అణు పరీక్షలు ఆపమంటూ దక్షిణ కొరియా మరియు అమెరికాలకు వార్నింగ్

By Anil

అమెరికా మరియు నార్త్ కొరియా (ఉత్తర కొరియా) ఈ రెండింటి మధ్య వైరం ఎలా ఉందంటే కుక్క పిల్లికి మధ్య ఉన్నంత వైరం. కనీసం ఈ రెండయినా అప్పుడు జాతివైరాన్ని మరిచిపోయి కలిమెలిసి ఉంటాయి. కాని ఈ రెండు దేశాలు కలలో కూడా పరస్పరం ద్వేషించుకుంటా మీ అంతం కాదు మీ అంతం అంటూ తలలెగరేస్తున్నాయి. అయితే వీరి వలన ప్రపంచమే నాశనం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాజాగా నార్త్ కొరియా ఖండాతర బాలిస్టిక్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా ప్రధాని మాట్లాడుతూ అమెరికా మరియు దాని ఉత్తర కొరియా మరొక శత్రు దేశమైన దక్షిణ కొరియాలకు అణు పరీక్షలను అపండంటూ హెచ్చరించింది. మరిన్ని వివరాలు క్రింది కథనం...

 ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించిన నార్త్ కొరియా

ఉత్తర కొరియా అమెరికా మరియు దక్షిణ కొరియాల మీద తీవ్రమైన మాటల యుద్దం కొనసాగతోంది. అయితే ఈ మాటల యుద్దం కాస్త అసలయిన యుద్దంగా మారితే ప్రపంచం మొత్తం అంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక దాన్ని మించి మరొకటి భారీ స్థాయిలో ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. అందులో తాజాగా నార్త్ కొరియా సబ్‌మెరైన్ ఆధారంగా ఖండాంతరం బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి విజయవంతమైనాయి కూడా.

 జలాంతర్గామి (సబ్‌మెరైన్)

జలాంతర్గామి (సబ్‌మెరైన్)

నార్త్ కొరియా జలాంతర్గామి ఆధారంగా జపాన్ వైపున్న సముద్రంలో బాలిస్టిక్ మిస్సైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించింది.

విజయం

విజయం

బాలిస్టిక్ మిస్సైల్ విజయానందంలో ఉన్న నార్త్ కొరియా దక్షిణ కొరియాలోని సియోల్ మీద మరియు అమెరికా మీద దాడులు జరపడానికి మరింత బలం చేకూరిందని నార్త్ కొరియా ప్రధాని కిమ్ జాంగా ఉన్ తెలిపాడు.

ప్రయాణ దూరం

ప్రయాణ దూరం

నార్త్ కొరియా ప్రయోగించిన నూతన బాలిస్టిక్ మిస్సైల్ కొన్ని సెకండ్ల కాలంలోనే 30 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే వీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మించి ఇది ప్రయాణించినట్లు ప్రకటించారు. అంతే కాకుండా జలాంతర్గామి నుండి ప్రయోగించిన ఈ మిస్సైల్‌ను సబ్‌మెరైన్ కనీసం 300 కిలోమీటర్ల వేగంతో ఉన్నప్పుడు కూడా ప్రయోగించవచ్చు.

ప్రత్యర్థుల కళ్లు తెరిపించడం కోసం

ప్రత్యర్థుల కళ్లు తెరిపించడం కోసం

నార్త్ కొరియా సబ్‌మెరైన్ ఆధారంతో ప్రయోగించిన ఈ మిస్సైల్ విజయవంతమైన నేఫథ్యంలో తమ చిరకాల ప్రత్యర్థులైన అమెరికా మరియు దక్షిణ కొరియాల కళ్లు తెరిపించిందిని చెప్పుకొచ్చారు.

అధ్యక్షుని కళ్లారా

అధ్యక్షుని కళ్లారా

ఒక విషయం ఆలోచించండి క్రితం రోజున ఇండియన్ ఇస్రో దేశీయ జిపిఎస్ పరిజ్ఞానానికి చెందిన ఐఆర్ఎన్‌ఎస్ శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించింది. దీనిని మన నాయకులు ఎంత మంది దగ్గరుండి పర్యవేక్షించారు. కాని నార్త్ కొరియా ప్రధాని బాలిస్టిక్ మిస్సైల్స్‌కు చెందిన ప్రయోగాలను మరియు పరీక్షలను దగ్గరుండి పర్యవేక్షించారు.

అణు పరీక్షలు

అణు పరీక్షలు

నార్త్ కొరియా ప్రయోగించిన మిస్సైల్స్‌లలో అణు దాడులు జరిపే ఆయుధాలను కూడా అమర్ఛారు. ఇవి యుద్ద సమయంలో శత్రు దేశాలను ఖచ్చితంగా హరిచివేస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

ఒప్పందాల ఉల్లంఘన

ఒప్పందాల ఉల్లంఘన

నార్త్ కొరియా తాజాగా పరీక్షించిన ఖండాతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ద్వారా అంతర్జాతీయ ఆయుధాల ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని అమెరికా తీవ్రంగా విమర్శలు చేస్తోంది.

బాలిస్టిక్ మిస్సైల్

బాలిస్టిక్ మిస్సైల్

బాలిస్టిక్ మిస్సైల్స్ ఖండాంతరాలను దాటి దీర్ఘ శ్రేణి గల లక్ష్యాలను చేధించి దాడులను చేస్తుంది. ఈ బాలిస్టిక్ మిస్సైల్ ఎంతో శక్తివంతమైనది.

గమ్యాలు

గమ్యాలు

ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ ప్రపంచానికే ముప్పు వాటిల్లే పరస్థితిని తీసుకొస్తున్నాయి ఇలాంటి దేశాలు. వీటి గమ్యం ఏంటో, వీరు ఎవరి అంతాన్ని కోరుకుంటున్నారో గాని. ఇది ఇలాగే కొనసాగితే చిన్ని మనస్పర్థల కారణంగా జరిగే దాడులు ప్రపంచానే నాశనం చేస్తాయి.

 ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించిన నార్త్ కొరియా

ప్రపంచ వ్యాప్తంగా అధిక జలాంతర్గామిలను కలిగి ఉన్న దేశాలు

Most Read Articles

English summary
North Korea Launches Ballistic Missile From Submarine
Story first published: Friday, April 29, 2016, 10:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X