోజుకు 53,000 వేల త్రాగు నీరు అవసరమయ్యేది.

డమ్మీ పొగ గొట్టం (చిమ్నీ)

డమ్మీ పొగ గొట్టం (చిమ్నీ)

మీరు విన్నది నిజమే . టైటానిక్ ఓడలో గల నాలుగు చిమ్నీలలో మూడు మాత్రమే పొగను విడుదల చేస్తాయి. మూడు చిమ్నీల ద్వారా ఇది అందాన్ని కోల్పోతుందని దీనికి అదనంగా మరొక చిమ్నీని అందించారు.

టికెట్ ధర

టికెట్ ధర

ఇందులోని మొదటి శ్రేణి టికెట్ ధర దాదాపుగా 99,000 వేల డార్లుగా ఉండేది. ప్రస్తుతం భారతీయ రుపాయితో లెక్కకడితే దాదాపుగా 50 మిలియన్లు ఉంటాయి.

ఆహారం

ఆహారం

ఇందులో ప్రయాణించే ప్రయాణికులకు మరియు నౌకలో పని చేసే వారి ఆహారం కోసం దాదాపుగా రోజుకు 86,000 కిలోల మాంసం, 40,000 కోడిగుడ్లు, 40 టన్నుల బంగాళ దుంపలు, 3,500 పౌండ్లు ఉల్లిపాయలు, ఆపిల్స్ మరియు 1,000 శాండవిచ్‌లు 36,000 ఆహార పొట్లాలను సమకూర్చే వారు.

టైటానిక ఈ భూప్రపంచంలో ఒక అత్భుతం

టైటానిక ఈ భూప్రపంచంలో ఒక అత్భుతం

టైటానిక్ చూశారు కదా అందుకే సినిమాలోని టైటానిక్ మరియు అసలైన టైటానిక్ షిప్ మధ్య గల తేడాలు తెలుసుకోండి.

Most Read Articles

English summary
New Titanic Ship Is Set Sail 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X