ఆ లిస్టులో చేరిపోయిన రోహిత్ శర్మ

Written By:

ఈ పాపులర్ అయినోళ్లంతా ఇంతే ఒక వేపు ప్రొఫెషన్ మరొవైపు ప్రకటనల రంగంలో దూసుకుపోతుంటారు అని అక్కడక్కడ కొంత వాపోతుంటారు. నిజమే కదండి. ప్రజలలో కొంత ఫోలోయింగ్ వచ్చిందంటే చాలు అంతర్జాతీయంగా ఉన్న బడా బడా సంస్థలు భారీ ప్యాకేజితో వచ్చి మాతో చేతులు కలపండి అంటూ వాలిపోతుంటారు.

ఇలాంటి సందర్భాలను చాలా సెలబ్రిటీలు కూడా ఫేస్ చేసి ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మన టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. ఈ ఆటగాడు ఇంతకు ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉండేవాడు. కాని జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్‌తో జట్టు కట్టాడు.

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మన క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మతో పాటు అంతర్జాతీయంగా గల ప్రఖ్యాత ఆటగాళ్లను బ్రాండ్ అంబాసిడర్ చేర్చుకుంది.

ప్రస్తుతం నిస్సాన్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా చేరిన వారిలో అండ్రీ రస్సెల్, న్యూజిలాండ్ కెప్టెట్ సుజి బేట్స్ ఉన్నారు.

వచ్చే ఐసిసి ట్వంట్వీ20 ప్రపంచ కప్ మార్చి 8 న జరగనుంది. దీనిని వేదికగా చేసుకుని నిస్సాన్ తమ ప్రచారాన్నిప్రారంభించనుంది.

నిస్సాన్ ఒకేసారి ముగ్గురు క్రికెటర్లను బ్రాండ్ అంబాసిడర్‌గా చేర్చుకున్న తరువాత ప్రమోషన్ మీద బాగా దృష్టి పెట్టిందని చెప్పకనే తెలుసుస్తోంది. దీనికి సంభందించి సామాజిక మాధ్యమాలలో విపరీతమైన హల్‌చల్ చేస్తోంది.

రోహిత్ శర్మ మాట్లాడుతూ, నిస్సాన్ సంస్థతో కలిసి పనిచేయడానికి మరియు రాబోయే టి20 వరల్డ్ మ్యాచ్‌ ద్వారా ప్రేక్షలకు మరింత చేరువ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

మార్చి 8 న జరగనున్న ప్రపంచ ట్వంటీ20 ఆటలో భారత్‌ విజయం సాధించడానికి నావంతు కృషి చేయడానికి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, ఇది తనకు ఎంతో ముఖ్యమై వరల్డ్ కప్ మ్యాచ్ అని ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పుకొచ్చాడు.

ఐసిసి తో నిస్సాన్ కుదుర్చకున్న ఒప్పందం 2023 వరకు జరగబోయే మాచ్‌లలో చెల్లుబాటు అవనుంది.

ఐసిసి ఆధ్వర్యంలో జరగనున్న ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్, ఐసిసి ఛాంపియన్ ట్రోఫి, ఐసిసి ప్రపంచ ట్వంటీ20 మరియు అండర్ -19 ఉమెన్స్ వంటి మ్యాచ్‌లలో నిస్సాన్ తమన తాము ప్రమోట్ చేసుకోనుంది.

నిస్సాన్ ఆటలకు సంభందించి ఎల్లప్పుడూ స్పాన్సర్‌గా ఉంటుందని మరో సారి నిరూపించింది. ఎందుకంటే యుఇఎఫ్‌ఎ ఛాంపియన్ లీగ్ మరియు సిటి ఫుట్ బాల్ గ్రూప్ లకు స్పాన్స‌ర్‌ చేస్తోంది.

వీటితో పాటు రియో 2016 ఒలంపిక్ మరియు పారాలంపిక్ ఆటలకు కూడా ఇది స్పాన్సర్‌షిప్ ప్రకటించింది.

English summary
Nissan Names Rohit Sharma As Global Ambassador
Please Wait while comments are loading...

Latest Photos